Bigg Boss 10 Telugu: ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా నిలిచేందుకు అత్యధిక అవకాశాలు ఉన్నటువంటి కంటెస్టెంట్ రోహిత్. అలాంటి టాప్ కంటెస్టెంట్ ని కనికరం లేకుండా బిగ్ బాస్ టీం హౌస్ మేట్స్ ఓట్లతో ఎలిమినేట్ చేసి , తీవ్రమైన వ్యతిరేకత ని మూటగట్టుకుంది. అత్యధిక శాతం మంది ప్రేక్షకులు రోహిత్ ఎలిమినేషన్ తర్వాత షో ని చూడడం మానేశారు. రేటింగ్స్ కూడా దారుణంగా పడిపోయాయి. రోహిత్ రీ ఎంట్రీ ఉంటుందని అభిమానులు ఆశపడ్డారు కానీ, బిగ్ బాస్ టీం మాత్రం ఆ ఆశలపై నీళ్లు జల్లారు. కేవలం వారం రోజులు డిక్టేటర్ గా హౌస్ లో గెస్ట్ గా ఉండేందుకు ఆహ్వానించారు అట, కానీ రోహిత్ అందుకు ఒప్పుకోలేదట. ఇకపోతే రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో రోహిత్ అభిమానులతో లైవ్ చాట్ ని నిర్వహించాడు. ఈ చాట్ లో ఆయన ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాడు.
ముఖ్యంగా ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా ఎవరు నిలుస్తారని మీరు అనుకుంటున్నారు అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు, రోహిత్ సమాధానం చెప్తూ టైటిల్ విన్నర్ బయటకు వచ్చి మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. టాప్ 5 గా ఎవరెవరు నిలుస్తారని మీరు అనుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు, నేను అసలు బిగ్ బాస్ ని చూడడం లేదు, హాట్ స్టార్ ని ఇన్ స్టాల్ కూడా చేసుకోలేదని సమాధానం ఇచ్చాడు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు, ప్రస్తుతానికి అయితే ఎవ్వరూ లేరని సమాధానం ఇచ్చాడు. నాన్ స్టాప్ గా ఇలాంటి ప్రశ్నలే వస్తుండడం తో రోహిత్ కాస్త ఆసక్తికరమైన ప్రశ్నలు అడగండి, ఎప్పుడూ ఇవేనా అంటూ చిరాకు పడుతాడు. మరోపక్క ఆయన త్రిగున్ పీఆర్ టీం కి చాలా బలమైన కౌంటర్లు ఇస్తాడు.
మీరు నాపై ఎంత నెగెటివ్ చేసినా నాకు వెంట్రుక కూడా ఫరక్ పడదని, పాపం మీ వాడు మీకు డబ్బులిచ్చి తనకు పీఆర్ గా పెట్టుకుంటే, మీరేమో తన కోసం పని చేయకుండా నా కోసం చేస్తున్నారు, మీ వల్ల షో చూడని వాళ్ళు కూడా ఎవరు ఈ రోహిత్ అని తెలుసుకొని, నా గురించి అన్ని విషయాలు పరిశీలించి , నన్ను నచ్చి ఫాలో అవుతున్నారని, నా కోసం ఇంత కష్టపడుతున్న ఆ పీఆర్ టీం కి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మీ భవిష్యత్తు ఏంటి?, మళ్లీ ఐటీ జాబ్ కోసం వెళ్తారా అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ, ప్రస్తుతానికి అయితే ఆ ఆలోచన లేదని, ఎంటర్టైన్మెంట్ రంగం లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నానని, అనేక ప్రాజెక్ట్స్ లో అవకాశాలు వస్తున్నాయని, సరైన ప్రాజెక్ట్ తో మీ ముందుకు వస్తానని, ప్రస్తుతానికి అయితే నేను ఎంటర్టైన్మెంట్ రంగంలోనే ఉండాలని అనుకుంటున్నానని, భవిష్యత్తు నన్ను ఎటు వైపుకు తీసుకెళ్తుందో చూడాలని చెప్పుకొచ్చాడు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.