Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan: పవన్ కళ్యాణ్ , అన్నా లెజినోవా మళ్లీ కలవబోతున్నారా? ట్విస్టుల మీద ట్విస్టులు..!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ , అన్నా లెజినోవా మళ్లీ కలవబోతున్నారా? ట్విస్టుల మీద ట్విస్టులు..!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తన మూడవ భార్య అన్నా లెజినోవా తో విడాకులు తీసుకున్న ఘటన ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ ఈ అంశం గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. సోషల్ మీడియా లో ఎన్నో వేల కధనాలు ప్రతీ రోజు ప్రచారం అవుతూనే ఉన్నాయి. మరో పక్క పవన్ కళ్యాణ్ ఈ అంశం నుండి బయటకు వచ్చి, ఉప ముఖ్యమంత్రిగా పాలనలో ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. నేడు జరగబోయే ఎన్నికల్లో […]

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తన మూడవ భార్య అన్నా లెజినోవా తో విడాకులు తీసుకున్న ఘటన ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ ఈ అంశం గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. సోషల్ మీడియా లో ఎన్నో వేల కధనాలు ప్రతీ రోజు ప్రచారం అవుతూనే ఉన్నాయి. మరో పక్క పవన్ కళ్యాణ్ ఈ అంశం నుండి బయటకు వచ్చి, ఉప ముఖ్యమంత్రిగా పాలనలో ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. నేడు జరగబోయే ఎన్నికల్లో ఆయన మంగళగిరి కి వచ్చి ఓటు కూడా వెయ్యబోతున్నాడు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న మాట ఏంటంటే, పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా మళ్లీ కలవబోతున్నారని.

విడాకులు తీసుకొని నెల రోజులు కూడా అవ్వలేదు, మళ్లీ ఎందుకు కలుస్తారు అని మీరు అనుకోవచ్చు. కానీ వీళ్లిద్దరు 2023 వ సంవత్సరం లోనే విడిపోయారు. కానీ స్నేహితులుగా, పిల్లలకు తల్లిదండ్రులుగా కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటారట. డిసెంబర్ 10న పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పెళ్లి జరగనుంది. ఈ పెళ్ళికి అన్నా లెజినోవా రాబోతున్నారని టాక్. అంతే కాకుండా, సంక్రాంతి పండుగ ముగిసేవరకు ఆమె హైదరాబాద్ లోనే ఉంటుందని, పవన్ కళ్యాణ్ ఇంట్లోనే ఉంటారనే టాక్ కూడా నడుస్తోంది. ఇదే కనుక జరిగితే, పెద్ద సెన్సేషన్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మన టాలీవుడ్ లో ఇప్పటి వరకు విడిపోయిన జంట ఇలా ఉండడం ఎప్పుడూ జరగలేదు. ప్రతీ జంట విడిపోయిన తర్వాత భార్య భర్తలుగా మేము విడిపోవచ్చు , కానీ స్నేహితులుగా మేము ఎప్పుడూ కలిసి ఉంటామని అంటుంటారు, కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. పవన్ కళ్యాణ్ , అన్నా లెజినోవా మాత్రం స్నేహితులుగా ఉంటూ, విడిపోయిన జంటలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ప్రస్తుతానికి అన్నా లెజినోవా తన పిల్లలతో కలిసి సింగపూర్ లో ఉంటుంది. అక్కడే ఆమె తన పిల్లలను చదివిస్తుంది అట. కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ కి అగ్ని ప్రమాదం జరిగిన సమయం లో , అతన్ని హైదరాబాద్ లోనే ఉంచి చదివించాలని అనుకున్నాడట పవన్ కళ్యాణ్. కానీ అందుకు అన్నా లెజినోవా ఒప్పుకోకపోవడం వల్లే గొడవలు మొదలు అయ్యాయని, అవి కాలం గడిచేకొద్దీ పెద్దవిగా మారి విడాకుల వరకు దారి తీసిందని అంటున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజముందో తెలియదు కానీ, ప్రస్తుతానికి మాత్రం అది నిజమేనని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper