Pranay Reddy Vanga: సినిమా ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలకు ఒకసారి కీలకమైన మార్పులు వస్తాయి. ఇండస్ట్రీలో ఉన్న హీరోలతో పాటు టెక్నీషియన్లు, ప్రేక్షకులు సైతం ఆ మార్పులను అంగీకరించాల్సి ఉంటుంది. మూస ధోరణిలో వెళ్తున్న సినిమాలకు వైవిధ్యాన్ని జోడిస్తూ మూవీస్ ను తెరకెక్కించిన దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు…1989 లో రామ్ గోపాల్ వర్మ శివ సినిమాతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇక ఆ తర్వాత ఎంత మంది దర్శకులు వచ్చినా కూడా ఆయనను ఫాలో అయ్యారు తప్ప కొత్త విధానాన్ని తీసుకురాలేకపోయారు. కానీ 2017వ సంవత్సరంలో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సందీప్ రెడ్డి వంగ తెలుగు సినిమా స్థాయిని మార్చేశాడు. అప్పటి వరకు ఒకే టెంప్లేట్లో వెళుతున్న సినిమా మూడు మొత్తాన్ని చేంజ్ చేశాడు. ప్రేక్షకుడు ఎలాంటి సినిమాలు చూస్తాడనే విషయం పక్కన పెట్టి మనం ప్రేక్షకుడికి ఎలాంటి సినిమా చూపించాలి అనుకుంటున్నాం అనేదానిమీద ఎక్కువ ఫోకస్ చేస్తే మన ఆలోచన ధోరణి ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది.
తద్వారా సినిమా కొత్తదనాన్ని రూపొందించుకుంటుంది. ఫైనల్ గా ఆ సినిమా ఆడియన్స్ కి నచ్చుతుంది…
రీసెంట్ గా ప్రముఖ ప్రొడ్యూసర్ అయిన ప్రణయ్ రెడ్డి వంగ వాళ్ల తమ్ముడు స్టార్ డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు.
నా తమ్ముడు అయిన సందీప్ కి చిన్నప్పటి నుంచే ఫోటోగ్రఫీ మీద చాలా ఇష్టం ఉండేదని వేరే ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆయన తీసిన ఫోటోలు చాలా అద్భుతంగా ఉండేవని చిన్నతనం నుంచే ఆయనకు అది రావడం నిజంగా గ్రేట్ అని చెప్పాడు. అలాగే తను పెట్టిన ఫ్రేమ్ కూడా చాలా అద్భుతంగా ఉండేదని, అది నేర్చుకుంటే రాలేదని బై బర్త్ నుంచే అతనికి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉందని చెప్పాడు.
ఫోటోగ్రఫీ అంటే తనకి ప్రాణం అని ఫ్రేమ్స్ ని సైతం చాలా చక్కగా పెడుతూ ఉంటాడు అంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సందీప్ రెడ్డివంగ ప్రభాస్ ని హీరోగా పెట్టి ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది…