Bigg Boss 10 Telugu: నిన్నటి ఎపిసోడ్ తో ‘బిగ్ బాస్ 10’ టైటిల్ విన్నర్ గా రోహిత్ , రన్నర్ గా ముకేశ్ పేర్లు ఖరారు అయిపోయాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ముకేశ్ ఈ షో ని వీక్షిస్తున్న లక్షలాది మంది అభిమానులను గెలుచుకున్నాడు. ఈ వారం బిగ్ బాస్ టీం హౌస్ లో త్రిగున్ ని ‘అల్టిమేట్ గోట్’ గా చేస్తే, ముకేశ్ ఆడియన్స్ చేత ‘రియల్ అల్టిమేట్ గోట్’ అని అనిపించుకున్నాడు. నిన్నటి తరహాలో ఆయన రాబోయే రోజుల్లో కూడా గేమ్ ఆడితే మాత్రం , కచ్చితంగా టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ రోహిత్ , ముకేశ్ , త్రిగున్ లకు గేమ్ చేంజింగ్ గా నిలిచిందని చెప్పొచ్చు. ముకేశ్ , రోహిత్ లకు పాజిటివ్ గా గేమ్ టర్న్ అయ్యేలా చేస్తే , త్రిగున్ కి ఘోరమైన నెగెటివ్ అయ్యేలా చేసింది నిన్నటి ఎపిసోడ్.
ముందుగా ముకేశ్ గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి టాస్క్ లో గోట్ క్యాటగిరీ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ కి సపోర్టర్స్ ని ఎంచుకునే అవకాశం దక్కింది. ఇక్కడ రామ్ ప్రసాద్ కన్నింగ్ స్ట్రాటజీ వేసి ఓటింగ్ ద్వారా సపోర్టర్స్ ని ఎంచుకుందామని అంటాడు. త్రిగున్ వైపు ఎక్కువ మంది సపోర్టర్స్ ఉన్నారు కాబట్టి , ఓటింగ్ లో గేమ్ కోసం వాళ్ళు కోరుకున్న సపోర్టర్స్ గేమ్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి , రామ్ ప్రసాద్ కావాలని ఈ ఛాయస్ ని ప్రపోజ్ చేస్తాడు. ఓటింగ్ ద్వారా వాళ్ళు అనుకున్నదే సాధిస్తారు. ముకేశ్ వైపు ఉన్న రోహిత్ , సుధీర్ లను ఈ గేమ్ లో భాగం అవ్వకుండా చూసుకున్నారు. దీంతో త్రిగున్ ఈ గేమ్ లో ముకేశ్ కి దరిదాపుల్లో రాకపోయినా , అతని సపోర్టర్స్ త్రిగున్ ని ‘అల్టిమేట్ గోట్’ గా నిలిపారు.
కానీ ఈ గెలుపుకి ఎలాంటి విలువ లేకుండా పోయింది. కష్టపడి ఆడిన ముకేశ్ కి విలువ దక్కింది, అతని ఓటింగ్ గ్రాఫ్ శిఖరానికి తాకేలా చేసింది. అంతే కాదు నిన్నటి ఎపిసోడ్ లో ముకేశ్ తాను స్నేహానికి ఎంత విలువ ఇస్తాడో కూడా నిరూపించుకున్నాడు. సుధీర్ ఎలిమినేట్ అయిపోయాడని బిగ్ బాస్ అధికారికంగా ప్రకటిస్తాడు. దీంతో ముకేశ్ ఒక రేంజ్ లో బాధపడతాడు. అక్కడితో ఆగకుండా , తన దగ్గర ఉన్నటువంటి మ్యాజికల్ కీ ని ఉపయోగించి , ఝాన్సీ పవర్ ని రీ యాక్టీవేట్ చేసి , సుధీర్ ని ఎలిమినేషన్ నుండి సేవ్ చేస్తాడు. స్నేహం నటించే త్రిగున్ లాంటి కంటెస్టెంట్స్ ఒక పక్క , నిజమైన స్నేహాన్ని చూపించే ముకేశ్ మరోపక్క అన్నట్టుగా నిన్నటి ఎపిసోడ్ ముకేశ్ ని ఎలివేట్ చేసింది.
ఇక రోహిత్ విషయానికి వస్తే , నిన్నటి ఎపిసోడ్ లో ఆయనకు గేమ్ ఆడే అవకాశం రాలేదు. కానీ తన వ్యక్తితత్వం తో ఆడియన్స్ మనసులో పది మెట్లు పైకి ఎక్కేసాడు. నిన్నటి ఎపిసోడ్ తో రోహిత్ కి టైటిల్ ఖరారు అయిపోయింది అనుకోవచ్చు. మొదటి నుండి స్నేహం చేస్తూ వచ్చిన అమన్ లాంటి మిత్రుడు నమ్మక ద్రోహం చేసి తన శత్రువు త్రిగున్ తో చేతులు కలపడమే కాకుండా , అనవసరంగా రోహిత్ తో నిన్న పెద్ద గొడవ పెట్టుకొని , తన గ్రాఫ్ ని తానే తగ్గించుకున్నాడు. ఇన్ని రోజులు రోహిత్ మీద అమన్ పెట్టుకున్న ద్వేషాన్ని మొత్తం బయటకు కక్కేసాడు. ఇక చివర్లో త్రిగున్ బ్యాచ్ మొత్తం ఒక ప్లాన్ ప్రకారం రోహిత్ కి ఓట్లు వేసి ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేసాడు.
తాను ఎలిమినేట్ అయిపోతాను అనే విషయం అర్థం అయ్యినప్పటికీ కూడా రోహిత్ లో ఇసుమంత భయం కూడా కనిపించలేదు. ‘దేవుడిని మొక్కుకో నేను ఎలిమినేట్ అవ్వాలని , లేదంటే నిన్ను తొక్కుకుంటూనే ముందుకు వెళ్తాను’ అంటూ రోహిత్ సవాల్ చేయడం హైలైట్ గా నిల్చింది. అయితే బిగ్ బాస్ నిన్న రోహిత్ కి కాస్త భయపడ్డాడు అనే చెప్పాలి. సెలబ్రిటీ ఓట్లతో అయితే రోహిత్ కచ్చితంగా ఎలిమినేట్ అవుతాడు , అతను వెళ్ళిపోతే షో రేటింగ్స్ పాతాళం లోకి పడిపోతుందని భయపడి , ఆడియన్స్ ఓటింగ్ ద్వారా సుధీర్ ఎలిమినేట్ అయ్యినట్టు చూపించారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. ఓవరాల్ గా నిన్నటి ఎపిసోడ్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.