Jabardasth: బుల్లితెర ప్రేక్షకులను తమ కామెడీతో కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్ కమెడియన్లు దొరబాబు, రైజింగ్ రాజు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని పాలకోడేరు మండలం పెన్నాడ అగ్రహారం వద్ద ఈ ప్రమాదం జరిగింది. కాకినాడ నుంచి భీమవరం వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. దొరబాబు, రైజింగ్ రాజుతో పాటు డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ వార్తతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన కమెడియన్లు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ఆకాంక్షిస్తున్నారు.
ఈమధ్య కాలంలో సినీ సెలబ్రిటీలకు , బుల్లితెర స్టార్స్ కి వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉండడం సాధారణమైన విషయం గా మారిపోయింది. ముందు ఢీ ఫేమ్ పండు మాస్టర్ కి రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. దాదాపుగా 8 నెలల పాటు విశ్రాంతి తీసుకున్నాక ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారు కూడా రోడ్డు ప్రమాదానికి గురైంది. దేవుడి దయ వల్ల ఎలాంటి దెబ్బలు తగలేకపోవడం తో శేఖర్ మాస్టర్ సేఫ్ అయ్యాడు. ఈ ఘటన జరిగిన కొద్దిరోజులకే దొరబాబు , రైజింగ్ రాజు లకు రోడ్డు ప్రమాదం జరగడం దురదృష్టకరం. వీళ్లిద్దరు జబర్దస్త్ షో ద్వారా ఎంత పాపులారిటీ ని సంపాదించుకున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం. గత 13 ఏళ్ళ నుండి వీళ్ళు ఈ షో లో ఎలాంటి విరామం లేకుండా కొనసాగుతూనే ఉన్నారు. వీళ్లిద్దరు త్వరగా కోలుకొని , ఎప్పటి లాగానే మన అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.