Homeఎంటర్టైన్మెంట్Tamannaah and Raashi Khanna: హాట్ బ్యూటీస్ తమన్నా, రాశి ఖన్నా నటించిన హారర్ థ్రిల్లర్...

Tamannaah and Raashi Khanna: హాట్ బ్యూటీస్ తమన్నా, రాశి ఖన్నా నటించిన హారర్ థ్రిల్లర్ ఓటీటీలో… ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

Tamannaah and Raashi Khanna: ఇండియన్ ఆడియన్స్ ఓటీటీకి బాగా కనెక్ట్ అయ్యారు. ప్రతి వారం అద్భుతమైన కంటెంట్ తో కూడిన చిత్రాలు, సిరీస్లు అందుబాటులోకి వస్తున్నాయి. వివిధ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ఇండియన్ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచుతున్నాయి. తాజాగా ఓ క్రేజీ హారర్ కామెడీ చిత్రం ఓటీటీలోకి వస్తున్నట్లు సమాచారం అందుతుంది. తమన్నా భాటియా-రాశి ఖన్నా-సుందర్ సీ ప్రధాన పాత్రలు చేసిన చిత్రం అరణ్మణై 4. ఈ చిత్రం మే 3వ తేదీన సమ్మర్ కానుకగా విడుదల చేశారు.

అరణ్మణై సిరీస్లో నాలుగో భాగంగా ఈ చిత్రం తెరకెక్కింది. తమన్నా, రాశి ఖన్నా గతంలో ఎన్నడూ చేయని భిన్నమైన పాత్రలు చేశారు. దర్శకుడు నటుడు సుందర్ సి మరో ప్రధాన పాత్ర చేశాడు. సుందర్ సీ ఈ చిత్ర దర్శకుడు. అరణ్మణై 4 థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో ఆడలేదు. రాశి ఖన్నా-తమన్నా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు, అయినా ఫలితం దక్కలేదు. అరణ్మణై 4 థియేట్రికల్ రన్ దాదాపు ముగిసినట్లే. దాంతో ఓటీటీ విడుదలకు సిద్ధం అవుతుంది.

అరణ్మణై 4 డిజిటల్ రైట్స్ ప్రముఖ సంస్థ జీ 5 దక్కించుకున్నట్లు సమాచారం. కాగా మే 30 లేదా జూన్ 10న అరణ్మణై 4 ఓటీటీలో అందుబాటులోకి రానుందట. మరి ఇద్దరు హాట్ హీరోయిన్స్ నటించిన అరణ్మణై 4 కోసం ఓటీటీ ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు అనడంలో సందేహం లేదు.

అరణ్మణై 4 కథ విషయానికి వచ్చే అడ్వకేట్ శరవణన్(సీ సుందర్), సెల్వీ(తమన్నా) అన్నా చెల్లెళ్ళు. ఇద్దరికీ ఒకరంటే మరొకరికి అమితమైన అభిమానం, ప్రేమ ఉంటాయి. కానీ కొన్ని కుటుంబ కలహాల కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. విడివిడిగా ఉంటారు. సెల్వీ చుట్టూ అనుకోని ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఒక రోజు సెల్వీ అనుమానాస్పదంగా మృతి చెందుతుంది. ఆమెను చంపింది ఎవరు? ఈ కారణంతో చంపారు? అనేది శరవణన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ జర్నీలో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తాయి…

RELATED ARTICLES

Most Popular