IND vs WI: వన్డే క్రికెట్లో 295 పరుగులు అంటే మామూలు విషయం కాదు. పైగా ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్లో ఈ స్కోరును చేజింగ్ చేయడం అంత సులభం కాదు పైగా వెస్టిండీస్ జట్టులో భీకరమైన బౌలర్లు ఉంటారు. మైదానం మీద ఏమాత్రం తేమ ఉన్నా సరే వాళ్లు అదరగొడతారు. పైగా ఇప్పుడు ఉన్న వెస్టిండీస్ జట్టులో బౌలర్లు బీకరమైన ఫామ్ లో ఉన్నారు. అటువంటి బౌలర్లను ఎదుర్కొని ఏకంగా 296 పరుగులు చేయడం అంత ఈజీ కాదు. కానీ దీనిని చేసి చూపించారు టీమిండియా బ్యాటర్లు.
ముందుగా కెప్టెన్ గిల్ సెంచరీ చేశాడు. కాకపోతే అతడు సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. వికెట్ పడకుండా.. పరుగులు తగ్గకుండా బ్యాటింగ్ చేశాడు. రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్ కు 72 పరుగులు.. విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్ కు 151 పరుగులు జోడించాడు. ఒకరకంగా టీమ్ ఇండియా చేతిలోకి మ్యాచ్ తీసుకుని వచ్చాడు. గిల్ సమయోచితంగా బ్యాటింగ్ చేస్తే.. విరాట్ కోహ్లీ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. పరుగుల వరద పారించాడు. 88 బంతుల్లో 139* పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు.. 9 సిక్సర్లు ఉన్నాయి. 151.95 స్ట్రైక్ రేట్ ను కొనసాగించాడు.
విరాట్ కోహ్లీ వీరోచితం.. గిల్ హీరోచితం.. మొత్తంగా టీమిండియాను విజేతగా నిలిపాయి. వెస్టిండీస్ విధించిన 296 పరుగుల లక్ష్యాన్ని.. టీమిండియా కేవలం 41.4 ఓవర్లలోనే ఫినిష్ చేసింది. అది కూడా రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి.. ఈ ఘనతను అందుకుంది. ఈ ప్రకారం చూసుకుంటే 2027లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఇదే స్థాయిలో గనుక ఆట తీరు ప్రదర్శిస్తే ఇక తిరుగు ఉండదు. వన్ డే ఫార్మాట్లో టీమ్ ఇండియా ప్రస్తుతం తిరుగులేని స్థాయిలో ఆడుతోంది. ఒకవేళ టీమ్ ఇండియాకు ఆస్ట్రేలియా లేదా దక్షిణాఫ్రికా నుంచి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా బ్యాటర్లు దక్షిణాఫ్రికా మైదానం మీద ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్లో మన మైదానాలను దక్షిణాఫ్రికా మైదానాల మాదిరిగా తీర్చి దిద్దుతున్నారు. ఈ ప్రకారం మన వాళ్లకు దక్షిణాఫ్రికా గడ్డమీద సులభంగా ఆడే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న జట్టులో కొన్ని మార్పులు చేసి దక్షిణాఫ్రికా గడ్డమీదికి పంపిస్తే.. ఈసారి వన్డే వరల్డ్ కప్ తీసుకొస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గిల్.. విఫలమైనా రోహిత్ ఉన్నాడు.. రోహిత్ విఫలమైనా విరాట్ కొన్నాడు.. విరాట్ విఫలమైతే కేఎల్ రాహుల్.. ఇంకా చాలామంది ప్లేయర్లు ఉన్నారు.
2023లో అయిన గాయం ఇంకా మానలేదు. ఆ గాయం తాలూకూ బాధ ఎలా ఉందో ఇటీవల రోహిత్ మాట్లాడితే తెలిసింది. విరాట్ కోహ్లీ చెబితే అర్థమైంది. ఈ గెలుపు జస్ట్ విక్టరీ మాత్రమే కాదు.. 2027 వన్డే వరల్డ్ కప్ సాధించడానికి ఏర్పడిన బలమైన పునాది.
Moment for the history books
The magical feeling of scaling Mt. 1⃣5⃣0⃣0⃣0⃣ ODI runs, ft. Virat Kohli ️
Updates ▶️ https://t.co/O2cs86p4gq#TeamIndia | #INDvWI | @mflone_ | @imVkohli pic.twitter.com/sbqA6KtBsr
— BCCI (@BCCI) September 27, 2026
That feeling when you bring up ODI century No. 10
Captain @ShubmanGill taking a well-earned moment to soak in the applause
Updates ▶️ https://t.co/O2cs86p4gq#TeamIndia | #INDvWI | @mflone_ pic.twitter.com/395GvC34x5
— BCCI (@BCCI) September 27, 2026