Homeబిజినెస్TATA punch: ఆగస్టులో క్యూ కట్టారు.. ఈ కారు రేంజ్ అలా ఉంది మరి..

TATA punch: ఆగస్టులో క్యూ కట్టారు.. ఈ కారు రేంజ్ అలా ఉంది మరి..

TATA punch: ఒకప్పుడు కార్లను విలాసవంతమైన వాహనంగా భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. విలాసం అర్థం కాస్త ప్రయాణ సాధనంగా రూపాంతరం చెందింది. దీంతో కార్ల అమ్మకాలు పెరిగిపోతున్నాయి. మనదేశంలో గత ఏడాది కార్ల అమ్మకాలు నేలచూపులు చూసాయి. కానీ ఈ ఏడాది మాత్రం కార్ల అమ్మకాలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నెలలో కార్ల విక్రయాలు జోరుగా సాగాయి. టాప్ 10 నమూనాలలో కలిపి మొత్తంగా 1,83,037 కార్ల విక్రయాలు జరిగాయి అంటే పరిస్థితి ఎలా […]

TATA punch: ఒకప్పుడు కార్లను విలాసవంతమైన వాహనంగా భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. విలాసం అర్థం కాస్త ప్రయాణ సాధనంగా రూపాంతరం చెందింది. దీంతో కార్ల అమ్మకాలు పెరిగిపోతున్నాయి.

మనదేశంలో గత ఏడాది కార్ల అమ్మకాలు నేలచూపులు చూసాయి. కానీ ఈ ఏడాది మాత్రం కార్ల అమ్మకాలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు నెలలో కార్ల విక్రయాలు జోరుగా సాగాయి. టాప్ 10 నమూనాలలో కలిపి మొత్తంగా 1,83,037 కార్ల విక్రయాలు జరిగాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వినియోగదారులను ఆకట్టుకోవడానికి కంపెనీలు భారీగా డిస్కౌంట్ ప్రకటించాయి. క్యాష్ బ్యాక్ ఆఫర్.. ఇతర ఎక్సేంజ్ ఆఫర్లను కూడా ప్రకటించాయి. దీంతో తక్కువ ధరలకే కార్లు అందుబాటులోకి వచ్చాయి. జనాల అవసరాలు కూడా పెరిగిపోవడంతో ఇంటికి ఒక కారు కచ్చితంగా ఉండాలి అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.

కార్లలో అన్ని మోడల్స్ అమ్మకాలు ఒకే విధంగా ఉండవు. చాలావరకు ప్రజలు ఫీచర్లను.. మైలేజ్ ను చూస్తూ ఉంటారు. వాస్తవానికి ఆటోమొబైల్ చరిత్రలో సెడాన్ మోడల్ మారుతి సుజుకి డిజైర్ ప్రతినెల ఎక్కువగా అమ్ముడుపోయే మోడల్ గా నిలిచింది. అయితే ఆగస్టులో మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇక ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో టాటా మోటార్స్ ఉత్పత్తి చేసే టాటా పంచ్ మరొకసారి అదరగొట్టింది. ఆగస్టు నెలలో ఎక్కువగా అమ్ముడుపోయిన నమూనాగా నిలిచింది. ఆగస్టులలో ఈ కంపెనీకి సంబంధించిన ఈ మోడల్ లో 21,320 యూనిట్లు అమ్ముడుపోయాయి గత ఎడాది టాటా పంచ్ విక్రయాలు 10,704 యూనిట్లు మాత్రమే. ఈ ఏడాది డబుల్ స్థాయిలో అమ్మకాలు పెరిగాయి. ఫలితంగా ఎప్పటికీ టాప్లో ఉండే మారుతి సుజుకి వ్యాగన్ఆర్.. డిజైర్.. స్విఫ్ట్ వంటి మోడల్స్ కిందికి పడిపోయాయి.

గత నెలలో టాప్ 10 మోడల్స్ కలిపి 1,83,037 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. గత ఏడాది ఆగస్టులో చూస్తే ఈ సంఖ్య 1,37,334 యూనిట్లుగానే ఉంది. ఈ ప్రకారం చూసుకుంటే మొత్తం అమ్మకాలలో 33 శాతం వృద్ధి కనిపించింది. టాప్ టెన్ కార్ల వికారాలలో మారుతి సుజుకి సంబంధించి ఆరు మోడల్స్ ఉన్నాయి. టాటా మోటార్స్ నుంచి రెండు మోడల్స్ ఉన్నాయి. హ్యుందాయ్.. మహీంద్రా నుంచి ఒక్కొక్క మోడల్ ఈ లిస్టులో ఉన్నాయి.

టాప్ టెన్ కారు మోడల్స్ లో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ 20,180 యూనిట్లతో కొనసాగుతోంది. మారుతి సుజుకి స్విఫ్ట్ 19,832, మారుతి సుజుకి ఫ్రాంక్స్ 18,730, మారుతి సుజుకి ఎర్టిగా 18,516, టాటా నెక్సన్ 18,431 యూనిట్ల విక్రయాలు జరిపాయి. పెద్ద కొంతకాలంగా మారుతి సుజుకి డిజైర్ టాప్ లో ఉంది. ఈ ఆగస్టు నెలలో 18,418 యూనిట్ల విక్రయాలతో ఏడవ స్థానానికి పడిపోయింది. కంపెనీ కంపెనీ ఉత్పత్తి చేసే క్రెటా 16,288 యూనిట్ల విక్రయాలతో ఎనిమిదవ స్థానంలో ఉంది. మారుతి సుజుకి బాలేనో 15,746, మహీంద్రా స్కార్పియో 15,576 యూనిట్లు విక్రయమయ్యాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper