Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10' లో ఆమెకే హైపర్ ఆది సపోర్ట్.....

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ లో ఆమెకే హైపర్ ఆది సపోర్ట్.. పాపం ఆటో రామ్ ప్రసాద్ పరిస్థితి ఏంటో!

Bigg Boss 10 Telugu:  ‘బిగ్ బాస్ 10’ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే కంటెస్టెంట్ ఆటో రామ్ ప్రసాద్ కాగా, ఆయన తర్వాత ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే కంటెస్టెంట్ వర్షిణి. వీళ్లిద్దరు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్త వచ్చినప్పుడు ఆడియన్స్ లో మంచి ఆసక్తి ఏర్పడింది. వీళ్లిద్దరు కచ్చితంగా మంచి కంటెంట్ ఇస్తారని, ఇద్దరూ టాప్ 5 లో ఉంటారని అంచనా వేశారు. వీరిలో ప్రస్తుతానికి రామ్ […]

Bigg Boss 10 Telugu:  ‘బిగ్ బాస్ 10’ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే కంటెస్టెంట్ ఆటో రామ్ ప్రసాద్ కాగా, ఆయన తర్వాత ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే కంటెస్టెంట్ వర్షిణి. వీళ్లిద్దరు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్త వచ్చినప్పుడు ఆడియన్స్ లో మంచి ఆసక్తి ఏర్పడింది. వీళ్లిద్దరు కచ్చితంగా మంచి కంటెంట్ ఇస్తారని, ఇద్దరూ టాప్ 5 లో ఉంటారని అంచనా వేశారు. వీరిలో ప్రస్తుతానికి రామ్ ప్రసాద్ కి అయితే కచ్చితంగా టాప్ 5 లోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి కానీ , వర్షిణి కి మాత్రం కష్టమే. ఈ వారం ఆమె ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే పెద్ద స్థాయి సెలబ్రిటీలు కాబట్టి , వీళ్లకు తమ తోటి సెలబ్రిటీల సపోర్టు కూడా గట్టిగానే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు.

ముఖ్యంగా ఆటో రామ్ ప్రసాద్ కి జబర్దస్త్ లో పనిచేసిన టాప్ కమెడియన్స్ మొత్తం సపోర్ట్ గా ఉంటారు. కానీ వర్షిణి కి మాత్రం ఒక టాప్ మోస్ట్ కమెడియన్ సపోర్టు చాలా బలంగా ఉంది , ఆ కమెడియన్ మరెవరో కాదు, హైపర్ ఆది. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టినందుకు గానూ , హైపర్ ఆది తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో వర్షిణి , ఆటో రామ్ ప్రసాద్, నరేష్ లకు ఆల్ ది బెస్ట్ చెప్తాడు. కానీ ఈ ముగ్గురిలో ఆయన ఎక్కువ క్లోజ్ ఉండేది వర్షిణి తో మాత్రమే. ఈ ముగ్గురిలో మీరు ఎవరికీ సపోర్ట్ చేస్తారని హైపర్ ఆది ని అడిగితే , ఆయన క్షణం ఆలోచించకుండా వర్షిణి పేరు చెప్తాడు. వీళ్లిద్దరు అంత క్లోజ్ అన్నమాట. వర్షిణి కూడా అనేక ఇంటర్వ్యూస్ లో హైపర్ ఆదితో తనకు ఉన్న అద్భుతమైన బంధం గురించి చెప్పుకొచ్చింది.

ప్రతీ దీపావళి ఎపిసోడ్ కి హైపర్ ఆది బిగ్ బాస్ స్టేజి మీదకు రావడం , తన మార్కు కామెడీ టైమింగ్ తో కంటెస్టెంట్స్ అందరి మీద పంచులు వేయడం సర్వ సాధారణం. మరి ఈ సీజన్ లో ఆయన స్టేజి మీదకు వచ్చినప్పుడు ఆటో రామ్ ప్రసాద్, జబర్దస్త్ నరేష్, వర్షిణి లతో ఎలా మాట్లాడుతాడో చూడాలి. అంతే కాకుండా కీలకమైన సమయం లో ఈ ముగ్గురు నామినేషన్స్ లోకి వచ్చినప్పుడు హైపర్ ఆది ఎవరికీ ఓటు వెయ్యమని కోరుతాడు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper