Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: 2వ వారం తారుమారైన ఓటింగ్.. దేబ్జాని దెబ్బకు ముకేశ్,...

Bigg Boss 10 Telugu: 2వ వారం తారుమారైన ఓటింగ్.. దేబ్జాని దెబ్బకు ముకేశ్, త్రిగున్ విలవిలా!

Bigg Boss 10 Telugu:  ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులు రోజురోజుకి మారిపోతున్నాయి. ఈ సీజన్ లో ఒక్క కృష్ణుడు తప్ప, అందరిలోనూ మంచి టాలెంట్ ఉంది. ఎవ్వరూ కూడా తక్కువ కాదు , అందరికీ టైటిల్ ని కొట్టేంత కెపాసిటీ ఉంది. ఈసారి బిగ్ బాస్ టీం కంటెస్టెంట్స్ సెలక్షన్ కి మాత్రం దండం పెట్టాల్సిందే. నిన్న మొన్నటి వరకు రోహిత్ , అమన్ , త్రిగున్ , ఆటో రామ్ […]

Bigg Boss 10 Telugu:  ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులు రోజురోజుకి మారిపోతున్నాయి. ఈ సీజన్ లో ఒక్క కృష్ణుడు తప్ప, అందరిలోనూ మంచి టాలెంట్ ఉంది. ఎవ్వరూ కూడా తక్కువ కాదు , అందరికీ టైటిల్ ని కొట్టేంత కెపాసిటీ ఉంది. ఈసారి బిగ్ బాస్ టీం కంటెస్టెంట్స్ సెలక్షన్ కి మాత్రం దండం పెట్టాల్సిందే. నిన్న మొన్నటి వరకు రోహిత్ , అమన్ , త్రిగున్ , ఆటో రామ్ ప్రసాద్, ముకేశ్ లు మాత్రమే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా కనిపించారు. ఆడవాళ్ళలో షాలిని , ఝాన్సీ స్ట్రాంగ్ గా అనిపించారు. కానీ గత రెండు ఎపిసోడ్స్ లో అందరి అంచనాలను తారుమారు చేసింది దేబ్జాని. కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ లో భాగంగా , మగాళ్లకు సైతం కష్టమైన ఫిజికల్ టాస్కులను గత రెండు రోజుల్లో నిర్వహించారు. ఈ టాస్కుల్లో దేబ్జాని ఆడపులి లాగా రెచ్చిపోయి మరీ ఆడింది.

రోహిత్, త్రిగున్ , ఆటో రామ్ ప్రసాద్ వంటి తోపు కంటెస్టెంట్స్ కి సైతం చుక్కలు చూపించింది. ఈమె లో ఇంత సత్తా ఉందని హౌస్ మేట్స్ లో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఒక్కసారిగా ఆమెలోని సత్తా ని చూసి అందరూ షాక్ కి గురయ్యారు. దీంతో రెండవ వారం ఓటింగ్ లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. 11 మంది నామినేషన్స్ లోకి రాగా , ఎవరెవరు ఏయే స్థానాల్లో ఉన్నారో ఒకసారి చూద్దాం. అందరికంటే అత్యధిక ఓట్లతో రోహిత్ తిరుగులేని ఆధిక్యం తో కొనసాగుతున్నాడు. ఆయనకు దరిదాపుల్లో మరో కంటెస్టెంట్ లేడు. ఇక ఆ తర్వాత ముకేశ్ రెండవ స్థానం లో , త్రిగున్ మూడవ స్థానం లో కొనసాగుతున్నారు. ఈ ఇద్దరి మధ్య ఓటింగ్ లో తేడా పెద్దగా లేకపోవడం గమనార్హం. ఈ వారం త్రిగున్ గ్రాఫ్ బాగా పెరిగిందనే చెప్పాలి. మొదటి వారం లో ఆయన 7 వ స్థానం లో ఉండేవాడు. ఇక వీళ్లిద్దరి తర్వాత దేబ్జాని 4 వ స్థానం లో కొనసాగుతోంది. మొదటి వారంలో ఈమె 8 వ స్థానం లో ఉండేది.

ఇలాగే ఆడితే ఈమె టాప్ 5 లోకి రావడం చాలా కష్టం అని అనుకుంటున్న సమయం లో , కేవలం రెండు ఎపిసోడ్స్ పెర్ఫార్మెన్స్ తో ఏకంగా ఆటో రామ్ ప్రసాద్ ని సైతం దాటేసి 4 వ స్థానానికి ఎగబాకింది. ఇదే రేంజ్ లో ఆడుతూ ముందుకు వెళ్తే 2 వ స్థానానికి చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదు. ఈమె తర్వాత 5 వ స్థానం లో ఆటో రామ్ ప్రసాద్ కొనసాగుతున్నాడు. హౌస్ లో తెలివి పరంగా కానీ , ఫిజికల్ టాస్కుల పరంగా కానీ , రామ్ ప్రసాద్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ మరొకరు లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎందుకో ఆయన గొప్పగా షైన్ అవ్వలేకపోతున్నాడు. ఆ ప్రభావం ఓటింగ్ మీద కూడా బలంగా పడుతోంది. మొదటి వారం ఓటింగ్ లో 2 వ స్థానం లో కొనసాగిన రామ్ ప్రసాద్, ఈ వారం 5 వ స్థానికి పడిపోయాడు.

ఇక 6 వ స్థానం లో షాలిని కొనసాగుతోంది. గత వారం ఈమె 4 వ స్థానం లో కొనసాగుతూ ఉండేది. కానీ ఈ వారం ఆమెకు బలమైన టాస్కులు పడకపోవడం వల్ల , 6 వ స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత 7 వ స్థానం లో అమన్ , 8 వ స్థానం లో సుధీర్ కొనసాగుతున్నారు. సుధీర్ కి మొదటి వీకెండ్ ఎలిమినేట్ అయ్యే రేంజ్ ఓటింగ్ పడింది. కానీ ఒక్కసారిగా ఆయన నామినేషన్స్ లో ఊహించని ట్విస్ట్ ఇస్తూ త్రిగున్ ని నామినేట్ చేశాడో , అప్పటి నుండి అయాన్ గ్రాఫ్ మారిపోయింది. డేంజర్ జోన్ నుండి చాలా సురక్షితంగా బయటపడ్డాడు. ఇక 9 వ స్థానం లో శ్రేష్టి కొనసాగుతోంది. ఈమెకు కూడా ఈ వారం టాస్కుల్లో పాల్గొనే అవకాశం రాకపోవడం వల్ల గ్రాఫ్ బాగా డౌన్ అయ్యింది.

కానీ వచ్చే వారం సరైన టాస్కులు పడితే మాత్రం , ఈమె మళ్లీ టాప్ రేసులోకి దూసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక చివరి రెండు స్థానాల్లో వర్షిణి , కృష్ణుడు కొనసాగుతున్నారు. ఈ వారం వర్షిణి కి సంబంధించిన కంటెంట్ చాలానే వచ్చింది. ఒకపక్క షాలిని తో గొడవలు పెట్టుకుంటుంది , మరోపక్క ముకేశ్ తో లవ్ ట్రాక్ నడుపుతోంది, గ్రూప్ గేమ్స్ కూడా ఆడుతోంది. నేటి ఎపిసోడ్ లో కూడా ఈమె వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఇంత కంటెంట్ వచ్చినప్పటికీ కూడా డేంజర్ జోన్ లో ఉందంటే ఆమె ఆట ఆడియన్స్ కి అసలు నచ్చడం లేదని చెప్పొచ్చు.

ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెడితే , కచ్చితంగా ఈమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఓటింగ్ లో అందరికంటే చివరి స్థానం లో ఉన్న కంటెస్టెంట్ కృష్ణుడు. ఈయన అసలు హౌస్ లో ఉన్న విషయాన్నే గమనించడం లేదు ఆడియన్స్. ఆ రేంజ్ కంటెంట్ ఈయన నుండి వస్తోంది. మొదటి వారం లో రోహిత్ తో గొడవ పడడం , త్రిగున్ తో కలిసి తిరగడం వల్ల , కాస్త స్క్రీన్ స్పేస్ వచ్చింది. కానీ ఈ వారం మాత్రం ఆయనకు సంబంధించిన ఫుటేజీ మొత్తాన్ని కలిపితే నిమిషం నిడివి కూడా ఉండదు. అందుకే ఈయన్ని ఈ వారం ఇంటికి పంపడానికి సిద్ధమయ్యారు ఆడియన్స్. ఈయనతో కూడా విషయం ఉంది అనే సంగతి ఈ వారం నామినేషన్స్ సమయం లో ఆయన ఆడిన టాస్కుని బట్టీ చెప్పొచ్చు. కానీ ఆ తర్వాత తన తోటి కంటెస్టెంట్స్ అందరూ వేరే లెవెల్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం తో కృష్ణుడు షైన్ అవ్వలేకపోయాడు. అందుకే ఈ వారం ఆయన ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. ఓవరాల్ గా ఇది పరిస్థితి. మరి మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు?, ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. మరి అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper