Homeటాప్ స్టోరీస్KCR farmhouse:కెసిఆర్ ఫామ్ హౌస్ లో..ఏముంది..వెలుగులోకి సంచలన వీడియో

KCR farmhouse:కెసిఆర్ ఫామ్ హౌస్ లో..ఏముంది..వెలుగులోకి సంచలన వీడియో

KCR farmhouse: కొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ భూముల గురించి విపరీతంగా చర్చ నడుస్తోంది. అధికారులు ముఖ్యమంత్రి ఆదేశాలతో కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా భూముల సర్వే చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అనేక కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కెసిఆర్ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించి తమ భూములను తీసుకున్నారని దళితులు ఆరోపిస్తున్నారు. ఎర్రవల్లి ప్రాంతానికి చెందిన రైతు బలయ్య కీలక వ్యాఖ్యలు చేశాడు..”ఇందిరాగాంధీ మాకు భూమి ఇచ్చింది.. కెసిఆర్ తన భూమికి […]

KCR farmhouse: కొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ భూముల గురించి విపరీతంగా చర్చ నడుస్తోంది. అధికారులు ముఖ్యమంత్రి ఆదేశాలతో కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా భూముల సర్వే చేపట్టారు. ఈ నేపథ్యంలోనే అనేక కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

కెసిఆర్ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించి తమ భూములను తీసుకున్నారని దళితులు ఆరోపిస్తున్నారు. ఎర్రవల్లి ప్రాంతానికి చెందిన రైతు బలయ్య కీలక వ్యాఖ్యలు చేశాడు..”ఇందిరాగాంధీ మాకు భూమి ఇచ్చింది.. కెసిఆర్ తన భూమికి నీళ్ల కోసం చెరువు తవ్వారు. మాకు భూముల్లో లేకుండా చేసిండు. వెనుకటి కాలంలో ఇందిరమ్మ ఉన్నప్పుడు మాకు ఈ భూమి ఇచ్చింది. ఇప్పుడు కెసిఆర్ అంత ఆగం చేసిండు. ఏం లేకుండా చేసిండు. మాకు వేరే భూమి ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. నష్టపరిహారం కూడా రూపాయి ఇవ్వకుండా మా భూముల్లో పాండురంగని చెరువు తవ్విండు. ఈయన మాకు ఇచ్చింది ఏం లేదు. ఆ ఇంత ఇందిరమ్మ ఇచ్చింది కూడా ఆగం చేసిండు” అని బలయ్య వ్యాఖ్యానించారు.

ఎర్రవల్లి ప్రాంతానికి సంబంధించిన మాజీ సర్పంచ్ కూడా తన ఆవేదనను బయటపెట్టాడు” కెసిఆర్ మా భూములను మాత్రమే 22a కింద పెట్టిండు. మాకు అనుమానం వచ్చి పక్క గ్రామాల్లో చూస్తే అక్కడ అసైన్డ్ భూములకు పాసు బుక్కులు ఇచ్చిండు. ధరణిలో మాత్రం అవి ఆపిండు. ఎందుకు మా భూములను 22 ఏ కింద పెట్టారు అని అడుగుదామని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లే ప్రయత్నం చేస్తే.. ఫామ్ హౌస్ గేటును కూడా తాకనివ్వలేదు. నేను నమస్తే తెలంగాణ పత్రికలో విలేకరిగా పని చేశాను. ఉద్యమాల కూడా పనిచేసిన.. ఆయనను కలిసి మా బాధలు చెప్పుకునే అవకాశం ఒక్కసారి కూడా ఇవ్వలేదని” ఆ మాజీ సర్పంచ్ వాపోయాడు.

మరోవైపు కొంతమంది విలేకరులు కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. అందులో మూడు ఎకరాల్లో బావి తవ్వారని చూపించారు. ఆ మూడు ఎకరాలలో తవ్విన బాబుకి రంగనాయక సాగర్ నుంచి నీటి కనెక్షన్ ఏర్పాటు చేసుకున్నారని.. మూడు ఎకరాల భూమిలో 100 అడుగుల బావి తవ్వి.. అక్కడి నుంచి వందల ఎకరాల్లోని తన భూములకు కేసీఆర్ నీళ్లు పారిస్తున్నారని మీడియా ప్రతినిధులు చెప్పుకొచ్చారు.

ఎర్రవల్లి ప్రాంతానికి సంబంధించిన మరో మహిళా రైతు కూడా సంచలన ఆరోపణలు చేసింది..”ఆయన మమ్మల్ని నిండా ముంచిండు కొడకా.. మాకు ఉన్న ఎకరంన్నర భూమిని వ్యవసాయ క్షేత్రం దగ్గర చెరువు కట్టుకునేందుకు.. చెరువు కట్ట కోసం నా భూమిని అంత పొక్కలు పెట్టి మట్టి తీసుకుపోయిండు. మాభూమి మీద రంది పెట్టుకుని మా ఇంటి ఆయన చనిపోయిండు. ఇంద్ర గాంధీ ఉన్నప్పుడు మాకు ఇచ్చిన భూమి అయ్యా ఇది. ఇప్పుడు కేసీఆర్ ఎక్కడి నుంచో మా ఊరికి వచ్చి మమ్మల్ని ఆగం చేసిండు” అంటూ ఆ మహిళా రైతు వాపోయింది. ఇలా అనేకమంది దళిత రైతులు మీడియా ముందుకు వచ్చి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో తమకు జరిగిన అన్యాయం గురించి బయట చెప్పుకున్నారు. మరి దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper