Homeఎంటర్టైన్మెంట్Amar Deep: బంగారం లాంటి భార్యని పెట్టుకొని ఇవేమి పనులు అమర్ దీప్.. సంచలనం రేపుతున్న...

Amar Deep: బంగారం లాంటి భార్యని పెట్టుకొని ఇవేమి పనులు అమర్ దీప్.. సంచలనం రేపుతున్న వీడియో!

Amar Deep: సీరియల్ ఆర్టిస్టులలో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న వారిలో ఒకరు అమర్ దీప్ చౌదరి. ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్ ద్వారా ఈయన ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయ్యారు. ఇక ‘బిగ్ బాస్ 7’ తర్వాత ఈయనకు ఎలాంటి ఫాలోయింగ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యూత్ ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరయ్యాడు. సినిమాల్లో హీరో గా మంచి రేంజ్ కి వెళ్లగలిగే సత్తా ఇతనికి ఉంది, […]

Amar Deep: సీరియల్ ఆర్టిస్టులలో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న వారిలో ఒకరు అమర్ దీప్ చౌదరి. ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్ ద్వారా ఈయన ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయ్యారు. ఇక ‘బిగ్ బాస్ 7’ తర్వాత ఈయనకు ఎలాంటి ఫాలోయింగ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. యూత్ ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరయ్యాడు. సినిమాల్లో హీరో గా మంచి రేంజ్ కి వెళ్లగలిగే సత్తా ఇతనికి ఉంది, కానీ సరైన సినిమాలు పడడం లేదు. ఇప్పటి వరకు ఈయన మూడు సినిమాల్లో హీరో గా చేస్తే , ఒక్క సినిమా కూడా కమర్షియల్ గా హిట్ అవ్వలేదు , కనీసం ఎప్పుడు ఆ సినిమాలు వచ్చి వెళ్ళాయో కూడా ఆడియన్స్ కి తెలియదు. అయినప్పటికీ ఇతనికి సినిమాల్లో అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

ఒకపక్క సినిమాలు చేస్తూనే , మరోపక్క ఎంటర్టైన్మెంట్ షోస్ లో కనిపిస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. ఈ వారం ఆయన ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షోలో కనిపించబోతున్నాడు. ఈ సందర్భంగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఒక ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ ని చూసేవాళ్లకు , అమర్ దీప్ , దేబ్ జాన్ మధ్య ఉన్న కెమిస్ట్రీ తెలిసే ఉంటుంది. అమర్ దీప్ ఈమెతో కలిపే పులిహోర , దాని ద్వారా వచ్చే ఫన్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఈ ఎపిసోడ్ ప్రోమో లో కూడా ఆయన దేబ్ జానీ తో కలిపిన పులిహోర హైలైట్ గా నిల్చింది. 200 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న సందర్భంగా , శ్రీముఖి ఈ షో మరో 500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోవాలని , అందులో మీ పాత్ర ఎలా ఉండాలని కోరుకుంటున్నారో చెప్పి అక్కడున్న కర్రలను విరచండి అని అంటుంది.

అప్పుడు అమర్ దీప్ తన మనసులో ఉన్న కోరికని కోరుకుంటూ , ‘ప్రతీ ఆదివారం నేను ఈ షో కి రావాలి , నాకు బాగా ఇష్టమైన వాళ్ళు (దేబ్ జాన్ వైపు చూస్తూ ) కూడా ఈ షో కి వస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ఆ కర్ర ని విరిచే ప్రయత్నం చేస్తాడు కానీ విరగదు. కానీ ఆ తర్వాత దేబ్ జాన్ స్టేజి మీదకు వచ్చి , మా నాన్నకు ఒక బిజినెస్ ఉంది , అది అద్భుతంగా జరగాలి అంటూ కోరుకొని , కర్రని ఒక్క దెబ్బతో విరిచేస్తుంది. ఇది చూసిన ఇమ్మానుయేల్ అమ్మాయి విరిచేసింది కదయ్యా , నీ వల్ల కాలేదు అంటూ కామెంట్ చేస్తాడు. ఇకపోతే చాలా కాలం తర్వాత అమర్ దీప్ , దేబ్ జాన్ కలిసి ఒక ఎపిసోడ్ లో కనిపించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే బంగారం లాంటి భార్య తేజస్విని ని పెట్టుకొని , వేరే అమ్మాయితో ఈ పులిహోర కలుపుడు ఏంటి అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ప్రోమో ని మీకోసం క్రింద అందిస్తున్నాము , చూసి ఎంజాయ్ చేయండి.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper