Homeఎంటర్టైన్మెంట్Anupama Parameswaran: ప్రతీ రోజు నన్ను టార్చర్ చేసేవాడంటూ యువ హీరోపై అనుపమ పరమేశ్వరన్ సంచలన...

Anupama Parameswaran: ప్రతీ రోజు నన్ను టార్చర్ చేసేవాడంటూ యువ హీరోపై అనుపమ పరమేశ్వరన్ సంచలన కామెంట్స్.. వీడియో వైరల్..

Anupama Parameswaran: యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆమె తన బ్రేకప్ ని ఉద్దేశిస్తూ చేసిన కొన్ని ఇన్ స్టాగ్రామ్ పోస్టులు సంచలనంగా మారాయి. గత కొంతకాలంగా ఆమె ప్రముఖ యంగ్ హీరో ధృవ్ విక్రమ్ తో ప్రేమలో ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి మధ్య పరిచయం ‘బైసన్’ మూవీ షూటింగ్ సమయం లో ఏర్పడింది. ఆ పరిచయం కాస్త […]

Anupama Parameswaran: యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆమె తన బ్రేకప్ ని ఉద్దేశిస్తూ చేసిన కొన్ని ఇన్ స్టాగ్రామ్ పోస్టులు సంచలనంగా మారాయి. గత కొంతకాలంగా ఆమె ప్రముఖ యంగ్ హీరో ధృవ్ విక్రమ్ తో ప్రేమలో ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి మధ్య పరిచయం ‘బైసన్’ మూవీ షూటింగ్ సమయం లో ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అయితే రీసెంట్ గానే అనుపమ అతనితో బ్రేకప్ చేసుకొని , ఇన్ స్టాగ్రామ్ లో కూడా అతన్ని అన్ ఫాలో చేసింది. అయితే ఇప్పటి వరకు తన బ్రేకప్ గురించి ఎన్నో సందర్భాల్లో అనుపమ పరమేశ్వరన్ స్పందించింది కానీ, ధృవ్ విక్రమ్ పేరు ని నేరుగా తియ్యలేదు.

అయితే సోషల్ మీడియా లో రెగ్యులర్ గా యాక్టీవ్ గా ఉండే అనుపమ , ధృవ్ విక్రమ్ కి తనకు మధ్య రిలేషన్ ఉందని ప్రతీ ఒక్కరికి అర్థమైంది అనే విషయం తెలుసు. తన కారణంగా ఎలాంటి సంబంధం లేని ధృవ్ విక్రమ్ ని మధ్యలోకి తెస్తుంటే , కచ్చితంగా ఆమె రెస్పాన్స్ ఇచ్చి , అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేది. కానీ అలా ఆమె ఏమి చేయలేదంటే , కచ్చితంగా ఆమె రిలేషన్ షిప్ పెట్టుకున్నది ధృవ్ విక్రమ్ తోనే అని అంటున్నారు విశ్లేషకులు. రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక తమిళ ఇంటర్వ్యూ లో తన బ్రేక్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది. తన ప్రియుడు ప్రతీ రోజు తనతో ఎలా ఉండేవాడో వివరించి మరీ చెప్పింది. ఆమె చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం గా మారాయి.

ఆమె మాట్లాడుతూ ‘రెండేళ్ల పాటు నేను వ్యక్తిగతంగా ఎంతో టార్చర్ అనుభవించాను. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లోని షేడ్స్ ని చూసి తట్టుకోలేక పోయాను. ఒకరోజు అతని రెమో లాగా కనిపిస్తాడు. ఆయన చూపించే ప్రేమ ఎలా ఉంటుందంటే , ఈ ప్రపంచం లో అతనిలాగా ఎవ్వరూ ప్రేమించలేనంతలా అన్నమాట. పక్క రోజు అపరిచితుడు లాగా మారిపోతాడు. ప్రతీ చిన్న విషయానికి గొడవ పడడం, కొట్టడం వంటివి చేసేవాడు. ఇది జరిగిన మరుసటి రోజు చిన్న పిల్లవాడి లాగా ఏడుస్తూ క్షమాపణలు చెప్తాడు , కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతాడు, ఇంకెప్పుడు ఇలాంటి పనులు రిపీట్ చెయ్యనని చెప్తాడు. కానీ మళ్లీ ఇదే సైకిల్ ని రిపీట్ చేస్తూ ఉంటాడు. రెండేళ్లు ఓపికగా భరించాను , ఇక నావల్ల కాక బ్రేకప్ చెప్పను’ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడిన ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper