DMK BJP alliance : నరేంద్ర మోడీ తీసుకునే రాజకీయ నిర్ణయాలు అప్పటికప్పుడు ఫలితాన్ని ఇవ్వవు. వాటి గురించి ప్రత్యర్థులు కూడా పెద్దగా అంచనా వేయరు. కానీ ఆ తర్వాత దాని ప్రభావం వేరే స్థాయిలో ఉంటుంది. ప్రత్యర్థులకు ఆ తర్వాత నష్టమేమిటో తెలుస్తుంది. డీఎంకే విషయంలో కూడా నరేంద్ర మోడీ తీసుకున్న ఒక నిర్ణయం.. ఇప్పుడు ఏకంగా తమిళనాడు రాజకీయాలను మాత్రమే కాదు.. ఏకంగా జాతీయ రాజకీయాలనే షేక్ చేస్తోంది.
డీ లిమిటేషన్ బిల్లుకు డిఎంకె సపోర్ట్ ఇవ్వడంతో.. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులకు ఏం చేయాలో తెలియడం లేదు. పార్లమెంట్.. అసెంబ్లీ సీట్లు ఏకంగా 50% పెంచి.. పార్లమెంట్ గరిష్ట సంఖ్యను 850 స్థానాలకు తీసుకెళ్లే ప్రతిపాదనకు కేంద్రం ఓకే చెప్పేసింది. దీంతో తమిళనాడు లో ఉన్న కీలక రాజకీయ పార్టీ డిఎంకె బీజేపీ తీసుకొచ్చిన ఈ చట్టానికి జై కొట్టింది. అంతేకాదు తమ రాష్ట్ర ప్రాతినిధ్యం తగ్గడం లేదని.. తమ డిమాండ్లకు హామీ లభించిందని స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే సపోర్టు ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల ఎన్ డి ఏ కు లాభం చేకూరుతుంటే.. కాంగ్రెస్ కూటమికి దిమ్మ తిరిగిపోతుంది.
అందువల్లే డిఎంకె నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా సోనియాగాంధీ.. రాహుల్ గాంధీ.. మల్లికార్జున ఖర్గే చెన్నై వెళ్లాలని.. స్టాలిన్ తో సమావేశం కావాలని నిర్వహించారు. అయితే డిఎంకే నేతలు వారిని కలవడానికి అంతగా ఆసక్తిని చూపించడం లేదని తెలుస్తోంది. తమిళ రాజకీయాలలో స్టాలిన్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. విజయ్ ఆధ్వర్యంలో టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ తన బుద్ధిని బయటపెట్టుకుంది. సంవత్సరాల తరబడి డిఎంకెకు నమ్మిన మిత్రుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. అధికారం మారగానే ఆయనకు వెన్నుపోటు పొడిచింది. విజయ్ దగ్గరికి చేరిపోయింది. అంతేకాదు రాజకీయ లబ్ధి కోసం స్టాలిన్ మీద బురద చల్లడం మొదలుపెట్టింది. అయితే రాజకీయంగా అవసరం పడగానే సోనియాగాంధీ.. రాహుల్ గాంధీ చెన్నై రావలసిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయాలలో నమ్మకద్రోహం అనేది సహించరానిది. అవకాశవాదం అనేది భరించరానిది. అటువంటి చేతలకు పాల్పడితే ఆ తరహా రాజకీయ పార్టీలకు కాలమే గుణపాఠం చెబుతుంది.
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లు తర్వాత రాజకీయ సమీకరణాలు వారే అవకాశం ఉంది. అంతేకాదు విజయ ప్రభుత్వంతో కాంగ్రెస్ సాగిస్తున్న రాజకీయ వ్యవహారాలకు చెక్ పడే అవకాశం ఉంది. విజయ్ ప్రభుత్వం ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ కీలకంగా వ్యవహరించినప్పుడు రాహుల్ గాంధీ మాస్టర్ మైండ్ లాగా ఆలోచించారని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బాలు కొట్టుకున్నారు. ఇప్పుడు జాతీయస్థాయి రాజకీయాలను డీఎంకే ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీకి వాస్తవం అర్థమవుతుంది. సంవత్సరాల తరబడి నమ్మకంగా ఉన్న మిత్రుడిని పోగొట్టుకొని.. చింతిస్తున్న తీరు ఒకవైపు.. కొత్త సమీకరణాలవల్ల ఆశించిన రాజకీయ ప్రయోజనం లభించకపోవడంతో ఎదురవుతున్న బాధ మరొకవైపు.. ఇన్నింటి మధ్య కాంగ్రెస్ పెద్దలు చెన్నై వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టాలిన్ వైఖరిని తప్పు పట్టారు. విపరీతంగా ఆరోపణలు చేశారు. రోజుల వ్యవధిలోనే స్టాలిన్ ప్రాపకం కోసం చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఆయనను ఒప్పించడానికి ఢిల్లీ నుంచి చెన్నై వస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యం లో పడేస్తోంది. అధికార కోసం.. అవకాశవాద కోసం విలువలకు పాతర వేయడంలో.. మిత్ర ధర్మాన్ని మంట కలపడంలో కాంగ్రెస్ పార్టీ కి కొత్త కాదు. అందువల్లే స్టాలిన్ కు పొడిచిన వెన్నుపోటు పాపం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.