Homeటాప్ స్టోరీస్Kalki 2: దీపిక విషయంలో నాగ్ అశ్విన్ సంచలనం.. ఇంతకీ ప్రభాస్ సినిమా ఉంటుందా..

Kalki 2: దీపిక విషయంలో నాగ్ అశ్విన్ సంచలనం.. ఇంతకీ ప్రభాస్ సినిమా ఉంటుందా..

Kalki 2: నాగ్ అశ్విన్.. ఇంతవరకు ప్లాఫ్ అంటే తెలియని దర్శకుడు. మహానటి నుంచి మొదలుపెడితే కల్కి వరకు ఇతడు రూపొందించిన సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. ముఖ్యంగా ప్రభాస్ హీరోగా కల్కి 2898 ఏడి సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా క్లైమాక్స్ తోనే రెండవ భాగం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో సుమతి పాత్రకు కథలో ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో.. రెండవ భాగం మొత్తం ఆమె చుట్టూ తిరుగుతుందని అప్పట్లో […]

Kalki 2: నాగ్ అశ్విన్.. ఇంతవరకు ప్లాఫ్ అంటే తెలియని దర్శకుడు. మహానటి నుంచి మొదలుపెడితే కల్కి వరకు ఇతడు రూపొందించిన సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. ముఖ్యంగా ప్రభాస్ హీరోగా కల్కి 2898 ఏడి సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా క్లైమాక్స్ తోనే రెండవ భాగం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమాలో సుమతి పాత్రకు కథలో ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో.. రెండవ భాగం మొత్తం ఆమె చుట్టూ తిరుగుతుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. వైజయంతి మూవీస్ కూడా అదే విధంగా సంకేతాలు ఇచ్చింది. అయితే ఇప్పుడు నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సుమతి పాత్రలో దీపిక పదుకొనే నటించింది. అయితే ఇప్పుడు కల్కి 2లో కొత్తగా ఎటువంటి మార్పులు చేర్పులు లేవని.. నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఇన్ని రోజులపాటు దీపిక పోషించిన సుమతి పాత్ర స్థానంలో మరొక కథానాయికను తీసుకున్నారని ప్రచారం జరిగిన నేపథ్యంలో.. దానికి నాగ్ అశ్విన్ చెక్ పెట్టినట్టు తెలుస్తోంది.

సుమతి పాత్ర లేకుండా సాధ్యమేనా

మొదటి భాగంలో సుమతి పాత్ర సాధనమైనది కాదు. భవిష్యత్తులో జన్మించబోయే కల్కి కి తల్లి ఆమె కావడంతో.. కథలో అత్యంత కీలకమైన పాత్రధారిగా నిలిచింది. అశ్వద్ధామ అమెరికా పాడేందుకు ప్రయత్నించడం.. యాస్కిన్ సుమతి గర్భంలోని శిశువును తనకు పనికి వచ్చే శక్తి లాగా చూడడం.. ఇలా కథలోని ప్రతి సంఘర్షణ సుమతిని కథలో కీలకమైన కేంద్ర బిందువుగా మార్చింది.

ఎలా భర్తీ చేస్తారు

మొదటి భాగంలో క్లైమాక్స్లో సుమతి వచ్చే సన్నివేశాలు సినిమాకు అత్యంత ఆసక్తికరంగా మార్చాయి. ఆమె గర్భంలో ఉన్న శిశువు సాధారణమైన వ్యక్తి కాదని ప్రేక్షకులకు ఒక క్లారిటీ వస్తుంది. అందువల్లే సెకండ్ పార్ట్ లో కల్తీ పుట్టడం.. అతడి ఫ్యూచర్.. యాస్కిన్ తో చేసే పోరాటం వంటి అంశాలకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే వీటితో సుమతికి బలమైన సంబంధం ఉంటుందని ప్రేక్షకులు ముందుగానే ఒక అంచనాకొచ్చారు. ఎందుకంటే సన్నివేశాలు కూడా అదే విధంగా ఉన్నాయి. దీపిక కల్కి 2 లో లేకపోతే.. ప్రేక్షకులు ఎలా చూస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. పైగా సుమతి పాత్రను ఎలా భర్తీ చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంది.

దీపిక లేకపోతే

ఈ సినిమాలో దీపిక గనక లేకపోతే దర్శకుడు సుమతి పాత్రను పూర్తిగా తొలగిస్తారా.. లేదా కథలో ఆమె ఉనికిని వేరొక విధంగా చూపిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇంతవరకు దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. మొదటి భాగంలో కథకు సుమతి బలమైన పునాది వేసింది. రెండవ భాగంలో సుమతి గనక లేకపోతే కథలో.. కథనంలో పెద్ద మార్పు అవుతుంది. ఇక మొదటి భాగంలో ప్రభాస్ హీరోగా కనిపించలేదు. అతను పోషించిన భైరవ పాత్ర పెద్దదే అయినప్పటికీ.. కల్కి పురాణం.. అశ్వత్థమ.. సుమతి.. యాస్కిన్ చుట్టూ కథ తిరగడంతో పెద్ద ప్రపంచం గా మారింది.

ఒకవేళ రెండో భాగంలో భైరవ నుంచి కల్కి వరకు కథ మారితే.. అప్పుడు సుమతి పాత్ర మరో తీరుగా ఉండవచ్చని అభిమానులు అంచనా వేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper