Bigg Boss 10 Telugu: గత సీజన్ ‘బిగ్ బాస్’ హౌస్ లో గుడ్డు సృష్టించిన సునామీ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొదటి రెండు రోజులు జాలీగా గడిచిపోయింది. కానీ సంజన ఎప్పుడైతే గుడ్డు ని దొంగలించిందో అప్పటి నుండి ఈ షో లో సరికొత్త మలుపులు చోటు చేసుకున్నాయి. ఈ ఒక్క గుడ్డు కారణంగా , కంటెస్టెంట్స్ మాస్కులు మూడవ రోజే వీడిపోయాయి. హౌస్ లో గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇక ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో మనమంతా చూసాము. అయితే ఈ సీజన్ ఆరంభం కూడా గుడ్డు తోనే మొదలైంది. కంటెస్టెంట్స్ మధ్య ఈ గుడ్డు పెద్ద చిచ్చు పెట్టేసింది అనే చెప్పాలి. పూర్తి వివరాల్లోకి వెళ్తే , నిన్న బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వంశీ, నరేష్, చరణ్ , శ్రేష్టి లకు గుడ్డు పగలగొట్టే టాస్క్ ని ఇస్తాడు బిగ్ బాస్.
పగలగొట్టినప్పుడు ఉడకబెట్టిన గుడ్లు చరణ్ , శ్రేష్టి లకు వస్తుంది, వంశీ , నరేష్ లకు మామూలు గుడ్లు వస్తాయి. అయితే బిగ్ బాస్ మిగిలిన ఇద్దరిలో ఎవరో ఒకరిని మీ గేమ్ లో పోటీ పడేందుకు ఎంచుకోండి అని శ్రేష్టి , చరణ్ లను కోరగా, వీళ్లిద్దరు నరేష్ ని ఎంచుకుంటారు. ఈ టాస్క్ లో శ్రేష్టి , నరేష్ లు గెలవడం తో వాళ్లకు గోల్డెన్ కీస్ దక్కుతుంది. మొత్తం 10 మందికి గోల్డెన్ కీస్ రావాలి. 8 మందికి మాత్రమే వస్తుంది , ఇంకో ఇద్దరికీ గోల్డెన్ కీస్ రావాలి, మీ 8 మంది చర్చించుకొని ఏకాభిప్రాయం తో ఇద్దరినీ ఎంచుకొని వాళ్లకు గోల్డెన్ కీస్ ఇవ్వండి అని బిగ్ బాస్ చెప్తాడు. అందరూ మాట్లాడుకొని కృష్ణుడు, వంశీ లకు గోల్డెన్ కీస్ ఇస్తారు.
కృష్ణుడు కి గోల్డెన్ కీస్ ఇవ్వడం పై రోహిత్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయడు కానీ , వంశీ కి లక్ అనే ఫాక్టర్ కలిసిరాలేదు అని, అందుకే అతనికి అవకాశం ఇస్తున్నామని త్రిగున్ చెప్పడం తో రోహిత్ డిబేట్ కి దిగుతాడు. అక్కడ ఇద్దరి మధ్య చాలా సేపటి వరకు వాదనలు జరుగుతాయి, ఒకానొక సమయం లో ఇద్దరు కొట్టుకునే రేంజ్ కి వెళ్తారేమో అని అంతా అనుకున్నారు , కానీ ఆ తర్వాత చాలా కూల్ గానే సర్దుకుపోయారు. కానీ ఇద్దరి మధ్య ఒకరిపై ఒకరికి నెగెటివ్ అభిప్రాయం అయితే ఏర్పడి ఉంటుంది. ఇదంతా జరిగింది గుడ్డు వల్లే కాబట్టి, ఈ బిగ్ బాస్ హౌస్ ని గుడ్డు సెంటిమెంట్ వదిలేలా లేదని అంటున్నారు నెటిజెన్స్.