Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10' కి పనికిరానని అన్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్న...

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ కి పనికిరానని అన్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్న రాజకుమారి!

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘బిగ్ బాస్ 10’ షో నిన్న చాలా గ్రాండ్ గా మొదలైంది. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే , ప్రతీ కంటెస్టెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అయినా ప్రేక్షకులకు బాధగానే ఉంటుంది. ఆ రేంజ్ లో ఉన్నారు ఒక్కొక్క కంటెస్టెంట్. అయితే ‘అగ్ని పరీక్ష 2’ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొంతమంది […]

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘బిగ్ బాస్ 10’ షో నిన్న చాలా గ్రాండ్ గా మొదలైంది. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే , ప్రతీ కంటెస్టెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అయినా ప్రేక్షకులకు బాధగానే ఉంటుంది. ఆ రేంజ్ లో ఉన్నారు ఒక్కొక్క కంటెస్టెంట్. అయితే ‘అగ్ని పరీక్ష 2’ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొంతమంది కంటెస్టెంట్స్ పై సోషల్ మీడియా లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. టాలెంట్ కి విలువ ఇవ్వడం లేదని, రికమండేషన్స్ కి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా రామకృష్ణ, రాజాకుమారి , అపూర్వ లను బిగ్ బాస్ హౌస్ లోకి పంపడం పై మండిపడుతున్నారు నెటిజెన్స్. వీరిలో రామకృష్ణ , అపూర్వ లకు ఆడియన్స్ ద్వారా భారీ ఓటింగ్ నమోదైంది.

రాజా కుమారి టాస్కులు అద్భుతంగా ఆడింది ఏదైనా చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడడం ఈమె స్వభావం. ఒక్క అందం లో తప్ప , ఈమె శ్రేష్టి కంటే అన్ని విభాగాల్లో ది బెస్ట్ అనిపించుకుంది. అయినప్పటికీ ఈమెని బిగ్ బాస్ హౌస్ లోకి పంపకపోవడం ఏంటో అర్థం కావడం లేదని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈమె ‘బిగ్ బాస్ 10’ మొదలయ్యే ముందు , ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ లో ఆమెకు ‘అగ్ని పరీక్ష 2’ లో ఎదురైనా అనుభవాలను పంచుకుంటూ బాగా ఎమోషనల్ అయ్యింది.

ఆమె మాట్లాడుతూ ‘మనం అనుకున్నవన్నీ అవ్వాలని రూల్ లేదు. కొన్ని సార్లు మనం అనుకున్నవి జరగొచ్చు , జరగకపోవచ్చు, ఓటమి ని కూడా మెట్టుగా మలుచుకొని ముందుకు వెళ్లడమే నాకు తెలుసు. ‘బిగ్ బాస్ ‘ లో కూడా అవకాశం రాకపోతే అక్కడితో నా కెరీర్ ముగిసింది అనుకోను. చాలా మంది నాకు లీడర్ షిప్ స్కిల్స్ లేవు, ఆలోచించడం రాదు , బిగ్ బాస్ షో కి పనికిరానని అనుకున్నారు. కానీ బిగ్ బాస్ అంటే ఇలాగే ఉంటుంది అనేది తెలుసుకున్నాను. ఇలా మనల్ని రెచ్చగొట్టే మనుషులు ఉంటారు , అలాంటి చోట ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది రాజా కుమారి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper