Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10' మొదటి వారం నామినేషన్స్ లోకి వచ్చిన...

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ మొదటి వారం నామినేషన్స్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ వీళ్ళే!

Bigg Boss 10 Telugu: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘బిగ్ బాస్ 10’ ఎట్టకేలకు నిన్న భారీ లెవెల్ లో మొదలైంది. గత సీజన్ లాగానే ఈ సీజన్ కూడా ఆరంభం నుండే మంచి ఫైర్ తో మొదలైంది. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన వెంటనే జరిగిన కొన్ని సంఘటనలు పెద్ద గొడవలకు దారి తీసింది. ముఖ్యంగా త్రిగున్ పై కంటెస్టెంట్స్ అందరూ ఆరోపణలు చేస్తున్నారు. ఇతను చాలా డామినేషన్ […]

Bigg Boss 10 Telugu: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘బిగ్ బాస్ 10’ ఎట్టకేలకు నిన్న భారీ లెవెల్ లో మొదలైంది. గత సీజన్ లాగానే ఈ సీజన్ కూడా ఆరంభం నుండే మంచి ఫైర్ తో మొదలైంది. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన వెంటనే జరిగిన కొన్ని సంఘటనలు పెద్ద గొడవలకు దారి తీసింది. ముఖ్యంగా త్రిగున్ పై కంటెస్టెంట్స్ అందరూ ఆరోపణలు చేస్తున్నారు. ఇతను చాలా డామినేషన్ చూపిస్తున్నాడని, అవసరానికి మించి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని, ఇది అసలు కరెక్ట్ కాదని హౌస్ మేట్స్ కొంతమంది అనుకుంటుంటే, ప్రేక్షకులు మాత్రం ఇతనికి అధిక శాతం సపోర్టు చేస్తున్నారు. ఇకపోతే నిన్న రోహిత్ తో త్రిగున్ కి జరిగిన డిబేట్ లో కూడా త్రిగున్ కి ఎక్కువ మంది సపోర్టు చేస్తున్నారు. ఇకపోతే నేడు నామినేషన్స్ ప్రక్రియ ప్రస్తుతం హౌస్ లో నడుస్తోంది.

ఈ నామినేషన్స్ ప్రక్రియ ద్వారా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళడానికి నామినేట్ అయినవాళ్లు ఎవరో ఒకసారి చూద్దాం. రోహిత్, ముకేశ్ మధ్య నామినేషన్స్ లో చాలా పెద్ద డిబేట్ జరిగిందట. వీళ్లిద్దరు ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. అదే విధంగా రామ్ ప్రసాద్ కూడా నామినేషన్స్ లోకి వచ్చాడట. హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుండి రామ్ ప్రసాద్ అందరితో చాలా ఫ్రెండ్లీ గా ఉన్నాడు. అయినప్పటికీ ఆయన్ని ఎందుకు నామినేట్ చేసారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక నామినేషన్స్ లోకి వచ్చిన నాల్గవ కంటెస్టెంట్ దేబ్ జానీ. ఈమెని రోహిత్ నామినేట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక వీళ్ళతో పాటు షాలిని కూడా నామినేషన్స్ లోకి వచ్చిందట. ఈమెకు , త్రిగున్ కి మధ్య చిన్నపాటి వాదన ఒకటి జరిగింది. బహుశా ఈమెని త్రిగున్ నామినేట్ చేసి ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు.

అదే విధంగా త్రిగున్ కూడా నామినేషన్స్ లోకి వచ్చాడట. మొత్తం మీద ఇప్పటి వరకు 6 మంది నామినేట్ అయ్యారు. మరో నలుగురు నామినేషన్స్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పైన చెప్పిన 6 మంది మాత్రమే నామినేషన్స్ లో ఉంటే మాత్రం షాలిని ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే మిగిలిన 5 మందితో పోలిస్తే ఈమెకు తక్కువ ఫాలోయింగ్ ఉంది. ఒకవేళ కృష్ణుడు నామినేషన్స్ లోకి వస్తే , ఆయన ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ , చూడాలి మరి చివరికి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper