Nani: శ్రీకాంత్ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న చిత్రం పేరు ది ప్యారడైజ్. ఈ చిత్రం రేపు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. పిరియాడికల్ డ్రామా కావడంతో ఈ సినిమా మీద భారీగా అంచనాలు ఉన్నాయి. పైగా నాని జడలతో కనిపించారు. మదర్ సెంటిమెంట్.. మోహన్ బాబు విలనిజం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ లు అని ఇప్పటికే విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమా భారీ ఖర్చుతో నిర్మాణమైంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ల ధరలను పెంచుకోవడానికి అనుమతి ఇచ్చాయి.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ హీరో నాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒక కోరిక కోరారు. అయితే ఆ విషయంలో రేవంత్ రెడ్డి నుంచి సానుకూల స్పందన వ్యక్తమైంది. ది ప్యారడైజ్ సినిమా రేపు వరల్డ్ వైడ్ గా విడుదల అవుతున్న నేపథ్యంలో.. సినిమాలు ఆర్టీసీ ఎక్స్ రోడ్డు లో అభిమానులతో కలిసి చూడాలని ఉందని నాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేశారు.. అన్ని ప్రికాషన్స్ ఫాలో అవుతామని.. గవర్నమెంట్ చెప్పినట్టుగా నడుచుకుంటామని నాని ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రి నుంచి సానుకూల స్పందన వ్యక్తమైందని తెలుస్తోంది.
పుష్ప 2 సినిమాకు సంబంధించి జరిగిన ఘటన ఇప్పటికీ ఒక మాయని మచ్చలాగే ఉంది. ఈ వ్యవహారంలో ఒక మహిళ చనిపోయింది. నాడు ఆ సినిమా విడుదలైన సమయంలో అభిమానులతో కలిసి చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్ కి వెళ్లారు.. ఆయన వస్తున్న సమయంలో భారీగా అభిమానులు సందడి చేశారు. ఈ సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఫలితంగా ఒక మహిళ గాయపడి చనిపోయింది. దీంతో అప్పటినుంచి ప్రభుత్వం స్టార్ హీరోలను సినిమా విడుదల రోజు అభిమానులతో కలిసి.. చూసేందుకు అనుమతి ఇవ్వడం లేదు. పైగా ఏదైనా జరగరాని ఘటన జరిగితే పరిస్థితి వేరుగా ఉంటుందని చాలామంది హీరోలు సినిమా రిలీజ్ రోజు అభిమానులతో థియేటర్లలో చూసేందుకు ఇష్టపడటం లేదు.
ది ప్యారడైజ్ సినిమాను అభిమానులతో కలిసి చూడాలని నాని లాంటివాళ్ళు కోరుకుంటున్నారు. నాని రిక్వెస్ట్ పై సీఎం సానుకూలంగా స్పందించారు. సంబంధిత అధికారులకు లేఖ రాయాలని సూచించారు. వారు అనమతిస్తే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. అయితే దీనిపై తెలంగాణ పోలీస్ బాస్ సీవీ ఆనంద్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలియాల్సి ఉంది.
Hon’ble Chief Minister Shri @revanth_anumula Garu, Hon’ble Minister of Cinematography Shri @KomatireddyKVR Garu & the respected officials of @TelanganaCOPs.
This is a request from a fan of cinema and, more importantly, someone who has enjoyed cinema at its very best from a very…
— Nani (@NameisNani) September 22, 2026