Pallavi Prashanth: ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్స్ లో ఇప్పటి వరకు మోస్ట్ కాంట్రవర్సీల సీజన్స్ లిస్ట్ తీస్తే , అందులో సీజన్ 7 ముందు వరుసలో ఉంటుంది. ఈ సీజన్ ని ప్రేక్షకులు హృదయానికి తీసుకున్నారు. ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ , అమర్ దీప్ మధ్య జరిగిన గొడవలు అంతకు ముందు ఏ సీజన్ లో కూడా జరగలేదు అనే చెప్పొచ్చు. జనాలు అత్యధిక శాతం మంది పల్లవి ప్రశాంత్ కి సపోర్టుగా నిలిచారు. అందుకే అతను టైటిల్ విన్నర్ గా నిలబడగా , అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు. అయితే పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అనే సింపతీ కార్డు ని వాడుకొని గెలిచాడని అందరూ అప్పట్లో అనేవారు. హౌస్ లో ఉన్నప్పుడు రైతులకు ప్రైజ్ మనీ తో సాయం చేస్తానని చెప్పుకొచ్చాడు.
కానీ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ మాట మార్చేసాడని , ఇన్నేళ్లు అయినప్పటికీ కూడా ఆయనకు రైతులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, జనాలను గొర్రెలను చేసాడని , ఇలా రకరకాలుగా స్పందించారు నెటిజెన్స్. ఆయనకు ఓటు వేస్తూ సపోర్టు చేసిన వాళ్ళు కూడా పల్లవి ప్రశాంత్ పై మండిపడ్డారు. అయితే చాలా రోజులకు ఆయన రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో తనకు బిగ్ బాస్ టీం ఇచ్చిన ప్రైజ్ మనీ గురించి వాస్తవాలను వివరించాడు.
పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ ‘బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన వెంటనే నాకు డబ్బులు ఇవ్వలేదు. చాలా సమయం పట్టింది. కానీ ఇంతలోపే రైతులకు ఇస్తానన్న డబ్బులు ఎప్పుడు ఇస్తావు , మాటలు మార్చేసావు అంటూ నాపై కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. ఇవి చూసి ఒక అన్న , నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి , నీకు ఇస్తాను , రైతులకు ఇచ్చేయ్ అని చెప్పాడు. అలా వద్దు అన్నా , నేను కష్టపడి సంపాదించిన డబ్బులతో రైతులకు సహాయం చేస్తే నాకు తృప్తి గా ఉంటుంది అని చెప్పాను. కొన్ని రోజుల తర్వాత డబ్బులు వచ్చాయి. నాకు వచ్చిన 35 లక్షల రూపాయలలో , 40 శాతం జీఎస్టీ లో పోయింది. మిగిలిన 21 లక్షల్లో , కారుకి 9 లక్షలు , నెక్లెస్ కి 5 లక్షలు పోయాయి. ఆ రెండు గిఫ్ట్ కదా అని అడిగితే , లేదు ప్రైజ్ మనీ లోనే కట్ అవ్వుద్ది అని చెప్పి తీసుకున్నారు. మాకు అవసరం లేదు , డబ్బులే కావాలి , కారు తిరిగి ఇచ్చేస్తామని చెప్తే , అలా కుదరదు అని అన్నారు. నా చేతికి వచ్చింది 7 లక్షల రూపాయిలు మాత్రమే. అందులో నేను ఎంతమందికి సహాయం చెయ్యాలి?’ అంటూ చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్.