Homeఆంధ్రప్రదేశ్‌YS Sunitha - Nara Lokesh : వైఎస్ ఫ్యామిలీ నుంచి నరుక్కొస్తున్న నారా లోకేష్..

YS Sunitha – Nara Lokesh : వైఎస్ ఫ్యామిలీ నుంచి నరుక్కొస్తున్న నారా లోకేష్..

YS Sunitha – Nara Lokesh : వైఎస్ సునీతకు నారా లోకేష్ ఆఫర్ ఇచ్చారా? జగన్ సొంత గడ్డపై రాజకీయంగా ఎంట్రీ ఇవ్వాలని కోరారా? జెడ్పీటీసీగా గెలిస్తే జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతను స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దింపేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోందన్న ప్రచారం తెరపైకి వచ్చింది. టీడీపీ వర్గాల సమాచారం […]

YS Sunitha – Nara Lokesh : వైఎస్ సునీతకు నారా లోకేష్ ఆఫర్ ఇచ్చారా? జగన్ సొంత గడ్డపై రాజకీయంగా ఎంట్రీ ఇవ్వాలని కోరారా? జెడ్పీటీసీగా గెలిస్తే జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతను స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దింపేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోందన్న ప్రచారం తెరపైకి వచ్చింది. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం.. వైఎస్ జగన్ సొంత నియోజకవర్గంగా ఉన్న పులివెందుల ప్రాంతంలోని లింగాల మండలం జెడ్పీటీసీగా పోటీ చేయాలని సునీతను నారా లోకేష్ కోరినట్టు తెలుస్తోంది.

అంతేకాకుండా జెడ్పీటీసీగా గెలిస్తే.. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇచ్చే అంశంపై కూడా లోకేష్ నుంచి ప్రతిపాదన వచ్చినట్టు ఆ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రతిపాదనపై వైఎస్ సునీత నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన వెలువడలేదు.

ఇటీవల రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల వ్యూహాలు వేగం పుంజుకున్నాయి. ఈ క్రమంలోనే ప్రత్యర్థి కుటుంబానికి చెందిన కీలక వ్యక్తులను తమ వైపు ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చ మొదలైంది. సునీతను లింగాల నుంచి బరిలోకి దింపితే.. అది కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తర్వాత సునీత రాజకీయంగా చేసిన పోరాటం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు వచ్చింది. మరోవైపు, 2024 తర్వాత ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో రాజకీయ సమీకరణాలు మారాయి. ఈ నేపథ్యంలో సునీతకు టీడీపీ నుంచి రాజకీయ అవకాశం కల్పించాలనే ప్రయత్నం జరుగుతోందన్న వార్త ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే సునీత నిజంగా జెడ్పీటీసీగా పోటీ చేస్తారా? వైఎస్ ఫ్యామిలీ బిడ్డ అయ్యిండి ఆ ఫ్యామిలీ పెద్దలతోనే తన తండ్రి చావుకు వ్యతిరేకంగా పోరాడుతోంది. మరి లోకేష్ ప్రతిపాదనకు ఆమె స్పందన ఏమిటి? టీడీపీ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటిస్తుందా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రధానంగా టీడీపీ వర్గాల ద్వారా వచ్చినదిగా పేర్కొనబడుతోంది. కాబట్టి అధికారిక ప్రకటన వచ్చే వరకు దీనిని రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారంగానే చూడాల్సి ఉంటుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper