Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ హౌస్‌లో అసలు ఏం జరుగుతోంది..?
కంటెంట్ కోసం కంటెస్టెంట్స్ కావాలనే గొడవలు పెట్టుకుంటున్నారా..?
స్క్రీన్ స్పేస్ కోసం హద్దులు దాటుతున్నారా..?
మొన్నటి వరకు వంశీ తన అరుపులతో హౌస్‌ను హీటెక్కిస్తే..
ఇప్పుడు శ్రేష్టి వంతు వచ్చింది!
ఒక్క నామినేషన్ ఎపిసోడ్‌తో హౌస్‌లో ఎన్నో మాస్కులు తొలగిపోయాయా..?
శ్రేష్టి, సుధీర్, అమన్, వర్షిణి, ముకేశ్.. వీళ్ల అసలు గేమ్ బయటపడిందా..?
అసలు నిన్నటి నామినేషన్స్‌లో ఏం జరిగింది..?
*శ్రేష్టి ఆవేశం.. నిజమా? కంటెంట్ కోసమా?*
బిగ్ బాస్ అంటేనే మనలో ఉన్న అసలైన వ్యక్తిత్వాన్ని బయటకు తీసుకొచ్చే షో. కానీ ఈ సీజన్‌లో కొంతమంది కంటెస్టెంట్స్ నుంచి సరైన కంటెంట్ రావడం లేదనే ఆలోచనతో.. అవసరం ఉన్నా లేకపోయినా గొడవలు, అరుపులు, మాటల దాడులతో స్క్రీన్ స్పేస్ సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. నిన్నటి నామినేషన్స్‌లో శ్రేష్టి, సుధీర్ మధ్య జరిగిన గొడవ దీనికి మరో ఉదాహరణగా మారింది.శ్రేష్టి.. సుధీర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.‘నువ్వు నాకు ఫ్రెండ్ కూడా కాదు’ అని శ్రేష్టి అనడం..
దానికి సుధీర్ ‘నాకు ఫ్రీడమ్ వచ్చింది’ అంటూ స్పందించడం..
అదే సమయంలో ముకేశ్, వర్షిణి నవ్వడంతో శ్రేష్టికి మరింత కోపం వచ్చింది. ఆ పరిస్థితిలో శ్రేష్టి రియాక్ట్ అవ్వడం సహజమే అనిపించొచ్చు. ఎందుకంటే ‘అగ్ని పరీక్ష 2’ నుంచి ఇప్పటివరకు శ్రేష్టి చాలా కూల్‌గా కనిపించింది. ఎలాంటి పరిస్థితినైనా నవ్వుతూ ఎదుర్కొనే ప్రయత్నం చేసింది. అలాంటి శ్రేష్టి ఒక్కసారిగా ఇలా ఆవేశానికి లోనవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది! కోపం మొదట నిజమైనదే అయినా.. ఆ తర్వాత దాదాపు అరగంట పాటు అదే విషయాన్ని కొనసాగిస్తూ పెద్ద సీన్ చేయడం మాత్రం కొంతమందికి కంటెంట్ కోసం చేసిన ప్రయత్నంలా కనిపించింది. ‘గుద్దానంటే పళ్లు రాలిపోతాయి’.. ‘వేషాలు వెయ్యకు’.. ఇలాంటి డైలాగ్స్ ఈ సీజన్‌లో ఒక్కసారిగా హౌస్‌లో హీట్ పెంచేశాయి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. స్క్రీన్ స్పేస్ వస్తేనే గ్రాఫ్ పెరగదు.. గేమ్ ఆడితేనే గ్రాఫ్ పెరుగుతుంది!
*వంశీకి ఎదురైన పరిస్థితి శ్రేష్టికి కూడా వస్తుందా?*
ఇదే విషయంలో వంశీని కూడా ఉదాహరణగా చూడొచ్చు.గత వారం మొత్తం స్క్రీన్ స్పేస్ కోసం గట్టిగా అరుస్తూ, హంగామా చేస్తూ కనిపించాడు.కానీ దాని వల్ల ప్రేక్షకుల్లో పాజిటివ్ ఇమేజ్ ఏర్పడిందా? అనేది ప్రశ్న. ఇప్పుడు ఈ వారం నామినేషన్స్‌లో వంశీ, శ్రేష్టి ఇద్దరూ ఉండటంతో.. వాళ్ల గేమ్‌పై ప్రేక్షకుల స్పందన కీలకంగా మారింది. ఒకవేళ కేవలం గొడవలు, అరుపులు, కాంట్రవర్సీలతోనే స్క్రీన్ స్పేస్ సంపాదించుకోవాలని ప్రయత్నిస్తే.. అది ఎప్పుడూ ప్లస్ అవుతుందని చెప్పలేం.
*రోహిత్, త్రిగున్.. అసలు డ్రామాకు కారణం వీళ్లేనా?*
ఇక నిన్నటి నామినేషన్స్‌లో జరిగిన మొత్తం హైడ్రామాకు రోహిత్, త్రిగున్ కారణమయ్యారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.వాళ్ల చుట్టూ జరిగిన చర్చల్లో శ్రేష్టి, సుధీర్, వర్షిణి, ముకేశ్‌ల రియాక్షన్స్ హైలైట్ అయ్యాయి.సుధీర్ మాట్లాడుతున్న ప్రతి మాటకు త్రిగున్ నుంచి వచ్చే రియాక్షన్స్.. దానికి సుధీర్ స్పందించే విధానం..
మధ్యలో శ్రేష్టి ఆవేశం.. ఇవన్నీ కలిపి నామినేషన్స్‌ను ఒక హై-వోల్టేజ్ ఎపిసోడ్‌గా మార్చేశాయి. అదే సమయంలో సుధీర్ విషయంలో వర్షిణి, ముకేశ్ నవ్విన విధానం కూడా సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
ఒక చిన్న నామినేషన్ పాయింట్.. చివరికి ఇంతమంది కంటెస్టెంట్స్ రియాక్షన్స్‌ను బయటకు తీసుకొచ్చింది.
*మధ్యలో దూరి.. అమన్ కమెడియన్ అయిపోయాడా?*
ఇక శ్రేష్టి, సుధీర్, త్రిగున్ మధ్య జరుగుతున్న గొడవలోకి అమన్ ఎంట్రీ ఇవ్వడం మరో హైలైట్. అసలు అమన్ ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సుధీర్.. పక్కనే ఉన్న త్రిగున్‌ను పైకి లేపండి అన్నట్టుగా మాట్లాడటంతో.. అమన్ ఒక్కసారిగా సుధీర్‌పైకి వచ్చాడు.‘ఎవరిని పైకి లేపమంటున్నావ్?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్కడి నుంచి అమన్ కూడా వాగ్వాదంలోకి దిగాడు. అయితే ఇక్కడే మరో ప్రశ్న వస్తోంది. ఇది నిజమైన ఆవేశమా? లేకపోతే స్క్రీన్ స్పేస్ కోసం కావాలనే ఎంటర్ అయ్యాడా? ఇప్పటివరకు పెద్దగా వివాదాల్లో కనిపించని అమన్.. ఒక్కసారిగా ఇలా రియాక్ట్ అవ్వడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. అందుకే సోషల్ మీడియాలో అమన్ గేమ్‌పై కూడా చర్చ మొదలైంది.
*హౌస్‌లో మరో కొత్త టీమ్?*
ఇక బిగ్ బాస్ హౌస్‌లో సమీకరణాలు మాత్రం ప్రతి వారం మారిపోతున్నాయి. మొదటి వారం సెలబ్రిటీలంతా ఒకవైపు..
‘అగ్ని పరీక్ష 2’ కంటెస్టెంట్స్ మరోవైపు కనిపించారు. ఆ తర్వాత త్రిగున్ గేమ్‌ను అర్థం చేసుకున్న ముకేశ్, వర్షిణి, సుధీర్, ఝాన్సీ అతని నుంచి దూరమై ప్రత్యేకంగా కనిపించారు. మరోవైపు రామ్ ప్రసాద్, నరేష్, దేబ్జాని కలిసి మరో గ్రూప్‌గా మారారు. వంశీ, త్రిగున్ ఒకవైపు కనిపించారు. ఇక అమన్, శ్రేష్టి మాత్రం అందరితో కలిసిమెలిసి ఉన్నట్టుగా కనిపించారు. కానీ గత రెండు ఎపిసోడ్స్‌ను గమనిస్తే కొత్త సమీకరణాలు ఏర్పడుతున్నట్టు కనిపిస్తోంది.
అమన్ + శ్రేష్టి + త్రిగున్ + వంశీ
ఈ నలుగురు ఒక టీమ్‌గా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే జరిగితే.. ఈ కొత్త టీమ్ హౌస్ గేమ్‌ను ఏ విధంగా మార్చబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా అమన్ ఏ గ్రూప్‌తో ఉంటాడనేది అతని గేమ్‌కు కీలకంగా మారే అవకాశం ఉంది.
మొత్తానికి బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పుడు అసలు గేమ్ మొదలైనట్టే కనిపిస్తోంది. కంటెంట్ కోసం కంటెస్టెంట్స్ హద్దులు దాటుతున్నారా..?
లేక ఇవన్నీ వాళ్ల అసలైన వ్యక్తిత్వాలేనా..?
శ్రేష్టి ఆవేశం నిజమా..?
అమన్ ఎంట్రీ వెనుక అసలు కారణం ఏంటి..?
కొత్తగా ఏర్పడుతున్న ఈ టీమ్ ఎంతవరకు కలిసి ఉంటుంది..?
మీ అభిప్రాయం ఏంటి?
శ్రేష్టి, అమన్, వంశీ, త్రిగున్‌లలో ఎవరి గేమ్ మీకు ఎలా అనిపిస్తోంది? కామెంట్ చేసి చెప్పండి.