Homeక్రీడలుక్రికెట్‌Virat Kohli: సెంచరీ తో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. సచిన్ రికార్డు బద్దలు..మిగతా ప్లేయర్ల ఘనతలు...

Virat Kohli: సెంచరీ తో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. సచిన్ రికార్డు బద్దలు..మిగతా ప్లేయర్ల ఘనతలు జుజుబి

Virat Kohli: సాధారణంగానే అతడు పరుగుల చిరుత. ఎంత కొట్టినా సరే.. ఎన్ని పరుగులు చేసినా సరే అతడి దాహం తీరదు. ప్రారంభం నుంచి చివరి దాకా ఒకే విధానంలో ఆడుతూ ఉంటాడు. అందువల్లే అతడిని పరుగుల చిరుత అని పిలుస్తుంటారు. వయసు అనేది ఒక నెంబర్ మాత్రమేనని.. తన ముందు యంగ్ ప్లేయర్లు సైతం దిగదుడుపు అని నిరూపిస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ. తాజాగా వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్లో విరాట్ కోహ్లీ ఏకంగా […]

Virat Kohli: సాధారణంగానే అతడు పరుగుల చిరుత. ఎంత కొట్టినా సరే.. ఎన్ని పరుగులు చేసినా సరే అతడి దాహం తీరదు. ప్రారంభం నుంచి చివరి దాకా ఒకే విధానంలో ఆడుతూ ఉంటాడు. అందువల్లే అతడిని పరుగుల చిరుత అని పిలుస్తుంటారు. వయసు అనేది ఒక నెంబర్ మాత్రమేనని.. తన ముందు యంగ్ ప్లేయర్లు సైతం దిగదుడుపు అని నిరూపిస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ.

తాజాగా వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్లో విరాట్ కోహ్లీ ఏకంగా సెంచరీ కొట్టేశాడు. అది కూడా కేవలం 79 బంతుల్లో.. దాదాపు 38 సంవత్సరాల వయసులో ఉన్న అతడు..గిల్ కంటే వేగంగా.. వికెట్ల మధ్య చిరుతలాగా పరుగులు పెడుతూ పరుగులు తీయడం అంటే మామూలు విషయం కాదు. ఆట మీద ప్రేమ.. శరీరం మీద పట్టు.. వ్యాయామం.. ఇవన్నీ ఉంటేనే సాధ్యమవుతాయి. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం ఇప్పటికే జట్టుకూర్పు గురించి రకరకాల చర్చలు సాగుతున్న నేపథ్యంలో.. విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పైగా భారత జట్టుకు వన్డే వరల్డ్ కప్ అందించాలని.. వన్డే వరల్డ్ కప్ ఆడటం తన లక్ష్యమని విరాట్ కోహ్లీ చెప్పడం విశేషం. పైగా అతడు వీరోచితమైన సెంచరీ చేయడం గమనార్హం. ఈ కథనం రాసే సమయం వరకు 81 బంతుల్లో విరాట్ కోహ్లీ 116 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు.. 7 సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 143.21.. దీనిని బట్టి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

రికార్డులు మొత్తం గల్లంతు

ఈ సెంచరీ ద్వారా విరాట్ కోహ్లీ సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. లిస్ట్ ఏ క్రికెట్లో 60 సెంచరీలు చేశాడు. ఈ ఘనత సాధించడానికి సచిన్ టెండుల్కర్ కు 538 ఇన్నింగ్స్ లు అవసరమయ్యాయి. విరాట్ కోహ్లీకి కేవలం 338 ఇన్నింగ్స్ లు మాత్రమే సరిపోయాయి. ఇక ఈ జాబితాలో 44 సెంచరీలతో గ్రహం కోచ్ రెండో స్థానంలో ఉన్నాడు. అతడు 601 ఇన్నింగ్స్ లలో ఈ ఘనత సాధించాడు. ఇక మూడో స్థానంలో హిక్ ఉన్నాడు. ఇతడు 630 ఇన్నింగ్స్ లలో 40 సెంచరీలు చేశాడు. కుమార సంగకర 501 ఇన్నింగ్స్ లలో 39 సెంచరీలు చేశాడు. అయితే సమకాలీన క్రికెట్లో ఏ ఆటగాడు కూడా విరాట్ కోహ్లీకి దరిదాపుల్లో కూడా లేడు. విండీస్ తో తాజా సెంచరీ ద్వారా వన్డే లలో తన పరుగుల సంఖ్యను 15,000 కు పెంచుకున్నాడు.

ఫాస్టెస్ట్ సెంచరీ విభాగంలో

అత్యంత తక్కువ బంతుల్లో విరాట్ కోహ్లీ అనేకసార్లు సెంచరీలు చేశాడు. 2013లో జైపూర్ వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో 52 బంతుల్లోనే సెంచరీ చేశాడు. 2013లో నాగపూర్ వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో 61 బంతుల్లో సెంచరీ చేశాడు. 2026 లో త్రివేండ్రం వేదికగా వెస్టిండీస్ జట్టు మీద కేవలం 74 బంతులలో సెంచరీ చేశాడు. 2012లో హోబర్ట్ వేదికగా శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్లో 76 బంతుల్లోనే సెంచరీ చేశాడు.. 2017లో కొలంబో వేదికగా శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్లో 76 బంతుల్లో సెంచరీ చేశాడు. 2023లో గౌహతి వేదికగా శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్లో కేవలం 80 బంతుల్లోనే సెంచరీ చేశాడు.

ఇక విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్లో అత్యధికంగా శ్రీలంక జట్టు మీద సెంచరీలు చేశాడు. శ్రీలంక మీద అతడికి 10 సెంచరీలు ఉన్నాయి. తాజా సెంచరీ ద్వారా వెస్టిండీస్ జట్టు మీద కూడా ఆ సంఖ్యను పదికి పెంచుకున్నాడు.. విరాట్ కోహ్లీ తర్వాత రెండవ స్థానంలో సచిన్ కొనసాగుతున్నాడు. సచిన్ ఆస్ట్రేలియా జట్టు మీద 9 సెంచరీలను సాధించాడు. రోహిత్ కూడా ఆస్ట్రేలియా జట్టు మీద 9 సెంచరీలు సాధించాడు. విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా మీద 8.. శ్రీలంక జట్టు మీద సచిన్ టెండుల్కర్ 8 సెంచరీలు చేశారు.

జట్టులో స్థానం లేకుండా చూడాలని.. వన్డే ఫార్మాట్ నుంచి బయటికి పంపించాలని.. వయసును సాకుగా చెప్పి ఇబ్బంది పెట్టాలని.. గౌతమ్ గంభీర్ అనేక కుటిల ప్రయత్నాలు చేశాడు. కానీ విరాట్ కోహ్లీ తన బ్యాట్ ద్వారా మాత్రమే సమాధానం చెప్పాడు. ఎందుకంటే పరుగుల చిరుతకు ఒకరి గుర్తింపు అవసరం లేదు. ఒకరి రికమండేషన్ తో సంబంధం లేదు. ఆటే సమాధానం. చేస్తున్న పరుగులే సమాధానం.. అభిమానుల అరుపులు.. సోషల్ మీడియాలో పోస్టులు దీనికి బోనస్.

ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీని సిక్సర్ తో, సెంచరీ కూడా సిక్సర్ తో విరాట్ కోహ్లీ పూర్తి చేసుకోవడం అభిమానులు ఎన్నడూ మర్చిపోలేరు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper