Homeక్రీడలుక్రికెట్‌IND vs WI: కులదీప్ హ్యాట్రిక్ మిస్.. టీంలోకి కొత్త కుర్రాడు.. వెస్టిండీస్ ఇలా ఆడుతుందని...

IND vs WI: కులదీప్ హ్యాట్రిక్ మిస్.. టీంలోకి కొత్త కుర్రాడు.. వెస్టిండీస్ ఇలా ఆడుతుందని అనుకోలేదు

IND vs WI: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆదివారం తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీం ఇండియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఆరంభంలోనే విండీస్ బ్యాటర్లు భారత బౌలర్ల మీద ఎదురుగా దిగారు. అదిరిపోయే ఆరంభం జాన్ క్యాంప్ బెల్.. జస్టిన్ గ్రీవ్స్.. తొలి వికెట్ కు ఏకంగా 135 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. క్యాంప్ బెల్ 60 […]

IND vs WI: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆదివారం తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీం ఇండియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఆరంభంలోనే విండీస్ బ్యాటర్లు భారత బౌలర్ల మీద ఎదురుగా దిగారు.

అదిరిపోయే ఆరంభం

జాన్ క్యాంప్ బెల్.. జస్టిన్ గ్రీవ్స్.. తొలి వికెట్ కు ఏకంగా 135 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. క్యాంప్ బెల్ 60 బంతుల్లో 62 పరుగులు చేశాడు. కులదీప్ యాదవ్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. ఇతడు అవుట్ అయ్యే సమయం వరకు భారత బౌలర్ల మీద వెస్టిండీస్ బ్యాటర్లు సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. క్యాంప్ బెల్ అవుట్ అయిన తర్వాత కూడా గ్రీవ్స్ తన దూకుడు కొనసాగించాడు. 108 బంతుల్లో 101 పరుగులు చేశాడు. తన తొలి వన్డే సెంచరీ నమోదు చేశాడు. ఇందులో ఏకంగా 12 ఫోర్లు ఉన్నాయి.

కులదీప్ వచ్చిన తర్వాత

వెస్టిండీస్ భారీ స్కోర్ దిశగా వెళ్తున్న నేపథ్యంలో కులదీప్ రంగంలోకి వచ్చాడు. ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాడు.. షై హోప్ ను 12 పరుగుల వద్ద అవుట్ చేశాడు. ఆ తర్వాత గ్రీవ్స్ ను డీఆర్ఎస్ ద్వారా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. సెంచరీ చేసిన కొద్దిసేపటికి గ్రీవ్స్ అవుట్ కావడం విశేషం. ఇది వెస్టిండీస్ జెట్ కు పెద్దదెబ్బగా మారింది. ఇక్కడితోనే కులది పాగిపోలేదు ఆ తర్వాతి బంతికే జువెల్ అండ్రు ను గోల్డెన్ డక్ గా వెనక్కి పంపించాడు. దీంతో క్లబ్ రెండు బంతిలో రెండు వికెట్లు తీసి హ్యాట్రిక్ కు చేరువయ్యాడు. అయితే ఆ బంతి కోసం స్టేడియం మొత్తం అత్యంత ఆసక్తిగా ఎదురు చూసింది. హ్యాట్రిక్ బంతిని ఎదుర్కొన్న రోస్టర్ చేజ్ మాత్రం కులదీప్ బంతిని ఎదుర్కొనే వికెట్ పడకుండా చూసుకున్నాడు. దీంతో కులదీప్ కు హ్యాట్రిక్ లభించలేదు. ఆ ఓవర్ లోనే అతడు రెండు వికెట్లు తీయడంతో పాటు.. మేయిడ్ ఇన్ ఓవర్ వేశాడు. మొత్తంగా నాలుగు వికెట్లను పడగొట్టాడు

ఇక ఈ మ్యాచ్లో టీమ్ ఇండియాలోకి నమన్ దీర్ ఎంట్రీ ఇచ్చాడు. 26 సంవత్సరాల ఈ ఆల్ రౌండర్ కు టీమిండియా మేనేజ్మెంట్ తొలి వన్డే క్యాప్ ఇచ్చింది. గర్నూర్ బ్రార్ కూడా జట్టులో ఉన్నాడు. మహమ్మద్ సిరాజ్ కు ఈ మ్యాచ్లో చోటు లభించలేదు. అయితే టీం ఇండియా తరఫున రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీ జట్టులోకి రావడంతో ఈ మ్యాచ్ మీద భారీ ఆసక్తి ఏర్పడింది. 2027 ప్రపంచకప్ కు ముందు కాంబినేషన్ ను పరిరక్షించుకోవడంలో భాగంగా భారత జట్టు అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది..ఈకథనం రాసే సమయం వరకు వెస్టిండీస్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. అమీర్ జాంగో 51 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. రోస్టన్ చేజ్ 24 పరుగులుచేశాడు. ప్రసిద్ధ్ క్రిష్ణ బౌలింగ్ లో ఔట్అయ్యాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper