Homeబిజినెస్Chat GPT 6 Astra: చాట్ జీపీటీ 6 కమింగ్.. ఉద్యోగాలన్నీ ఉఫ్.. చదివే స్టూడెంట్స్...

Chat GPT 6 Astra: చాట్ జీపీటీ 6 కమింగ్.. ఉద్యోగాలన్నీ ఉఫ్.. చదివే స్టూడెంట్స్ కు కష్టమే..

Chat GPT 6 Astra: ఓపెన్ ఏఐ ఇప్పటికే టెక్నాలజీలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చింది. కొత్త కొత్త సాంకేతికతలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తద్వారా టెక్నాలజీ రంగంలో అనేక రకాలుగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు ఓపెన్ ఏఐ తీసుకొచ్చిన చాట్ జిపిటి టెక్నాలజీ రంగంలో సంచలనాలకు నాంది పలికింది. ఇప్పుడు సరికొత్తగా ఓపెన్ ఏఐ సంస్థ టెక్నాలజీ రంగంలోనే అత్యంత అద్భుతమైన ఏఐ మోడల్ ను తీసుకొచ్చింది. దీనికి జిపిటి 6 అస్త్ర అని పేరు పెట్టింది. […]

Chat GPT 6 Astra: ఓపెన్ ఏఐ ఇప్పటికే టెక్నాలజీలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చింది. కొత్త కొత్త సాంకేతికతలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తద్వారా టెక్నాలజీ రంగంలో అనేక రకాలుగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

ఇప్పటివరకు ఓపెన్ ఏఐ తీసుకొచ్చిన చాట్ జిపిటి టెక్నాలజీ రంగంలో సంచలనాలకు నాంది పలికింది. ఇప్పుడు సరికొత్తగా ఓపెన్ ఏఐ సంస్థ టెక్నాలజీ రంగంలోనే అత్యంత అద్భుతమైన ఏఐ మోడల్ ను తీసుకొచ్చింది. దీనికి జిపిటి 6 అస్త్ర అని పేరు పెట్టింది. ఈ కంపెనీ విడుదల చేసిన వాటిల్లో ఇప్పటివరకు ఇదే అత్యంత శక్తివంతమైన ఏఐ అని తెలుస్తోంది.

దీని ద్వారా కంప్యూటర్ వాడకం.. కార్యాలయ విధులు.. సైన్స్ కోడింగ్.. సైబర్ సెక్యూరిటీ వంటి విధులను సులభంగా చేయవచ్చు. ఇక్కడితోనే కాదు.. చివరికి విద్యార్థులు కూడా దీనిని చదవడం అంత ఈజీ కాదు. ఇది అత్యంత ఆధునికమైన టెక్నాలజీ. దీని మీద పట్టు సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఈ కొత్త రకం సాంకేతికత వల్ల ఉన్న ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఇంటర్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే ఏఐ వల్ల ప్రభావితమయ్యాయి. ఈ టెక్నాలజీ వల్ల మిగతా స్థాయి ఉద్యోగాలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతాయి.

కొత్తతరం వ్యాపారాలు

ఈ టెక్నాలజీ వల్ల కొత్త తరం వ్యాపారాలు.. శాస్త్రీయ పరిశోధనలు.. సాంకేతికపరమైన ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది.. ఈ టెక్నాలజీ జిపిటి 5.6 సోల్.. ఆంత్రోపిక్ పేబుల్ వంటి మోడల్స్ ను కూడా వెనక్కి పంపింది. కేవలం ప్రశ్నలకు సమాధానం మాత్రమే కాదు.. ఎన్నో రకాల పనులను కూడా ఇది స్వయంగా చేయగలిగింది. ఆన్లైన్లో దరఖాస్తులను నింపడం.. క్యాలెండర్ ఆధారంగా పనులను నిర్ణయించడం.. సమాచారాన్ని వెతకడం.. ఇంకా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ను విశ్లేషించడం.. సొంతంగానే వెబ్సైట్లను తయారు చేయడం.. సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేసుకుని పరిశీలించడం వంటివి చేసింది.

సైబర్ సెక్యూరిటీ లోనూ అద్భుతంగా పనిచేసింది

బ్లండర్ సాఫ్ట్వేర్ ద్వారా 3డి మోడల్స్ సిద్ధం చేసింది. ప్రజెంటేషన్లను రూపొందించింది. అక్కడితోనే ఆగిపోలేదు లీగల్ డాక్యుమెంట్లు.. టాక్స్ రిటర్న్స్ వంటి వాటిని అత్యంత సమర్థవంతంగా పూర్తి చేసింది. సైబర్ సెక్యూరిటీ లోనూ అద్భుతంగా పనిచేసింది. ఎటువంటి సెక్యూరిటీ ఆంక్షలు లేకుండా నిర్వహించిన ఈ పరీక్షల్లో ఇది ఎక్స్ ప్లాయిట్ బెంచ్ మీద 100% స్కోర్ అందుకుంది. ఈ పరీక్షల్లో గత మోడల్ జిపిటి 5.6 సోల్ కేవలం 78.5 స్కోర్ మాత్రమే సాధించింది. అయితే ఈ స్థాయిలో ఉన్న ఈ మోడల్ ను కొంతమంది దుర్వినియోగం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అందువల్లే ఈ మోడల్ మీద ఓపెన్ ఏఐ అత్యంత కఠినమైన నియంత్రణలు.. భద్రతాపరమైన ప్రమాణాలను అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

డే బ్రేక్ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రాం యూజర్లకు మాత్రమే

దీనిని కేవలం డే బ్రేక్ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రాం యూజర్లకు మాత్రమే అందిస్తున్నారు. వచ్చేవారం నుంచి పెయిడ్ చాట్ జిపిటి ప్లాన్లను ఉపయోగించే వారికి దశలవారీ అందుబాటులోకి తీసుకొస్తారు. చాట్ జిపిటి.. ఓపెన్ ఏఐ ఏపీఐ.. ఏ డబ్ల్యు ఎస్.. అమెజాన్ బెడ్ రాక్ వంటి వేదికలు కూడా దీనిని ఉపయోగించవచ్చు. అయితే అనేక పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఈ మోడల్ మార్కెట్లోకి రావడానికి కొంచెం సమయం పట్టింది. దీని పట్ల ఓపెన్ ఏఐ సంస్థ క్షమాపణలు తెలియజేసింది. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఉన్న ఉద్యోగాలు మాత్రమే కాకుండా.. చివరికి విద్యార్థులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ టెక్నాలజీని ఉపయోగించి సులభంగా నేర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ.. కంప్యూటర్ కోర్స్ చదివే వాళ్లకు ఈ టెక్నాలజీ మీద పట్టు సాధించడం.. అంత ఈజీ కాదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper