Homeక్రీడలుక్రికెట్‌IND vs Japan: జపాన్ చేతిలో జరంత తేడాతో తప్పింది.. లేకుంటే..

IND vs Japan: జపాన్ చేతిలో జరంత తేడాతో తప్పింది.. లేకుంటే..

IND vs Japan: టీమిండియా.. జపాన్ పోటీ పడుతుంటే ఎలా ఉంటుంది.. సింహం.. చిట్టెలుక పోటీపడుతున్నట్టుగా ఉంటుంది. పైగా జపాన్ కు క్రికెట్లో ఉన్న అనుభవం చాలా తక్కువ. టీమిండియా ప్రపంచ క్రికెట్ మొత్తాన్ని ఏలుతున్న అనుభవం చాలా ఎక్కువ. అటువంటిది ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే చాలామంది వన్ సైడ్ అనుకున్నారు. కానీ టీమిండియా కు జపాన్ చుక్కలు చూపించండి. వెట్ అవుట్ ఫీల్డ్ వల్ల 5 ఓవర్ల పాటు మ్యాచ్ నిర్వహించారు. […]

IND vs Japan: టీమిండియా.. జపాన్ పోటీ పడుతుంటే ఎలా ఉంటుంది.. సింహం.. చిట్టెలుక పోటీపడుతున్నట్టుగా ఉంటుంది. పైగా జపాన్ కు క్రికెట్లో ఉన్న అనుభవం చాలా తక్కువ. టీమిండియా ప్రపంచ క్రికెట్ మొత్తాన్ని ఏలుతున్న అనుభవం చాలా ఎక్కువ. అటువంటిది ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే చాలామంది వన్ సైడ్ అనుకున్నారు. కానీ టీమిండియా కు జపాన్ చుక్కలు చూపించండి. వెట్ అవుట్ ఫీల్డ్ వల్ల 5 ఓవర్ల పాటు మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్ లో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసింది. ఏకంగా నాలుగు వికెట్లు కోల్పోయింది. కేవలం 32 పరుగులు మాత్రమే చేసింది. సంజు (9), అభిషేక్ (0), ఇషాన్ కిషన్ (3) పరుగులు మాత్రమే చేశారు.. కెప్టెన్ అయ్యర్ (16) పరుగులు చేశాడు. జపాన్ బౌలర్లలో చార్లీ హర రెండు వికెట్లు పడగొట్టాడు. ఇబ్రహీం, బెంజమిన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఇటీవల అభిషేక్ శర్మ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. సూపర్ బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. కానీ ఈ మ్యాచ్లో అతడు విఫలమయ్యాడు. అనామకమైన జపాన్ బౌలర్ల చేతిలో తడబడ్డాడు. కేవలం ఒక బంతి మాత్రమే ఎదుర్కొన్న అతడు.. ఔట్ అయ్యాడు. అసలు అభిషేక్ శర్మ ఇలా ఆడతాడని ఎవరూ ఊహించలేదు.

ఆ తర్వాత జపాన్ బ్యాటింగ్ మొదలుపెట్టింది. నిర్ణీత 5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 30 పరుగులు మాత్రమే చేసింది. ఫ్లెమింగ్ (12) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. లేక్ (1), తకాహసి(4), డేవిడ్ (9*), ప్యాట్ మోర్ (2*) నాట్ అవుట్ గా నిలిచారు. వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు పడగొట్టాడు.

భారత్ విజయం పై వివాదం

భారత్, జపాన్ టి20 మ్యాచ్ లో వైడ్ విషయంలో అంపైర్లు నిర్ణయం మార్చుకున్నారు. ఇది కాస్త వివాదంగా మారింది. అక్షర్ పటేల్ వేసిన చివరి ఓవర్ లో మూడవ బంతిని అంపైర్ ముందుగా వైడ్ గా ప్రకటించారు. అయితే బ్యాటర్ రివర్స్ స్వీప్ ఆడడంతో వైడ్ ఎలా అవుతుందని అక్షర్, అయ్యర్ ప్రశ్నించారు. దీంతో అంపైర్లు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. లేదంటే మ్యాచ్ టై అయ్యేదని.. జపాన్ గెలిచి ఉండేదని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్లో చివరికి టీమిండియా రెండు పరుగుల తేడాతో విజయం సాధించడం విశేషం. టీమిండియా ఈ సంవత్సరంలో పెద్ద పెద్ద జట్లను ఓడించినప్పటికీ.. నెదర్లాండ్ చేతిలో వైట్ వాష్ కు గురైంది. చివరికి జపాన్ చేతిలో కూడా ఓటమి దాకా వెళ్లి.. మల్లి గెలిచింది. అది కూడా రెండు పరుగుల తేడాతో..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper