DMK delimitation : డీఎంకే మొన్నటిదాకా ఇండియా కూటమిలో ఉండేది. ఆ పార్టీకి బిజెపి అంటే అసలు ఇష్టం ఉండదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇటీవల టీ వీ కే కు సపోర్ట్ చేయడం.. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటే.. ఎమ్మెల్యేలను ప్రభుత్వ ఏర్పాటులో కీలక భాగస్వామ్యం చేయడంతో డీఎంకే కు కోపం వచ్చింది. వెంటనే ఇండియా కూటమి నుంచి తప్పుకుంది. కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడం మొదలుపెట్టింది. టివి కే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ కార్యక్రమాలు చేపడుతోంది.
ఇండియా కూటమికి దూరం జరిగిన తర్వాత డిఎంకె సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏకు దగ్గరగా అడుగులు వేయడం ప్రారంభించింది. అంతేకాదు నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు సపోర్ట్ ఇచ్చింది. ఇది తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారింది. జాతి రాజకీయాల్లో కూడా చర్చకు దారి తీస్తోంది. గతంలో దక్షిణ ప్రాంత రాష్ట్రాల హక్కుల పేరుతో డీఎంకే స్వరం గట్టిగా వినిపించేది. ఇప్పుడు బిల్లువైపు మొగ్గు చూపించింది. ఫలితంగా ఎన్డీఏ కూటమికి తాము జై కొడతామని ప్రకటించింది.
డీఎంకే ఈ బిల్లు వైపు సపోర్ట్ చేయడం ఎంత రెండు కోణాలు క్లారిటీగా కనిపిస్తున్నాయి. మొదటిది పార్టీ ఉనికిని కాపాడుకోవడం.. సంస్థ కథ బలాన్ని పెంపొందించుకోవడం.. రెండవది కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు వల్ల ఏర్పడిన రాజకీయ అవకాశాన్ని అనుకూలంగా మార్చుకోవడం.. అందువల్లే బిజెపి అటాచ్ చేయకుండానే సంధికి డీఎంకే సంకేతాలు ఇచ్చింది. వాస్తవానికి అధికారం కోల్పోయినప్పటికీ తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే స్థిరంగా.. సంఘటితంగా నిలబడుతోంది. మరవెపు బెంగాల్ రాష్ట్రంలో మమత బెనర్జీ ఆధ్వర్యంలో టీఎంసీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. కేంద్ర దర్యాప్తు సంస్థల వేధింపులు.. రాజకీయంగా ఎదురవుతున్న దెబ్బలు వంటి వాటిని చూసిన తర్వాత డిఎంకె జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. బిజెపి గనుక తలుచుకుంటే.. కేంద్ర యంత్రాంగాన్ని ఉపయోగిస్తే డీఎంకేకు కూడా అటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అందువల్లే స్టాలిన్ భయం.. ఆత్మ రక్షణ ధోరణితో బిజెపికి జై కొట్టారు. వాటిని కాపాడుకోవాలి కాబట్టి కేంద్రంతో అనవసరమైన ఘర్షణ వద్దని దూరం జరిగారు. వ్యూహాత్మకంగా సమన్వయం చేసుకోవాలని భావించారు.
ఇండియా కూటమి నుంచి డీఎంకే బయటికి రావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యూహాత్మక తప్పిదం. విజయ్ ఆధ్వర్యంలో టి వి కే వైపు కాంగ్రెస్ మొగ్గు చూపించింది. ఆ ప్రభుత్వంలో చేరిపోయింది. ఇది డిఎంకెకు ఆగ్రహాన్ని కలిగించింది. దీంతో కాంగ్రెస్ కు తెగ తెంపులు చేసుకుంది. ఇక జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో కలిసి ప్రయాణం సాగించాల్సిన అవసరం లేదని నిర్ణయానికి వచ్చింది. బంధం బద్దలు కావడంతో డైలీమిటేషన్ బిల్లు మీద తన ఇండిపెండెంట్ పొలిటికల్ ఈక్వేషన్స్ ప్రకారం ముందుకు వెళ్లడానికి డీఎంకేకు రోడ్డు క్లియర్ అయింది
ఇక డీలిమిటేషన్ వల్ల సీట్లు పెరిగితే అది డీఎంకేకు లాభం చేకూర్చే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయ్ కేవలం అభిమానుల బలం.. సోషల్ మీడియా హైప్ వల్ల ముఖ్యమంత్రి అయ్యారని.. ఆ పార్టీకి బలమైన క్యాడర్ లేదని డిఎంకె అంచనా వేస్తోంది. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే విజయ్ మీద వ్యతిరేకత పెరుగుతుండడంతో స్టాలిన్ ఆలోచనలో పడ్డారు. అందువల్లే నియోజకవర్గాల సంఖ్య పెరిగితే.. క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్.. ఓటు బ్యాంకు ఉండడంతో ఎక్కువ సీట్లు దక్కించుకోవచ్చని స్టాలిన్ భావిస్తున్నారు. డీఎంకే ఈ నిర్ణయాన్ని ఆవేశంతో తీసుకోలేదు. పార్టీ భవిష్యత్తును అంచనా వేసింది. ప్రత్యర్థుల బలహీనతలను పసిగట్టింది. మిత్రపక్ష సమీకరణలను బేరిజు వేసుకుంది. పక్కాగా రాజకీయంగా పాచిక వేసింది. ఒకవైపు కేంద్రాన్ని ఎదుర్కొంటూనే.. పార్టీకి నష్టం జరగకుండా చూసుకోవడం.. పెరిగే సీట్లలో పట్టును నిలుపుకోవడం లక్ష్యంగా స్టాలిన్ అడుగులు వేస్తున్నారు. అయితే స్టాలిన్ అంచనా వేసినట్టుగా డీలిమిటేషన్ ఉంటుందా.. దానివల్ల తమిళనాడు రాజకీయాలు మారిపోతాయా అనేది చూడాల్సి ఉంది.