Priyanka Jain and Shiva : బుల్లితెర లో సీరియల్స్, ఎంటర్టైన్మెంట్ షోస్ చూసే ప్రతీ ఒక్కరికి పరిచయం అక్కర్లేని పేర్లు ప్రియాంక జైన్(Priyanka Jain), శివ్. వీళ్లిద్దరు కలిసి స్టార్ మా ఛానల్ లో ఒక సీరియల్ చేశారు. ఆ సీరియల్ షూటింగ్ సమయంలోనే ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వీళ్లిద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు, ఎప్పుడు చేసుకుంటారు అనే విషయం పై కూడా ఎలాంటి క్లారిటీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. అయితే వీళ్లిద్దరు కలిసి ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోస్ లో పాల్గొన్నారు. ప్రియాంక జైన్ ‘బిగ్ బాస్ 7’ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని టాప్ 5 లో నిల్చింది. ఈ షో తర్వాత ఆమె దశ మారిపోతుందని అందరూ అనుకున్నారు కానీ, కేవలం తన యూట్యూబ్ ఛానల్ కి మాత్రమే పరిమితం అయ్యింది.
యూట్యూబ్ లో జంట కలిసి ఎన్నో ప్రాంక్ వీడియోలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం వాళ్ళ సంపాదన అత్యధికంగా యూట్యూబ్ ఛానల్ నుండే వస్తుంది. మధ్యలో ఎంటర్టైన్మెంట్ షోస్ ద్వారా కూడా డబ్బులు వస్తుంటాయి. వీళ్ళ యూట్యూబ్ ఛానల్ లో ఒకసారి తిరుమల కొండపై చేసిన ప్రాంక్ ఎంతటి దుమారాన్ని రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీళ్లపై కేసు కూడా నమోదు అయ్యింది. ఆ తర్వాత వీళ్లిద్దరు కలిసి క్షమాపణ చెప్తూ ఒక వీడియో చేశారు. కానీ ఇప్పటికీ వాళ్ళు ప్రాంక్ వీడియోలు చేస్తూనే ఉన్నారు. వీళ్ళ ప్రాంక్ వీడియోల పిచ్చి ఎక్కడి దాకా వచ్చిందంటే, ‘కిరాక్ బాయ్స్..కిలాడీ లేడీస్’ షో వరకు వచ్చింది. స్టార్ మా ఛానల్ లో ప్రతీ శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ఈ ఎంటర్టైన్మెంట్ షోలో ముందుగా శివ్ అడుగుపెట్టాడు. ఆయన అడుగుపెట్టిన వెంటనే ‘తొక్కలో పరి..ఈ షో అయ్యేంత వరకు ఆమె ఎవరో నాకు తెలియదు..అప్పటి వరకు బ్రేకప్ చెప్తున్నా’ అంటూ ఒక ప్రాంక్ చేస్తాడు.
దాని తర్వాత ప్రియాంక బాధపడినట్టు యాక్షన్ చేయడం, షో తర్వాత ఏమి జరిగిందో చూపించే ప్రయత్నం లో ఇంటికి వెళ్లిన తర్వాత ప్రియాంక తనతో ఎలా ప్రవర్తిస్తుందో చూపించడం వంటివి చేసాడు శివ్. ఆ వీడియో ప్రారంభం లో చివరి వరకు ప్రియాంక శివ్ మీద కోపంగా ఉన్నట్టు నటించి చివర్లో రివర్స్ ప్రాంక్ అని నవ్వుతుంది. వచ్చే వారం నుండి ప్రియాంక కూడా ఈ షో లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టబోతుంది. దానికి సంబంధించిన ప్రోమో ని కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ ప్రోమో లో ప్రియాంక మాట్లాడుతూ ‘నన్ను తొక్కలో పరి అన్నావ్ కదా..ఇప్పుడు నేను కూడా అంటున్న తొక్కలో శివ్..రాకు నా దగ్గరకు’ అని అంటుంది. అప్పుడు శివ్ కూడా ‘పోవే అవతలకు’ అని అంటాడు. యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న ఈ ప్రోమో ని మీరు కూడా చూసేయండి.