Karthi:కార్తీ.. తమిళనాడులోని కాకుండా.. దక్షిణాది రాష్ట్రాలలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు. మొదట్లో చిత్ర పరిశ్రమకు సూర్య తమ్ముడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కార్తీ అన్నయ్య సూర్య అనే అంతగా తన స్థాయిని పెంచుకున్నాడు. విభిన్నమైన సినిమాలతో తనకంటూ సొంత మేనరిజాన్ని సృష్టించుకున్నాడు కార్తీ.
సమాజ హితమైన కార్యక్రమాలలో కార్తీ పాల్గొంటుంటాడు. ఆమధ్య రైతుగా అతడు నటించిన ఓ సినిమా తమిళనాడులో అతిపెద్ద విజయాన్ని అందుకుంది. ఆ సమయంలో చాలామంది రైతులకు కార్తి ఆర్థికంగా సహాయం అందించాడు. తన సోదరుడు నిర్వహిస్తున్న ఫౌండేషన్ కి కూడా తనవంతుగా సహాయం అందిస్తూ ఉన్నాడు. విద్యార్థులకు.. యువతకు తనవంతుగా బాసటగా నిలుస్తున్నాడు. సమాజ హితమైన కార్యక్రమాలలో పాల్గొనే కార్తి.. తాజాగా కోయంబత్తూర్ వెళ్ళాడు.
అక్కడ ఏం జరిగింది అంటే
కోయంబత్తూర్ ప్రాంతంలో మాజీ పోలీసు అధికారుల ప్రజా సంక్షేమ ట్రస్ట్ వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి నేరుగా సవాల్ విసిరాడు. పోలీసులు వారం రోజులపాటు విధులు నిర్వహించిన తర్వాత ఒకరోజు సెలవు తీసుకునే విధానం అమల్లోకి రావాలని సూచించారు. ఈ విధానాన్ని అమలలోకి తీసుకొస్తామని కొత్త ప్రభుత్వం ప్రకటించిందని.. కానీ ఇంతవరకు అది అమల్లోకి రాలేదని కార్తీ వాపోయారు.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో పోలీసులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని కార్తీ సూచించారు.
“పోలీసుల మీద పని భారం తగ్గాలి. వారి శారీరక.. మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలి. దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. పోలీస్ స్టేషన్లో జిమ్ లు ఉన్నప్పటికీ.. పని ఒత్తిడి కారణంగా వాటిని వారు ఉపయోగించుకోలేకపోతున్నారు. నేరస్తులను పట్టుకునేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లే పోలీసు అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని ప్రభుత్వం పరిష్కరించాలి. సోషల్ మీడియా వల్ల పోలీసుల మీద ఒత్తిడి పెరిగిపోయింది. ఒక నేరానికి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో బయటికి వచ్చిన తర్వాత.. కొన్ని గంటల్లోనే దానికి పరిష్కారం కావాలని ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయని.. ఇది దర్యాప్తు తీవ్రతను ప్రభావితం చేస్తుందని” కార్తి పేర్కొన్నారు.
కార్తీ చేసిన వ్యాఖ్యలను కొన్ని తమిళ మీడియా సంస్థలు టీవీకే ప్రభుత్వం మీద విమర్శగా పేర్కొన్నాయి. అయితే ఇతర కథనాలలో మాత్రం ఆయన ప్రధానంగా పోలీసుల వారాంతపు సెలవులు.. పని భారం.. ఆరోగ్యం.. సోషల్ మీడియా ఒత్తిడి వంటి అంశాలను మాత్రమే ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
కార్తీకి తమిళ ముఖ్యమంత్రి విజయ్ కి మంచి సంబంధాలే ఉన్నాయి. కాకపోతే ప్రజా సమస్యలను ప్రస్తావించే విషయంలో కార్తి ఏమాత్రం వెనుకాడడు. గతంలో డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా రైతుల సమస్యలను కార్తి ఇదే విధంగా ప్రస్తావించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా నిలిచారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోకూడదని.. ధైర్యంగా ఉండాలని సూచించారు.. ఇప్పుడు కార్తీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తమిళనాడు రాజకీయాలలో సంచలనంగా మారింది.
“డీఎంకే అయినా.. టీవీకే అయినా మార్పులేదు!”
ప్రజల భద్రత కోసం రాత్రింబవళ్లు విధులు నిర్వర్తించే పోలీసులకు వారాంతపు సెలవులు ఎందుకు ఇవ్వడం లేదని నటుడు కార్తి ప్రశ్నించారు.
కోయంబత్తూరులో జరిగిన మాజీ పోలీస్ అధికారుల ట్రస్ట్ 10వ వార్షికోత్సవంలో మాట్లాడిన కార్తి.. ఎన్నికల హామీ మేరకు… pic.twitter.com/r0tn7vcXEO
— Sai Satish (@PROSaiSatish) September 27, 2026