Homeక్రీడలుక్రికెట్‌Shubhman Gill: వెస్టిండీస్ పై సెంచరీ.. ఈ ఏడాది ఎన్ని పరుగులు చేశాడో తెలుసా..

Shubhman Gill: వెస్టిండీస్ పై సెంచరీ.. ఈ ఏడాది ఎన్ని పరుగులు చేశాడో తెలుసా..

Shubhman Gill: వరుసగా రెండు హాఫ్ సెంచరీలు. ఆ తర్వాత ఒక చిన్న బ్రేక్. మళ్లీ హాఫ్ సెంచరీ. ఈసారి 154 పరుగులు.. ఆ తర్వాత 80 పరుగులు.. మళ్లీ 31 పరుగులు.. ఆ తర్వాత 77 పరుగులు.. ఆ తర్వాత ఒక సెంచరీ.. ఇందులో మొత్తంగా ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రెండు సెంచరీలు ఉన్నాయి. ఇంతటి ఫామ్ కొనసాగిస్తున్న ఆటగాడు మరెవరో కాదు టీమిండియా యంగ్ కెప్టెన్ శుభ్ మన్ గిల్.. మైదానంలో పరుగుల […]

Shubhman Gill: వరుసగా రెండు హాఫ్ సెంచరీలు. ఆ తర్వాత ఒక చిన్న బ్రేక్. మళ్లీ హాఫ్ సెంచరీ. ఈసారి 154 పరుగులు.. ఆ తర్వాత 80 పరుగులు.. మళ్లీ 31 పరుగులు.. ఆ తర్వాత 77 పరుగులు.. ఆ తర్వాత ఒక సెంచరీ.. ఇందులో మొత్తంగా ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రెండు సెంచరీలు ఉన్నాయి.

ఇంతటి ఫామ్ కొనసాగిస్తున్న ఆటగాడు మరెవరో కాదు టీమిండియా యంగ్ కెప్టెన్ శుభ్ మన్ గిల్.. మైదానంలో పరుగుల వరద పారిస్తూ తిరుగులేని స్థాయిలో ఫామ్ కనబరుస్తున్నాడు గిల్. మొదట్లో అవమానాలు ఎదుర్కొని.. ఆ తర్వాత ఇబ్బందులు పడి.. తనను తానే ఈ స్థాయిలో మలచుకుని.. తిరుగులేని ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు గిల్.

వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న తొలి వన్డేలో ఏకంగా 110 పరుగులు చేశాడు. 108 బంతులలో 13 ఫోర్లు.. ఒక సిక్సర్ సహాయంతో అదరగొట్టాడు. తద్వారా తనను స్పెషలిస్ట్ ఆటగాడు అని ఎందుకు పిలుస్తారో మరోసారి నిరూపించాడు. తొలి వికెట్ 12 ఓవర్ లో 74 పరుగుల వద్ద టీమ్ ఇండియా కోల్పోయింది. రోహిత్ శర్మ 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్ కు ఏకంగా 151 పరుగుల భాగస్వామ్యాన్ని గిల్ నెలకొల్పాడు. 132 బంతుల్లోనే ఈ ఇద్దరి జోడి 151 పరుగులు చేయడం విశేషం. వీరిద్దరిని అవుట్ చేయడానికి వెస్టిండీస్ కెప్టెన్ హోప్ ఏకంగా ఐదుగురు బౌలర్లను రంగంలోకి దింపాడు. ఇందులో సీల్స్, మోటీయి కాస్త పర్వాలేదు అనిపించారు. కానీ మిగతా బౌలర్లు మాత్రం అంతగా ఆకట్టుకోలేదు.

గిల్ ఈ ఏడాది తిరుగులేని ఫామ్ లో ఉన్నాడు. వన్డే ఫార్మాట్ లో జట్టు పగ్గాలు అందుకున్నది ఈ సంవత్సరంలో అయినప్పటికీ.. ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిగా అతడు ఆడుతున్నాడు. ఓపెనర్ గా.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా.. వన్ డౌన్ ఆటగాడిగా ఇలా రకరకాల పాత్రలు పోషిస్తున్నాడు. నాయకుడిగా జట్టును ముందుకు నడిపిస్తూనే.. బ్రహ్మాండంగా పరుగులు చేస్తున్నాడు. తద్వారా 2027 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా కు సిసలైన నాయకుడిని తన అంటూ నిరూపించుకుంటున్నాడు.

తిరువనంతపురంలో జరుగుతున్న తొలి వన్డేలో ప్రారంభంలో వెస్టిండీస్ బౌలర్లను ఆచితూచి ఆడాడు గిల్. ఆ తర్వాత మైదానం మీద.. బంతిమీద స్పష్టమైన అవగాహన పెంచుకొని ఆ తర్వాత తన అస్సలు సిసలైన రూపాన్ని చూపించాడు. చెత్త బంతులను శిక్షించాడు. ఇబ్బంది పెట్టే బంతులకు మర్యాద ఇచ్చాడు. అందువల్లే ప్రారంభం నుంచి దాదాపు జట్టు గెలుస్తుంది అనే వరకు సానుకూలంగా బ్యాటింగ్ చేసి అదరగొట్టాడు. తద్వారా తనమీద అంచనాలను మరింత పెంచుకునేలా చేసాడు.

56, 56, 23, 84*, 154, 80*, 31, 77, 110.. గడిచిన తొమ్మిది ఇన్నింగ్స్ లలో గిల్ బ్యాటింగ్ సాగిన విధానం.. దీన్నిబట్టి అతడు ఏ స్థాయిలో ఫామ్ లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.. మొత్తంగా ఈ సెంచరీ ద్వారా తన శతకాల సంఖ్యను పదికి పెంచుకున్నాడు గిల్.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper