Hyper Aadhi: ‘జబర్దస్త్’ ద్వారా బుల్లితెర ఆడియన్స్ కి పరిచయమైన హైపర్ ఆది , ఆ తర్వాత ఎంతటి ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో హైపర్ ఆది అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ జనాల్లో పడిపోయింది. అయితే ఈయనకు సినిమాల్లో అవకాశాలు క్యూలు కట్టడం తో నెమ్మదిగా ‘జబర్దస్త్’ షో కి దూరం అయ్యాడు. కానీ ఈటీవీ లో ప్రసారమయ్యే ఇతర ఎంటర్టైన్మెంట్ షోస్ ‘ఢీ ‘, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వంటి షోస్ లో పాల్గొనే వాడు. అప్పుడప్పుడు పండుగలకు ఏర్పాటు చేసే ఈవెంట్స్ లో కూడా హైపర్ ఆది చురుగ్గా పాల్గొనే వాడు. అయితే రీసెంట్ గానే ‘జబర్దస్త్’ షో లో హైపర్ ఆది కనిపించడం తో , ఆయన రీ ఎంట్రీ ఇచ్చాడని , జబర్దస్త్ కి మరోసారి పూర్వ వైభవం రాబోతుందంటూ ప్రచారం చేశారు.
రీసెంట్ గానే జబర్దస్త్ షో ని ఆదివారం సాయంత్రం 6 గంటలకు షిఫ్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీని లాంచింగ్ ఎపిసోడ్ లో హైపర్ ఆది కనిపించాడు , ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. దీంతో హైపర్ ఆది కేవలం ఆ ఒక్క ఎపిసోడ్ కోసమే వచ్చాడనే విషయం అందరికీ అర్థం అయ్యింది. హైపర్ ఆది రెగ్యులర్ గా ఈ షో లో కొనసాగడానికి సమస్య ఏంటి?, ఎలాగో ఇప్పుడు ‘ఢీ’ షో కూడా లేదు. దానికి బదులుగా హైపర్ ఆది జబర్దస్త్ షో చేయొచ్చు కదా అనేది అభిమానుల నుండి ఎదురు అవుతున్న ప్రశ్న. అయితే హైపర్ ఆది ప్రస్తుత మార్కెట్ వేల్యూ వేరు. ఆయన కోరినంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు ‘జబర్దస్త్’ యాజమాన్యం సిద్ధంగా లేదు. ఎందుకంటే టీఆర్ఫీ రేటింగ్స్ బాగా పడిపోయాయి కాబట్టి. అందుకే హైపర్ ఆది ని ఈ షో లో కొనసాగించలేకపోతున్నారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఇప్పుడు హైపర్ ఆది స్థానం లోకి మరో స్టార్ కమెడియన్ ‘సద్దాం’ ని తీసుకొచ్చారు. నాగబాబు ఇతన్ని ప్రత్యేకించి జబర్దస్త్ లోకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. గతం లో నాగబాబు నిర్మాతగా వ్యవహరించిన ‘అదిరింది’ అనే కామెడీ షో ద్వారా సద్దాం బుల్లితెర కి పరిచయం అయ్యాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్నటువంటి సద్దాం ఈమధ్య కాలం లో బాగా డౌన్ అయ్యాడు. ఇప్పుడు జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన , ఈ షోని తన కామెడీ టైమింగ్ తో ఏ రేంజ్ కి తీసుకెళ్తాడో చూడాలి.