Homeటాప్ స్టోరీస్Adarsha Kutumbam: ఆదర్శ కుటుంబంలో ‘నారాయణమ్మ’ పార్టీ.. పాతకు పేరడీ.. కొత్తదనం ఏదీ గురూజీ..

Adarsha Kutumbam: ఆదర్శ కుటుంబంలో ‘నారాయణమ్మ’ పార్టీ.. పాతకు పేరడీ.. కొత్తదనం ఏదీ గురూజీ..

Adarsha Kutumbam: త్రివిక్రమ్ సినిమాలో పాటలకు ఒక రేంజ్ ఉంటుంది. అరవింద సమేత వీర రాఘవ సినిమా నుంచి త్రివిక్రమ్.. తమన్ జోడికి మంచి పేరు వచ్చింది. అప్పటినుంచి త్రివిక్రమ్ మరొక సంగీత దర్శకుడిని పెట్టుకోవడం లేదు. త్రివిక్రమ్ రూపొందించిన ప్రతి సినిమాకు తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకటేష్.. శ్రీనిధి శెట్టి కలయికలో త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం సినిమాకు కూడా తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల టీజర్ విడుదలైంది. […]

Adarsha Kutumbam: త్రివిక్రమ్ సినిమాలో పాటలకు ఒక రేంజ్ ఉంటుంది. అరవింద సమేత వీర రాఘవ సినిమా నుంచి త్రివిక్రమ్.. తమన్ జోడికి మంచి పేరు వచ్చింది. అప్పటినుంచి త్రివిక్రమ్ మరొక సంగీత దర్శకుడిని పెట్టుకోవడం లేదు. త్రివిక్రమ్ రూపొందించిన ప్రతి సినిమాకు తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.

వెంకటేష్.. శ్రీనిధి శెట్టి కలయికలో త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం సినిమాకు కూడా తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లో కొత్తదనం లేకపోవడంతో మిశ్రమ స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి నారాయణమ్మ అనే పేరుతో ఓ పాట విడుదలైంది. ఈ పాట పాత కు పేరడీ లాగానే ఉంది. వెనుకటి రోజుల్లో విడుదలైన సినిమాల్లో నారాయణమ్మ అనే పదం ప్రముఖంగా వినిపించేది. బహుశా తన సినిమాలకు పాతపాటలను.. పాత సన్నివేశాలను రిఫరెన్స్ గా వాడే త్రివిక్రమ్.. నారాయణమ్మ పాటకు కూడా పాత పాటలనే ఆదర్శంగా తీసుకున్నారు. టీజర్ లో కొత్తదనం కనిపించకపోవడం.. నారాయణమ్మ సినిమాలో కూడా పాత వాసనలే ఉండడంతో ఆదర్శ కుటుంబం దసరా విజేతగా నిలుస్తుందా అనే అనుమానాలను ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.

కుటుంబం.. బంధాలు.. ఆప్యాయతలు.. వంటి ఇంటి వాతావరణం అంశాలను చూపించినప్పుడు కథలో పాటలు ప్రత్యేకంగా ఉండాలి. కానీ ఇటువంటి వాతావరణం ప్రతిబింబించేందుకు నారాయణమ్మ అనే పాటను త్రివిక్రమ్ ఎంచుకోవడం ఒకరకంగా సాహసమే. కాకపోతే ఈ పాటను ఆశించినంత స్థాయిలో తమన్ రూపొందించలేకపోయాడు..

ఒక వ్యక్తిని కేంద్రంగా తీసుకొని ఈ పాటను రూపొందించడంతో అప్పటి తరహాలో బంధాలు.. ఆప్యాయతలు ఇందులో కనిపించలేదు. కాకపోతే పాట రాసిన రామ జోగయ్య శాస్త్రి క్లిష్టమైన పదాలను వాడలేదు. సరళమైన పదాలను ఉపయోగించారు. అందువల్ల నేటి తరానికి ఈ పాట కాస్తలో కాస్త కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అల వైకుంఠపురంలో పాటల విషయంలో త్రివిక్రమ్ కాస్త శ్రద్ధ తీసుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలలో త్రివిక్రమ్ మార్క్ కనిపించడం లేదు. ముఖ్యంగా గుంటూరు కారంలో కుర్చీ మడతపెట్టి పాట మినహా.. మిగతావీ ఏవి అంతగా ప్రేక్షకులకు గుర్తుండవు. నేపథ్య సంగీతం కూడా అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు ఆదర్శ కుటుంబం సినిమా విషయంలో త్రివిక్రమ్ శ్రద్ధ తీసుకుంటాడని.. తమన్ కొత్త బాణీలు అందిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అదంతా ఎండమావి అని నారాయణమ్మ పాట ద్వారా అర్థమైంది. టీజర్ ప్రామిసింగ్ గా లేకపోవడం.. నారాయణమ్మ పాట అంత గొప్పగా లేకపోవడం.. చూడబోతే ఆదర్శ కుటుంబానికి ఏవో అపశకునాలు ఎదురవుతున్నట్టు వెంకీ మామ అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. మరి దీనికి త్రివిక్రమ్ ఎటువంటి లేపనం పూస్తారో చూడాలి.

ఈ పాటలో డింపుల్ హయాతి అందంగా ఉంది. స్టెప్పులతో అదరగొట్టింది. మరో హీరోయిన్ నివేదాపేతురాజ్ కూడా ఆందులో సందడి చేసింది. రామ్ మిర్యాల, ప్రభ బంగరిగల్లా ఈ పాటను ఆలపించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper