Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: 'రోహిత్' ని 'బిగ్ బాస్ 10' విన్నర్ చేయడమే 'త్రిగున్'...

Bigg Boss 10 Telugu: ‘రోహిత్’ ని ‘బిగ్ బాస్ 10’ విన్నర్ చేయడమే ‘త్రిగున్’ లక్ష్యమా?

Bigg Boss 10 Telugu: రీసెంట్ గానే మొదలైన ‘బిగ్ బాస్ 10’ షో ఎంత ఆసక్తికరంగా ముందుకు సాగుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత సీజన్ లో కంటెంట్ కింగ్ గా సంజన నిలిస్తే , ఈ సీజన్ కంటెంట్ కింగ్ గా త్రిగున్ నిలుస్తున్నాడు. కుర్రాడిలో చాలా టాలెంట్ ఉంది , కానీ తన టాలెంట్ మొత్తాన్ని రోహిత్ ని తొక్కేందుకే ప్రయత్నం చేస్తున్నాడు. నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునే వరకు రోహిత్ […]

Bigg Boss 10 Telugu: రీసెంట్ గానే మొదలైన ‘బిగ్ బాస్ 10’ షో ఎంత ఆసక్తికరంగా ముందుకు సాగుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత సీజన్ లో కంటెంట్ కింగ్ గా సంజన నిలిస్తే , ఈ సీజన్ కంటెంట్ కింగ్ గా త్రిగున్ నిలుస్తున్నాడు. కుర్రాడిలో చాలా టాలెంట్ ఉంది , కానీ తన టాలెంట్ మొత్తాన్ని రోహిత్ ని తొక్కేందుకే ప్రయత్నం చేస్తున్నాడు. నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునే వరకు రోహిత్ జపం చేయడమే ఈయనకు పనిలాగా మారిపోయింది. తన తోటి కంటెస్టెంట్స్ అందరినీ రోహిత్ కి వ్యతిరేఖం అయ్యేలా చేసి, రోహిత్ పై జనాల్లో సానుభూతి పెంచి , అతని చేతుల్లో కప్పు పెట్టడమే త్రిగున్ లక్ష్యమా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈరోజు కూడా రోహిత్ తో హౌస్ లో త్రిగున్ కి చాలా పెద్ద గొడవ జరిగింది.

అవసరం లేకపోయినా కూడా గెలికి మరీ రోహిత్ తో గొడవ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రోహిత్ ఏది మాట్లాడిన తప్పు అయిపోతుంది. అందుకు త్రిగున్ ఒక్కడే రియాక్ట్ అవ్వడం కాకుండా, తన టీం మేట్స్ మొత్తాన్ని రోహిత్ మీద పడి అరిచేలా చేస్తున్నాడు. త్రిగున్ చేస్తున్న టార్గెట్ ని చూస్తుంటే , ఇతను కచ్చితంగా రోహిత్ దగ్గర డబ్బులు తీసుకొని, అతన్ని విన్నర్ ని చేయడం కోసమే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినట్టుగా అనిపిస్తోంది అంటూ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి గడిచిన మూడు ఎపిసోడ్స్ చూస్తుంటే , త్రిగున్ బిగ్ బాస్ హిస్టరీ లోనే చాలా యూనిక్ కంటెస్టెంట్ అనేది అర్థం అవుతోంది. అద్భుతంగా టాస్కులు ఆడగలడు , ఎలాంటి పరిస్థితి లో అయినా సరైన పాయింట్స్ పెట్టి తనని తానూ డిఫెండ్ చేసుకోగలడు , ప్రత్యర్థులకు నోరు మెదపలేని రేంజ్ లో కౌంటర్లు ఇవ్వగలడు , అన్ని తలెంత్స్ ఉన్నాయి.

కానీ రోహిత్ అనే ఫోబియా సోకడం వల్ల, ఈయన గేమ్ పడిపోతుంది , తీవ్రమైన నెగెటివిటీ ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. వీకెండ్ లో హోస్ట్ నాగార్జున ఇతనికి సరైన మార్గదర్శనం చేసి, తప్పులను సరిచేసుకునేలా చేస్తే , ఇతను కచ్చితంగా రోహిత్ కి నువ్వా నేనా అనే రేంజ్ పోటీ ఇవ్వగలడు. అలా కాకుండా నిద్ర లేస్తే రోహిత్ జపమే చేస్తే మాత్రం , రోహిత్ తిరుగులేని ఆధిక్యం తో టైటిల్ విన్నర్ అవుతాడు. ఇప్పటికే రోహిత్ ఓటింగ్ శాతం 50 దాటిందని సమాచారం. ఈ రేంజ్ గ్రాఫ్ ఉన్నప్పుడు , ఇంకా రోహిత్ ని టార్గెట్ చేస్తే వార్ వన్ సైడ్ అయిపోతుందని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper