Bigg Boss: ఒకే ఇంట్లో భిన్నమైన వ్యక్తిత్వం ఉన్న మనుషుల మధ్య , 100 రోజుల పాటు , బయట ప్రపంచం తో సంబంధం లేకుండా ఉండడం అనేది సాధారణమైన విషయం కాదు. ఈ కాన్సెప్ట్ తో వచ్చిన ‘బిగ్ బాస్’ మన దేశం లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ రియాలిటీ షో అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఈ బిగ్ బాస్ వాతావరణం లో అందరూ ఇమడలేరు. కొంతమంది అయితే బిగ్ బాస్ హౌస్ నుండి పారిపోయే ప్రయత్నం చేశారు. మన తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ లో సంపూర్ణేష్ బాబు కూడా ఇలాంటి ప్రయత్నమే చేసాడు. పెద్ద రచ్చ , గొడవ చేసి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాడు. ఇలా ఇతర భాషలకు సంబంధించిన సీజన్స్ లో కూడా జరిగింది. రీసెంట్ గానే హిందీ లో మొదలైన సరికొత్త బిగ్ బాస్ సీజన్ లో కూడా ఒక కంటెస్టెంట్ ఇదే చేసాడు.
ఆ కంటెస్టెంట్ పేరు అన్సర్ . ఇతను బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లేందుకు చేసే ప్రయత్నానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో లో అన్సర్ ముందుగా తలుపులు తెరవమని డోర్లు గట్టిగా కొడుతారు. ఎవ్వరూ రెస్పాన్స్ ఇవ్వకపోవడం తో, గోడ దూకి బిగ్ బాస్ హౌస్ నుండి బయటపడే ప్రయత్నం చేస్తాడు. దీన్ని చూసిన నెటిజెన్స్ రెండు రోజులు కూడా బిగ్ బాస్ హౌస్ వాతావరణం తట్టుకోలేని పరిస్థితి లో ఉన్నప్పుడు , ఈ షోకి రావడం ఎందుకు? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. సామాన్యులకు మాత్రం బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనేందుకు ‘అగ్ని పరీక్ష’ వంటి షోస్ ని నిర్వహించి , వాళ్ళని అనేక విధాలుగా చిత్రహింసలకు గురి చేసి లోపలకు పంపుతారు , ఇలాంటి పిరికి వాళ్లకు మాత్రం చాలా తేలికగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇప్పిస్తారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు.
మరి అన్సర్ చేసిన ఈ పని పై , ఆ సీజన్ కి హోస్ట్ సల్మాన్ ఖాన్ ఎలాంటి రియాక్షన్ ఇస్తాడో చూడాలి. సల్మాన్ ఖాన్ మన అక్కినేని నాగార్జున లాగా , చాలా కూల్ గా మాట్లాడే వ్యక్తి కాదని , ఇలాంటి పనులు చేసే కంటెస్టెంట్స్ కి ఆయన గతం లో అనేక సార్లు చుక్కలు చూపించిన సందర్భాలు ఉన్నాయని, కచ్చితంగా ఈ వారం సోషల్ మీడియా పేలిపోయే రేంజ్ కంటెంట్ ని సల్మాన్ ఖాన్ ఇస్తాడని అంటున్నారు నెటిజెన్స్.
View this post on Instagram