Rebel Star Prabhas: టాలీవుడ్ లో ఒక హీరో కోసం రాసుకున్న కథ మరో హీరో వద్దకు వెళ్లడం , ఒక హీరో కోసం రిజిస్టర్ చేసిన టైటిల్ మరో హీరో సినిమాకు ఫిక్స్ అవ్వడం కొత్తేమి కాదు. టాలీవుడ్ లోనే కాదు , ఏ ఇండస్ట్రీ లో అయినా ఇది సర్వ సాధారణం. గతంలో మహేష్ బాబు కోసం అనుకున్న ఒక టైటిల్, చివరికి ప్రభాస్ కి ఫిక్స్ అయ్యిందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రభాస్ , దశరధ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న ప్రభాస్ కి యూత్ లో కూడా ఆయన క్రేజ్ ని తారా స్థాయికి తీసుకెళ్లిన చిత్రమిది. అయితే ఈ సినిమా టైటిల్ ని ముందుగా మహేష్ బాబు , సురేందర్ రెడ్డి మూవీ కోసం రిజిస్టర్ చేశారట.
అతిధి చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యినప్పటికీ , మహేష్ బాబు కి సురేందర్ రెడ్డి టేకింగ్ నచ్చడం తో మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఆరోజుల్లో RR మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని అనుకున్నారు.కానీ కొన్ని అనుకోని సంఘటనల వల్ల అది కుదర్లేదు. దీంతో ఆ ప్రాజెక్ట్ కోసం రిజిస్టర్ చేసిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అనే టైటిల్ ఫిల్మ్ నగర్ లో అలాగే ఉండిపోయింది. అయితే మిస్టర్ పర్ఫెక్ట్ టైటిల్ కోసం మహేష్ ని దిల్ రాజు రిక్వెస్ట్ చేయడంతో , మహేష్ బాబు RR మూవీ మేకర్స్ అధినేత తో ప్రత్యేకంగా మాట్లాడి దిల్ రాజు కి ఇప్పించాడట. అంతే కాదు , ఈ సినిమాని సినీ ఇండస్ట్రీ లో చూసిన మొట్టమొదటి హీరో మహేష్ బాబే అని , సినిమా చాలా బాగుంది, ప్రభాస్ లాంటి మాస్ హీరోని ఇలాంటి రోల్ ని చూపించడం పెద్ద సాహసమే అని దిల్ రాజు తో చెప్పాడట.
సోషల్ మీడియా లో ప్రభాస్, మహేష్ బాబు ఫ్యాన్స్ నిత్యం కొట్లాడుకుంటూ ఉంటారు. కానీ ప్రభాస్ , మహేష్ బాబు మాత్రం వ్యక్తిగతంగా ఇంత క్లోజ్ గా ఉంటారు , అభిమానులు కూడా అలా ఉంటే ఎంత బాగుంటుందో అని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉండగా, మరోపక్క మహేష్ బాబు ‘వారణాసి’ మూవీ షూటింగ్ తో ఫుల్ బిజీ గా ఉన్నాడు. రెండు సినిమాలకు పాన్ ఇండియా రేంజ్ లో మంచి క్రేజ్ ఉంది. షూటింగ్స్ కూడా శరవేగంగా పూర్తి చేసుకుంటున్నాయి. ఈ రెండిట్లో ఏ చిత్రానికి ఎక్కువ ఆదరణ రాబోతుందో రాబోయే రోజుల్లో చూడాలి.