Sudigali Sudheer: జబర్దస్త్ ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు సుడిగాలి సుధీర్. ఒకానొక దశలో సుధీర్ లేకపోతే ఈ షో ని చూడడం చాలా కష్టమయ్యేది. ఇంత కమెడియన్స్ స్కిట్స్ ఎలా ఉన్నా, సుడిగాలి సుధీర్ టీం స్కిట్స్ మాత్రం తోపు లెవెల్ లో ఉండేవి. ముఖ్యంగా సుధీర్ కామెడీ టైమింగ్, ఆటో రామ్ ప్రసాద్ పంచులు, గెటప్ శ్రీను గెటప్పులు, ముగ్గురు కలిసి చేసే సందడి వేరే లెవెల్ లో ఉండేది. అలా మంచి పేరు తెచ్చుకోవడం వల్ల, సుడిగాలి సుధీర్ కి సినిమా అవకాశాలు వచ్చాయి, దీంతో ఆయన షో ని వదిలేయాల్సి వచ్చింది. ఆ తర్వాత గెటప్ శ్రీను కూడా బిజీ అవ్వడం తో ఆయన కూడా ఈ షో నుండి తప్పుకున్నాడు. ఒక్క ఆటో రామ్ ప్రసాద్ మాత్రమే కొనసాగుతూ వచ్చాడు.
కానీ సుధీర్, గెటప్ శ్రీను లతో లేని ఆటో రామ్ ప్రసాద్ ని చూడడం చాలా కష్టం అయ్యేది జనాలకు. అందుకే ఒకప్పటి రెస్పాన్స్ వచ్చేది కాదు. మళ్లీ ఈ ముగ్గురిని ఇదే ‘జబర్దస్త్’ స్టేజి పై చూసే అవకాశం కోసం కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. కానీ అందరూ వేరే దారుల్లో వెళ్లిపోయారు , ఈ ముగ్గురిని కలిపి జబర్దస్త్ లో చూడడం అసాధ్యమే అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఈ వారం టెలికాస్ట్ అవ్వబోయే ఎపిసోడ్ లో ఈ ముగ్గురు కలిసి చేసిన సరికొత్త స్కిట్ ని మనమంతా చూడబోతున్నాం. దానికి సంబంధించిన ప్రోమో ని నిన్న రాత్రి విడుదల చేయగా , దానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సుధీర్, హైపర్ ఆది , గెటప్ శ్రీను , ఆటో రామ్ ప్రసాద్ లను ఒకే స్కిట్ లో చూసిన నెటిజెన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రోమో లో సుధీర్ , హైపర్ ఆది తమ మార్కు పంచులతో అదరగొట్టారు. ఆ తర్వాత గెటప్ శ్రీను తన వింటేజ్ గెటప్ తో మరోసారి ప్రేక్షకుల పొట్ట చెక్కలు అయ్యేలా చేసాడు. ఇక రష్మీ అయితే సుధీర్ ని చూడగానే చాలా ఎమోషనల్ అయిపోయింది. ఆమె మాట్లాడుతూ ‘జబర్దస్త్ షో లో మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ని అందించేది సుడిగాలి సుధీర్ టీం. సుధీర్ ఎప్పుడైతే ఈ స్టేజి మీదకు వచ్చాడో , అతనితో పాటే నా ప్రయాణం ని కూడా మొదలు పెట్టాను. కానీ అందరికంటే ముందే సుధీర్ ఈ షో ని వదిలి వెళ్ళిపోయాడు’ అంటూ ఏడ్చేస్తుంది రష్మీ. ఈ బ్లాక్ బస్టర్ ప్రోమో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
View this post on Instagram