Bigg Boss 10 Telugu: ‘అగ్ని పరీక్ష ‘ లో చాలా మంచిగా అనిపించిన వాళ్ళు , బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులను ఎదురుకున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు ‘అగ్ని పరీక్ష 2’ లో ‘టికెట్ టు బిగ్ బాస్’ గెలుచుకున్న ఝాన్సీ పరిస్థితి చూస్తుంటే తీవ్రమైన కష్టాలు భవిష్యత్తులో ఎదురుకోక తప్పదని అనిపిస్తోంది. అంతే కాదు నాలుగు వారాల్లోనే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆమె అంతటి చెత్త గేమ్ ఆడుతుంది కాబట్టి. హౌస్ లోకి ఈమె ‘అగ్ని పరీక్ష 2’ కంటెస్టెంట్స్ కి దూరం గా ఉండాలి అని అనుకొని వచ్చినట్టు ఉంది. అందుకే హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుండి ఈమె సెలబ్రిటీలతోనే ఉంది. అయితే ఎవరిష్టం వారిది, కానీ టీం అన్నాక అందరూ కలిసి పని చెయ్యాలి.
టీం కి సంబంధించిన విషయాలు టీం సభ్యుల మధ్యలోనే ఉండాలి. కానీ ఝాన్సీ అది చేయడం లేదు. రోహిత్ టీం లో ఉన్నప్పటికీ కూడా, త్రిగున్ టీం కి సపోర్ట్ గా నిలుస్తూ, తన టీం ప్లాన్స్ మొత్తాన్ని త్రిగున్ చెప్తోంది. అంతే కాకుండా , రోహిత్ పై లేని పోనీ చాడీలు చెప్తూ , అతన్ని బిగ్ బాస్ నుండి బయటకు పంపే ప్లాన్స్ వేస్తోంది. నిన్న గాక మొన్న వచ్చిన సెలబ్రిటీలు ఎక్కువ అయిపోయారు. చాలా రోజుల నుండి పరిచయమున్న అగ్ని పరీక్ష 2 వాళ్ళు పరాయి వాళ్ళు అయ్యారు. సొంత టీం లో ఉంటూ కట్టప్ప కంటే పెద్ద వెన్నుపోటు పొడిచిందని, ఇలాంటి లేడీ కంటెస్టెంట్ ని బిగ్ బాస్ హిస్టరీ లోనే చూడలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఈమెకు బదులుగా రాజకుమారి ని కానీ , అపూర్వ ని కానీ తీసుకొని ఉండుంటే కథ వేరేలా ఉండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.
ఝాన్సీ తన ఆట తీరుని మార్చుకోకుంటే బిగ్ బాస్ హౌస్ లో నెగ్గుకురావడం కష్టం. ‘అగ్ని పరీక్ష 2’ లో హేమంత్ , భాగీ, రామకృష్ణ వంటి వారు ఝాన్సీ గురించి ఒక కచ్చితమైన నిజాన్ని చెప్పారు. ఝాన్సీ గెలిచేవాళ్ల పక్కన మాత్రమే ఉంటుంది . గెలవకపోతే మన ముఖం వైపు కూడా చూడడు , ఇది నేను చాలా సార్లు గమనించాను అంటూ చెప్పుకొచ్చారు. అప్పట్లో ఇది కేవలం ఆరోపణలు చేస్తున్నారు అని మాత్రమే అనుకున్నారు అందరూ. కానీ వాళ్ళు చెప్పింది నూటికి నూరు శాతం నిజమే అని ఝాన్సీ హౌస్ లోకి అడుగుపెట్టిన మూడు రోజులకే నిరూపించి చూపించింది .