Homeక్రీడలుక్రికెట్‌IND vs Japan: వైడ్ విషయంలో అంపైర్ల తొండాట.. లేకుంటే భారత్ పని అస్సామే..

IND vs Japan: వైడ్ విషయంలో అంపైర్ల తొండాట.. లేకుంటే భారత్ పని అస్సామే..

IND vs Japan: భారత్, జపాన్ జట్ల మధ్య జరిగిన ఏకైక టి20 మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. అది కూడా కేవలం రెండు పరుగుల వ్యత్యాసంతో గెలుపును దక్కించుకుంది. భారత జట్టు గెలిచినప్పటికీ అది విజయం లాగా కనిపించడం లేదు. ఎందుకంటే టీమిండియా తన స్థాయికి తగ్గట్టుగా ఈ మ్యాచ్లో ప్రదర్శన చేయలేదు. పైగా బలహీనమైన జపాన్ జట్టు మీద టీం ఇండియాలో స్టార్ ప్లేయర్లు ఆడారు. కాని వారంతా తమ స్థాయికి తగ్గట్టుగా ఆడలేక పోయారు. […]

IND vs Japan: భారత్, జపాన్ జట్ల మధ్య జరిగిన ఏకైక టి20 మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. అది కూడా కేవలం రెండు పరుగుల వ్యత్యాసంతో గెలుపును దక్కించుకుంది. భారత జట్టు గెలిచినప్పటికీ అది విజయం లాగా కనిపించడం లేదు. ఎందుకంటే టీమిండియా తన స్థాయికి తగ్గట్టుగా ఈ మ్యాచ్లో ప్రదర్శన చేయలేదు. పైగా బలహీనమైన జపాన్ జట్టు మీద టీం ఇండియాలో స్టార్ ప్లేయర్లు ఆడారు. కాని వారంతా తమ స్థాయికి తగ్గట్టుగా ఆడలేక పోయారు. కెప్టెన్ అయ్యర్ (16) మినహా భారత బ్యాటర్లలో చెప్పుకునే స్థాయిలో ఎవరూ పరుగులు చేయలేకపోయారు.

వెట్ అవుట్ ఫీల్డ్ వల్ల మ్యాచ్ ను 5 ఓవర్లకు మాత్రమే కుదించారు. ఈ మ్యాచ్లో ముందుగా టీం ఇండియా బ్యాటింగ్ చేసింది జపాన్ బౌలర్ల దాటికి 5 ఓవర్లలో కేవలం 32 పరుగులు మాత్రమే చేసింది. ఏకంగా నాలుగు వికెట్లు నష్టపోయింది. అభిషేక్ శర్మ డక్ అవుట్ అయ్యాడు. సంజు 9 పరుగులు మాత్రమే చేశాడు. ఇషాన్ కిషన్ మూడు పరుగులు దాటలేకపోయాడు. ఇక మిగతా బ్యాటర్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

జపాన్ సెకండ్ ఇన్నింగ్స్ లో 30 పరుగులు మాత్రమే చేయగలిగింది. వాస్తవానికి ప్రారంభం నుంచి జపాన్ ప్లేయర్లు సమర్థవంతంగా ఆడి ఉంటే మ్యాచ్ ఫలితం వేరే విధంగా ఉండేది. సొంత మైదానం మీద ఆడుతున్నప్పటికీ పరుగులు తీయడంలో జపాన్ ప్లేయర్లు ఇబ్బంది పడ్డారు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెట్టడంలో తడబడ్డారు. అందువల్లే జపాన్ జట్టు ఓటమి పాలు కావాల్సి వచ్చింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో వైడ్ విషయంలో అంపైర్లు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇది కాస్త చర్చకు దారి తీసింది. జపాన్ ఇన్నింగ్స్ సమయంలో అక్షర్ పటేల్ చివరి ఓవర్ వేశాడు. ఆ ఓవర్ లో మూడవ బంతిని ముందుగా ఎంపైర్ వైడ్ అని ప్రకటించారు. అయితే బ్యాటర్ రివర్స్ స్వీప్ ఆడిన నేపథ్యంలో అది వైడ్ ఎలా అవుతుందని భారత బౌలర్లు ప్రశ్నించారు. దీంతో అంపైర్లు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఫలితంగా టీమిండియా రెండు పరుగుల తేడాతో విజయం సాధించగలిగింది. ఒకవేళ అంపైర్లు ఆ బంతిని వైడ్ అని ప్రకటించకపోతే పరిస్థితి మరో విధంగా ఉండేది.

ఇటీవల కాలంలో టి20 ఫార్మేట్ లో టీమిండియా చిన్న చిన్న జట్ల మీద ఓడిపోతోంది. ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ అయింది. ఆ ఫలితాన్ని మర్చిపోకముందే టీమిండియా జపాన్ చేతిలో ఓడిపోవాల్సి వచ్చేది. అయితే వైడ్ విషయంలో అంపైర్లు తమ నిర్ణయాన్ని మార్చుకోవడంతో టీమిండియాకు గెలుపు సాధ్యమైంది. వెట్ అవుట్ ఫీల్డ్ కూడా టీమిండియా బ్యాటర్ల సహనానికి పరీక్ష పెట్టింది. మైదానం మీద తేమ ఉండడంతో బంతి రివ్వున దూసుకు వచ్చింది. దీంతో భారత బ్యాటర్లు చేతులు ఎత్తేయక తప్పలేదు. అభిషేక్ శర్మ లాంటి బ్యాటర్ 0 పరుగులకు అవుట్ అయ్యాడంటే మైదానంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper