Lokesh Kanagaraj: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు లోకేష్ కనక రాజ్…చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ అందులో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండటం వల్ల అందరూ హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.
ఇక కమలహాసన్ లాంటి ఒక స్టార్ హీరోకి చాలా సంవత్సరాల తర్వాత విక్రమ్ అనే సినిమాతో ఒక సూపర్ డూపర్ సక్సెస్ ని అందించారు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఈయన రజనీకాంత్ తో కూలీ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దాదాపు చాలా రికార్డులను బ్రేక్ చేస్తుందని రజనీకాంత్ అభిమానులు మంచి నమ్మకంతో ఉన్నారు. మరి ఇలాంటి క్రమంలో లోకేష్ తో సినిమా చేయడానికి బాలీవుడ్ హీరోలు సైతం పోటీ పడుతున్నారు. ఇక అందులో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి నటలు కూడా ఉండడం విశేషం…
ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న దర్శకులను ఎవరిని కూడా బాలీవుడ్ హీరోలు పట్టించుకోవడం లేదు. వీలైతే సౌత్ సినిమా దర్శకుల మీదనే వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే సౌత్ లో ఉన్న టాలెంట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటుంది. కాబట్టి వాళ్లు కూడా సౌత్ డైరెక్టర్ల మీదనే ఎక్కువ ఫోకస్ చేసి సినిమాలు చేస్తే వాళ్లతోనే చేయాలి అనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నారు. ఇక ఒకప్పుడు మనల్ని పట్టించుకోని బాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు సౌత్ సినిమాల మీద వాళ్ళ దర్శకుల మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం అనేది నిజంగా ఒక వంతుకు మంచి విషయమనే చెప్పాలి.
ఇక ప్రస్తుతం లోకేష్ ఉన్న బిజీ షెడ్యూల్ కి బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం అయితే లేదు. ఇక తను ఈ సినిమా అయిపోయిన వెంటనే ఖైదీ 2 సినిమా చేయాల్సి ఉంది. ఆ తర్వాత విక్రమ్ 2 సినిమాను కూడా తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. మరి ఇలాంటి క్రమం లోనే దాదాపు ఒక మూడు సంవత్సరాల పాటు లోకేష్ కనకరాజ్ డైరీ ఫుల్ ఫీల్ అయింది. మరి ఆ మూడు సంవత్సరాల తర్వాత అయిన తను బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేస్తాడా లేదా అనే విషయాలను కూడా తెలియాల్సి ఉంది…