Pawan Kalyan : జనసేన అధినేత.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఏమైంది.. ఆయన ముఖంలో నీరసం కల్పిస్తోంది. ఒకప్పటి మాదిరిగా ఉత్సాహం లేదు. ఆయన ప్రసంగంలో దూకుడు కనిపించడం లేదు. కీలకంగా వ్యవహరించాల్సిన అధికారిక.. రాజకీయ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఇది కాస్త ఏపీ రాజకీయాలలో చర్చకు దారితీస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్లాల్సి ఉండేది. ఎన్డీఏ నిర్వహించే కీలక సమావేశంలో పాల్గొనవలసి ఉండేది. అయితే చివరి క్షణంలో ఆయన పర్యటన రద్దయింది. కాకినాడలో న్యాయవ్యవస్థ కు సంబంధించిన అధికారిక కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమృతులు హాజరైనప్పటికీ.. స్వయంగా చంద్రబాబు ఆ కార్యక్రమానికి రావాలని కోరినప్పటికీ పవన్ వెళ్లలేదు. వరుసగా ఇలాంటి కీలక వ్యవహారాలకు ఆయన దూరం కావడం చర్చకు దారి తీస్తోంది. ఇదే సమయంలో పవన్ గతంలో మాదిరిగా చురుగ్గా ఉండటం లేదు. దూకుడు చూపించడం లేదు.
వీటి వెనక వ్యక్తిగత అంశాలు ఉన్నాయి. వరుస ఒత్తిడిలు ఉన్నాయి. మానసిక అలసట కూడా ఒక కారణం. ఒకవైపు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎత్తు పల్లాలు.. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు.. టికెట్ల కేటాయి.. పదవుల పెంపకం వంటి ఒత్తిళ్లు ఆయన మీద తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వ బాధ్యతలు.. పార్టీకి సంబంధించిన పనులు.. వ్యక్తిగత వ్యవహారాల వాటి వాటిని సమతూకం చేసే విషయంలో పవన్ శారీరకంగా.. మానసికంగా అలసటకు గురవుతున్నారని.. ఒత్తిడి ఎదుర్కొంటున్నారని పార్టీ వర్గాలలో చర్చ నడుస్తుంది.
ఒత్తిడిని అధిగమిస్తారా
గతంలో ఏదైనా విషయం మీద పవన్ తక్షణంగా స్పందించేవారు. ఛత్రస్థాయిలో వేగవంతంగా నడిచేవారు. కానీ అంత చురుకుగా ఆయన లేకపోవడం.. పార్టీ క్యాడర్ ను ఆలోచనలో పడేస్తోంది. రాజకీయంగా పవన్ అనే రకాలుగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సవాళ్లను ఎదురు చూశారు. ఈ నేపద్యంలో కీలక నాయకులు పవన్ బాధ్యతను భుజాలకు ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ వంటి నాయకుడు వీరామం తీసుకుంటే రకరకాల చర్చలకు కారణమవుతుంది. అందువల్లే ఆయన త్వరలో ఈ భారం నుంచి తేరుకోవాలని.. పూర్తిస్థాయి ప్రజా జీవితంలో కీలకంగా మారాలని జనసేన నాయకులు కోరుతున్నారు.
వ్యక్తిగత కారణాలు.. రాజకీయంగా ఒత్తిడిల మధ్య పవన్ ప్రస్తుతం సాగిస్తున్న ప్రయాణం కొంత నిదానంగా ఉంది. ఇదే సమయంలో ఆయన ఆలోచనలు కూడా వేరే విధంగా ఉన్నాయని తెలుస్తోంది. కీలకమైన సమావేశాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. తాత్కాలికంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని కొంతమంది జనసేన నాయకులు అంటున్నారు.. వచ్చే రోజుల్లో ఆయన తీసుకొనే నిర్ణయాలు.. పాల్గొనే కార్యక్రమాల ద్వారా మళ్లీ రాజకీయాలలో కీలక శక్తి లాగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది.