Priyanka Jain : టీవీ సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకొని , ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సెలబ్రిటీ ప్రియాంక జైన్. ఈమె కర్ణాటక లో కొన్ని కన్నడ సినిమాల ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్టుగా వెండితెర కి పరిచయమైంది. ఆ తర్వాత స్టార్ మా ఛానల్ లో ‘మౌన రాగం’ అనే సీరియల్ ద్వారా మన తెలుగు ఆడియన్స్ కి పరిచయమైంది. ఈ సీరియల్ లో మంచి హిట్ అయ్యింది. ప్రియాంక జైన్ కి మంచి పేరు ని తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత ఈమె అమర్ దీప్ తో కలిసి స్టార్ మా ఛానల్ లో చేసిన ‘జానకి కలగనలేదు’ సీరియల్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సీరియల్ ద్వారా వచ్చిన క్రేజ్ తో ఆమె బిగ్ బాస్ 7 లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆరంభం నుండి అద్భుతంగా గేమ్స్ ఆడుతూ టాప్ 5 కంటెస్టెంట్ గా బయటకి వచ్చింది. బిగ్ బాస్ 7 తర్వాత ఈమె కెరీర్ మారిపోతుందని అంతా అనుకున్నారు కానీ , ఈ సీజన్ తర్వాత ఆమెకు ఒక్క సీరియల్ లో కూడా నటించే అవకాశం రాలేదు. పలు ఎంటర్టైన్మెంట్ షోస్ లో ఈమె రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటుంది , కొన్ని సినిమాలు , వెబ్ సిరీస్ లు కూడా చేసింది. కానీ అవేమి ఆమెని కెరీర్ లో వేరే లెవెల్ కి తీసుకెళ్లలేకపోయాయి అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. దీంతో ఆమె సోషల్ మీడియా ని ఆయుధంగా చేసుకొని పెద్ద రేంజ్ కి వెళ్లాలని అనుకుంది. ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్ లో ఈమె బాగా ఫేమస్ అయ్యింది. తన కాబోయే భర్త శివ్ తో కలిసి అనేక వీడియోస్ ని సరికొత్త కాన్సెప్ట్స్ తో క్రియేట్ చేసి తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది.
శివ్ ‘మౌన రాగం’ సీరియల్ లో హీరో అనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ అవుతున్న ‘నిన్ను కోరి’ సీరియల్ లో హీరో గా నటిస్తున్నారు. ఈయన కూడా మంచి పాపులారిటీ ఉన్న సెలబ్రిటీ నే. అయితే ఈ జంట కలిసి చేసే వైరల్ కంటెంట్ కి మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వస్తుంటాయి. అందుకే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం కోసం వీళ్ళు అనేక కొత్త రకమైన ఐడియాస్ తో మన ముందుకు వస్తుంటారు. రీసెంట్ గా కన్నడ హీరో యాష్ నటించిన ‘టాక్సిక్’ చిత్రం లోని ‘తబాహి’ పాట విడుదలై ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా హీరో యాష్ , హీరోయిన్ కియారా అద్వానీ మధ్య రొమాన్స్ ని చూసి కుర్రాళ్ళు మెంటలెక్కిపోయారు. ఆ పాటకి స్పూఫ్ ని చేస్తూ , వీళ్లిద్దరు అదే మ్యాజిక్ ని రీ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆ వీడియో ని మీరు కూడా చూసేయండి.