Johnny Master: టాలీవుడ్ లో ఇప్పటి వరకు ప్రధానంగా కేవలం ఇద్దరి కొరియోగ్రాఫర్స్ ఆధిపత్యం మాత్రమే కొనసాగుతూ వచ్చింది. ఒకరు జానీ మాస్టర్ కాగా , మరొకరు శేఖర్ మాస్టర్. మీడియం రేంజ్ హీరోలకు వీళ్ళే కావాలి , టాప్ స్టార్ హీరోలకు కూడా వీళ్ళే కావాలి. కొత్త వాళ్లకు చాలా అరుదుగా అవకాశాలు దక్కుతూ ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ నెమ్మదిగా మారిపోతూ వస్తోంది. మన చిన్న తనం నుండి టీవీ షోస్ లోని తన అద్భుతమైన డ్యాన్స్ తో ఆకట్టుకుంటూ వచ్చిన సందీప్ మాస్టర్ కి ఇప్పుడు టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు క్యూలు కడుతున్నాయి. ‘ఆట’ అనే డ్యాన్స్ రియాలిటీ షో ద్వారా సందీప్ మాస్టర్ మన అందరికీ పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘ఛాలెంజ్’, ‘ఆట 2’, ‘ నీతోనే డ్యాన్స్’ ఇలా ఎన్నో డ్యాన్స్ షోస్ ద్వారా మరింత దగ్గరయ్యాడు.
ఇక ‘బిగ్ బాస్ 7’ షో లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని సందీప్ మాస్టర్ ఎలాంటి క్రేజ్ ని సంపాదించుకున్నాడో మన అందరికీ తెలిసిందే. అద్భుతమైన టాలెంట్ ఉంది, కానీ ఎందుకు ఇతనికి సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం లేదు అనే బాధ అందరిలోనూ ఉండేది. అలాంటి సమయం లో ఆయనకు సినిమా అడపాదడపా అవకాశాలు వస్తుండేవి. అలా మెగాస్టార్ చిరంజీవి దృష్టిలో పడ్డాడు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం లో ‘హుక్ స్టెప్పు’ పాటకు కొరియోగ్రఫీ చేసే అవకాశం ఇచ్చాడు. ఈ పాట ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవి తో వేయించిన హుక్ స్టెప్ సోషల్ మీడియా లో సెన్సేషన్ అయ్యింది. ఇక అక్కడి నుండి సందీప్ మాస్టర్ టైం మొదలైంది. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా క్రేజీ మూవీస్ లో అవకాశాలు సంపాదిస్తూ ఎవ్వరూ ఊహించనంత రేంజ్ కి ఎదిగిపోయాడు.
ఇప్పుడు సందీప్ మాస్టర్ కొరియోగ్రఫీ లేని సినిమా అంటూ ఏది లేదంటే అతి సయోక్తి కాదేమో. ఆ రేంజ్ లో ఇండస్ట్రీ లో పట్టుకుపోయాడు. రీసెంట్ గా సందీప్ మాస్టర్ కి నేచురల్ స్టార్ నాని హీరో గా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం లో ఐటెం సాంగ్ కి కొరియోగ్రఫీ చేసే అవకాశం దక్కింది. ముందుగా ఈ ఐటెం సాంగ్ కోసం జానీ మాస్టర్ ని తీసుకున్నారట. కానీ ఆయన డేట్స్ ప్రస్తుతానికి అందుబాటులో లేకపోవడంతో నేచురల్ స్టార్ నాని స్వయంగా సందీప్ మాస్టర్ ని సంప్రదించి , ఆయనకు ఈ అవకాశం ఇచ్చాడట. ‘ది ప్యారడైజ్’ చిత్రానికి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే అనిరుద్ అందించిన ‘ఆయా షేర్’ పాట అణుబాంబు లాగా పేలింది. ఇక ఐటెం సాంగ్ ని ఏ రేంజ్ లో కంపోజ్ చేస్తే మీ ఊహలకే వదిలేస్తున్నాం. అలాంటి పాటకు సందీప్ మాస్టర్ కి కోరేగ్రఫీ చేసే అవకాశం వచ్చింది , ఇక ఆయన రేంజ్ పాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళిపోతుంది అనుకోవడం లో ఎలాంటి సందేహం లేదు.