Bigg Boss Telugu 10 : ‘అగ్ని పరీక్ష 2’ పై సోషల్ మీడియా లో బజ్ మామూలు రేంజ్ లో లేదనే చెప్పాలి. రీసెంట్ గానే స్టార్ మా , జియో హాట్ స్టార్ లలో టెలికాస్ట్ అవుతున్న ఈ షో ద్వారా సామాన్యులను ‘బిగ్ బాస్ 10’ లోకి పంపబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. గడిచిన మూడు రోజుల నుండి కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఆడిషన్స్ ఎపిసోడ్స్ ని మనమంతా చూస్తూనే ఉన్నాం. జడ్జీలు సరైన కంటెస్టెంట్స్ ని ఎంచుకొని బిగ్ బాస్ 10 లోకి పంపే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు కానీ , ఈ క్రమం లో వాళ్ళు కంటెస్టెంట్స్ తో వ్యవహరించే తీరు నచ్చడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే గత సీజన్ లో ఒకే ఒక్క గ్రీన్ ఫ్లాగ్ ని సొంతం చేసుకొని , ఏకంగా ‘బిగ్ బాస్ 9’ లోకి ఎంట్రీ ఇచ్చిన ‘దమ్ము శ్రీజ’ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.
గత సీజన్ లో ఆమె క్రియేట్ చేసిన సునామీ మామూలుది కాదు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన మార్కుని చూపించడమే కాకుండా, ఈమె ఎలిమినేషన్ ని చాలా అన్యాయం గా భావించిన నెటిజెన్స్ , మేకర్స్ పై ఒత్తిడి తీసుకొని వచ్చి , మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేలా చేశారు. ఆ తర్వాత రాజకీయాలు చేసి ఆమె ఎలిమినేట్ చేశారనుకోండి , అది వేరే విషయం. అయితే శ్రీజ లాగా అలాంటి ఇంప్యాక్ట్ సామాన్యుల్లో క్రియేట్ చేయడం చాలా కష్టమేమో అని అంతా అనుకున్నారు. కానీ సీజన్ లో అదే సీన్ రిపీట్ అయ్యింది. అది రిపీట్ చేసిన కంటెస్టెంట్ పేరు రోహిత్ నాయుడు. ఇతన్ని ఈరోజు స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ అయ్యే లేటెస్ట్ ఎపిసోడ్ లో మనమంతా చూడొచ్చు.
చాలా కూల్ గా , అమాయకంగా కనిపించే ఇతన్ని బిందు మాధవి దగ్గరకు పిలిచి స్వీట్ తినిపించి , ముఖం పై నీళ్లు విసురుతుంది. నీ తప్పులేకపోయిన , నీ నుండి ఎలాంటి రియాక్షన్ రావడం లేదు, ఇంతమంచి తనం ఉంటే బిగ్ బాస్ కి పనికిరావు అంటూ నవదీప్ , బిందు మాధవి లు రెడ్ ఫ్లాగ్ ఇస్తారు. శ్రీముఖి కూడా వీళ్ళతో ఏకీభవిస్తుంది. కానీ అభిజిత్ ఒక్కడే గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి , ఇతన్ని తదుపరి రౌండ్స్ కి పంపిస్తాడు. అయితే తదుపరి రౌండ్స్ లో రోహిత్ నాయుడు అద్భుతంగా టాస్కులు ఆది జడ్జీలకు మైండ్ బ్లాక్ అయ్యేలా చేసాడు. చివరికి ఓటు అప్పీల్ ని సంపాదించి , బిగ్ బాస్ 10 లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నువ్వు బిగ్ బాస్ కి పనికిరావు అని చెప్పిన జడ్జీలే , నేడు ఇతన్ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతున్నారు. ఇది కదా సక్సెస్ అంటే.