Chiranjeevi: నేత్రదానం.. రక్తదానం.. ఇలా సమాజానికి హితమైన కార్యక్రమాలతో మెగాస్టార్ చిరంజీవి ఐ బ్యాంకు.. బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్ సిలిండర్లు అందించారు. కొన్ని ప్రాంతాలలో ఆక్సిజన్ సిలిండర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేశారు.
చిరంజీవి ఏర్పాటు చేసిన రక్తనిధి కేంద్రం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడగలిగారు. నేటికీ చిరంజీవి రక్త నిధి కేంద్రంలో ఎంతో మంది రక్తదానం చేస్తూనే ఉంటారు. చిరంజీవి పిలుపుమేరకు వేలాదిమంది అభిమానులు ప్రతిరోజు రక్తదానం చేస్తూనే ఉంటారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా చిరంజీవి ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ సేవలందిస్తూ ఉంటుంది. చివరికి అంతటి కోవిడ్ సమయంలో కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లక్షలాదిమందికి సేవలందించింది. కష్టకాలంలో ఉన్న వారందరికీ రక్తం అందించింది.
అంతటి గొప్ప చరిత్ర ఉన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై కూడా విమర్శలు వచ్చాయి. కొంతమంది గిట్టని వ్యక్తులు చిరంజీవి రక్తం అమ్ముకున్నాడని.. కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. ఆ ఆరోపణలు చిరంజీవి మనసును ఎంతగానో బాధించాయి. చివరికి అటువంటి ఆరోపణలు కూడా చేస్తారా అంటూ చిరంజీవి తన బాధను సన్నిహితుల వద్ద చెప్పుకునేవారు. అయినప్పటికీ కొంతమంది కోసం అంతమందికి అన్యాయం చేయడం ఇష్టం లేక.. చిరంజీవి రక్త నిధి కేంద్రాన్ని మెగాస్టార్ కొనసాగిస్తూనే ఉన్నారు. హైదరాబాదులో చిరంజీవి యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మెగాస్టార్ తనకు ఎదురైన అనుభవాలు పంచుకున్నారు.
బ్లడ్ బ్యాంక్ నిర్వహణలో చాలామంది తనపై ఆరోపణలు చేశారని.. అవన్నీ కూడా బాధ కలిగించాయని.. చివరికి అటువంటి విమర్శలను. అటువంటి వ్యక్తులను పట్టించుకోవడం మానేశానని.. ఆ తర్వాత మనసు మరింత ప్రశాంతంగా మారిందని చిరంజీవి చెప్పుకొచ్చారు. చిరంజీవి లాంటి వాళ్లకే అవమానాలు ఎదురైతే.. ఇక సామాన్య జనం పరిస్థితి ఏంటని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎంతైనా సరే అవమానాలను పక్కన పెట్టాలి. విమర్శలను దూరం పెట్టాలి. లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టాలి. అప్పుడే విజయం సాధించగలుగుతామని చిరంజీవి చెప్పుకొచ్చారు. దీనిని బట్టి ఆయన అవమానాల నుంచి ఏ స్థాయిలో పాఠాలు నేర్చుకున్నారో అర్థమవుతుంది. ఆయన ఆ స్థాయిలో రాటు తేలిపోయారు కాబట్టే తెలుగు చిత్ర పరిశ్రమకు మకుటం లేని మహారాజుగా.. మెగాస్టార్ గా వెలుగొందుతున్నారు. ఇలాంటి చవకబారు ఆరోపణలు ఆయనను ఏమీ చేయలేవని అభిమానులు అంటున్నారు.
#Hyderabad:#Filmactor Chiranjeevi hits back at #allegations that #blood was being #sold through his #bloodbank:
“I have faced many #insults in my life. Did I ever sell blood?
Making such allegations is #foolish. How many crores of #bloodpackets would I have to sell for it to… pic.twitter.com/kThyhxbJJ7
— NewsMeter (@NewsMeter_In) September 22, 2026