Bigg Boss Telugu 10 : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి భారీ ఆశలతో అడుగుపెట్టిన సామాన్యురాలు ఝాన్సీ. ‘అగ్ని పరీక్ష 2’ షోలో ‘టికెట్ టు బిగ్ బాస్’ గెలుచుకొని హౌస్ లోకి అడుగుపెట్టిన మొట్టమొదటి కామానర్ ఝాన్సీ మాత్రమే. హౌస్ లోకి వెళ్లిన తర్వాత తన మార్కు ఆటని చూపించి , టాప్ 5 లో ఉంటుందని అందరూ అనుకున్నారు. అందరి అంచనాలకు తగ్గట్టుగానే గేమ్స్ ఆడింది. మగవాళ్ళను సైతం చిత్తుచిత్తుగా ఆమె టాస్కుల్లో ఓడించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయడం దురదృష్టకరం. వాస్తవానికి ఈ వారం అందరికంటే సుధీర్ , రామకృష్ణ , వర్షిణి లకు తక్కువ ఓట్లు వచ్చాయి. వర్షిణి ని గ్రీన్ జోన్ లోకి పంపి ఎలిమినేషన్ నుండి తప్పించారు. ఇక సుధీర్ ని అయితే స్వయంగా ఝాన్సీ నే ఎలిమినేషన్ నుండి కాపాడింది. కానీ చివరికి ఝాన్సీ నే ఎలిమినేట్ అయ్యింది.
అయితే ఝాన్సీ ఎలిమినేషన్ పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదురు అవుతోంది. గత రెండు వారాల నుండి ఝాన్సీ ని కావాలనే ఉద్దేశపూర్వకంగా రెడ్ జోన్ లో పెట్టారని, ఆ కారణం చేత ఆమెకు టాస్కులు ఆడే అవకాశం రాలేదని అంటున్నారు. వర్షిణి తో పోలిస్తే ఝాన్సీ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ , కానీ వర్షిణి ఏమి ఆడకపోయినా కూడా ఆమెని గ్రీన్ జోన్ లోకి పంపేశారు, కానీ మగవాళ్ళను సైతం మట్టికరిపించి శక్తి ఉన్న ఝాన్సీ ని మాత్రం ఎలిమినేట్ చేసేసారు. రామకృష్ణ పైన చాలా అంచనాలు ఉండేవి , కానీ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఆ అంచనాలను అందుకోవడం లో విఫలం అయ్యాడు. కానీ అతను హౌస్ లోనే ఉన్నాడు , కానీ ఝాన్సీ మాత్రం ఎలిమినేట్ అయ్యింది , ఇదెక్కడి న్యాయం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.