Bigg Boss 10 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి ‘అగ్ని పరీక్ష 2’ నుండి మంచి హైప్ తో అడుగుపెట్టిన మొట్టమొదటి కంటెస్టెంట్ ఝాన్సీ. ‘అగ్ని పరీక్ష 2’ లో టాస్కులు అద్భుతంగా ఆడి , ‘టికెట్ టు బిగ్ బాస్’ గెలుచుకున్న ఏకైక కంటెస్టెంట్ గా ఝాన్సీ కి ఒక రికార్డు ఉంది. హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె తనదైన శైలిలో గేమ్స్ ఆడి సత్తా చాటింది. మధ్యలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల , సోషల్ మీడియా లో ఈమెకు కన్నింగ్ అనే పేరు పెట్టారు కానీ, ఆ తర్వాత ఈమె ఆటలో నిజాయితీ , దమ్ము చూసి ఈమెని ఇష్టపడడం మొదలు పెట్టారు ఆడియన్స్. కానీ గత రెండు వారాల నుండి జాన్సీ ని రెడ్ జోన్ లో పెట్టడం తో టాస్కులు ఆడే అవకాశం రాలేదు. ఆ కారణం చేత ఆమె గ్రాఫ్ బాగా డౌన్ అయ్యింది.
కచ్చితంగా టాప్ 5 లో నిలుస్తుందని అనుకున్నారు, హౌస్ మేట్స్ అంచనాలు కూడా అవే, కానీ నేడు ఆమె ఎలిమినేట్ అయ్యినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న ఝాన్సీ తన దగ్గరున్న ‘ఏవిక్షన్ పాస్’ ని ఉపయోగించి సుధీర్ ని ఎలిమినేషన్ నుండి సేవ్ చేసింది. అదే ‘ఏవిక్షన్ పాస్’ ఈరోజు ఝాన్సీ సేవ్ చేసుకొని ఉండుంటే , ఎలిమినేషన్ నుండి తప్పించుకొని ఉండేదని అంటున్నారు నెటిజెన్స్. అయితే ఈ ఒక్క షో ద్వారా సామాన్యురాలైన ఝాన్సీ కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. భవిష్యత్తులో ఆమెకు సినీ ఇండస్ట్రీ లో అవకాశాలు బాగా రావొచ్చు. ఇకపోతే ఈమెకు బిగ్ బాస్ హౌస్ లో 8 వారాలు ఉన్నందుకు గానూ 8 లక్షల 64 వేల రూపాయిలు ఇచ్చారట బిగ్ బాస్ టీం. అంటే వారానికి 80 వేలు అన్నమాట. అగ్ని పరీక్ష నుండి వచ్చిన ప్రతీ కంటెస్టెంట్ కి ఇదే రేంజ్ రెమ్యూనరేషన్ ని ఫిక్స్ చేశారట మేకర్స్. చూడాలి మరి భవిష్యత్తులో ఝాన్సీ ఏ రేంజ్ కి వెళ్తుంది అనేది.