IND Vs SA: రాంచీలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 349 పరుగులు చేసింది. ఇంత స్కోర్ చేసినప్పటికీ భారత జట్టు విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.. ప్రారంభంలో దక్షిణాఫ్రికా మూడు వికెట్లను కోల్పోయినప్పటికీ.. పోరాటాన్ని ఆపలేదు. చివరి వరకు నిలబడి ఆటగాళ్లు టీమిండియా బౌలర్ల భరతం పట్టారు. చివర్లో తడబాటుకు గురి కావడంతో టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Also Read: స్పిరిట్ సినిమాతో సందీప్ రెడ్డి వంగ ఆ ఒక్కటి చేస్తే రాజమౌళిని బీట్ చేసేస్తాడా..?
రాంచీలో విజయం సాధించినప్పటికీ టీమిండియా నేర్చుకోవలసిన పాఠాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా వాటిని బుధవారం జరిగే రాయ్ పూర్ వన్డేలో పునరావృతం చేయకుంటే సౌత్ ఆఫ్రికాకు మరో అవకాశం లేకుండా సిరీస్ సొంతం చేసుకోవచ్చు.. తొలి వన్డేలో బౌలర్లు దారుణంగా పరుగులు ఇచ్చారు. ముఖ్యంగా ప్రసిద్ కృష్ణ, రవీంద్ర జడేజా తమ బౌలింగ్ లయను పూర్తిగా మార్చుకోవాల్సి ఉంది. కులదీప్ యాదవ్ పరుగులు ఇచ్చినప్పటికీ నాలుగు వికెట్లు సొంతం చేసుకున్నాడు. హర్షిత్ రాణా అద్భుతమైన లయతో బంతులు వేశాడు. ఒకరకంగా చూసుకుంటే హర్షిత్, కులదీప్ బెటర్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు.
తొలి వన్డేలో రుతు రాజ్ గైక్వాడ్ విఫలమయ్యాడు. వాషింగ్టన్ సుందర్ అంచనాలను అందుకోలేకపోయారు. యశస్వి జైస్వాల్ నుంచి టీమ్ ఇండియా భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. వీరు ముగ్గురు రాయ్ పూర్ వన్డేలో సత్తా చూపించాల్సిన అవసరం ఉంది.. విరాట్, రోహిత్, రాహుల్ సూపర్ ఫామ్ లో ఉండడం జట్టుకు లాభించే విషయం.
తొలి వన్డేలో గైక్వాడ్ విఫలమైన నేపథ్యంలో అతడి స్థానంలో పంత్ కు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఒక్క వన్డేలో విఫలమైనత మాత్రాన గైక్వాడ్ పై వేటు వేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్లే అతడికి రెండవ వన్డేలో కూడా అవకాశం ఇచ్చి.. ఇక్కడ కూడా విఫలమైతే.. అతడి స్థానంలో పంత్ కు అవకాశం ఇచ్చే విషయాన్ని మేనేజ్మెంట్ పరిశీలిస్తోంది.
తుదిజట్ల అంచనా
టీమిండియా: కేఎల్ రాహుల్ (కెప్టెన్/ వికెట్ కీపర్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్, హర్షిత్, కులదీప్, అర్షదీప్, ప్రసిద్డ్, రవీంద్ర జడేజా, గైక్వాడ్.
దక్షిణాఫ్రికా: బవుమా(కెప్టెన్), బర్గర్, బార్ట్ మాన్, మార్కం, రికెల్టన్, డికాక్, బ్రిట్జ్ కీ, జోర్జి, బేబీస్, యాన్సన్, కేశవ్.