Youtuber Anvesh: ఈమధ్య కాలం లో ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ పేరు దేశవ్యాప్తంగా ఒక రేంజ్ లో ట్రెండ్ అవ్వడాన్ని మనమంతా చూశాము. ఒకప్పుడు ఈయనకు చాలా మంచి క్రేజ్ ఉండేది. ఎందుకంటే యూట్యూబ్ లో ‘నా అన్వేషణ’, ‘ప్రపంచ యాత్రికుడు’ వంటి చానెల్స్ ద్వారా ప్రపంచం నలుమూలల పర్యటించి , అక్కడి ప్రజల అలవాట్లు, నాగరికత ని పరిచయం చేయడమే కాకుండా, ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రామాలు చేసినందుకు ఈయన్ని నెటిజెన్స్ అభిమానించేవారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీలపై ఈయన చేసిన పోరాటం బాగా క్లిక్ అయ్యింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఆయన హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టాడో , అప్పటి నుండి ఇతనిపై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. అయినప్పటికీ తన పంధా ని మార్చుకోలేదు అన్వేష్.
తనకు ఏది అనిపిస్తే అది చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అయితే నిన్న ఆయన తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున పై మండిపడ్డ తీరు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే , అగ్ని పరీక్ష 2 కి సంబంధించిన కొంతమంది కంటెస్టెంట్స్, స్కూల్స్ , కాలేజీలకు వెళ్లి తమకు ఓటు వెయ్యండి అంటూ ప్రచారం చేసుకున్న వీడియోలు సోషల్ మీడియా లో ఎంత వైరల్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దీనిపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. చదువుకునే పిల్లల మైండ్ సెట్ ని చెడగొట్టే ఇలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి , అయినా స్కూల్స్ , కాలేజీల యాజమాన్యాలు ఇలాంటి వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఈ అంశం పై అన్వేష్ కూడా స్పందిస్తూ, ‘బిగ్ బాస్ 10’ హోస్ట్ అక్కినేని నాగార్జున పై మండిపడ్డారు.
ఆయన మాట్లాడుతూ ‘స్కూల్స్ , కాలేజీలకు వెళ్లి అగ్ని పరీక్ష 2 కంటెస్టెంట్స్ ఎలా క్యాంపైన్ చేసుకుంటారు?.. వాళ్ళని అని తప్పు లేదు , తెలిసో తెలియకో చేశారు, నాగార్జున కి సిగ్గు ఉండాలి. ఆయనకు 70 ఏళ్ళు వచ్చి ఉంటాయి, ఇద్దరు కొడుకులు ఉన్నారు , త్వరలోనే తాత కూడా కాబోతున్నారు. అలాంటి స్థాయిలో ఉన్న మీరు, అగ్ని పరీక్ష 2 కంటెస్టెంట్స్ అలా చేస్తుంటే తప్పు అని ఖండించాలి , కానీ మీరు సైలెంట్ గా ఉన్నారు. మీకు 70 ఏళ్ళు వచ్చేసాయి , మాహా అయితే ఇంకో 15 ఏళ్ళు బ్రతుకుతారు. ఈ 15 ఏళ్ళు కాస్త నలుగురికి ఉపయోగపడే పనులు చేయండి. ఇలాంటి పనులు చేస్తే నరకానికి వెళ్తారు’ అంటూ చెప్ప్పుకొచ్చాడు అన్వేష్.