Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan: పుట్టినరోజు నాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పెద్ద నిరాశ..ఇక ఆశలు వదిలేసుకోవడమే!

Pawan Kalyan: పుట్టినరోజు నాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పెద్ద నిరాశ..ఇక ఆశలు వదిలేసుకోవడమే!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ని ప్రతీ ఏడాది అభిమానులు ఎంత గ్రాండ్ గా నిర్వహిస్తూ ఉంటారో మన అందరికీ తెలిసిందే. ఆయన పాత సినిమాలను రీ రిలీజ్ చేసి, థియేటర్స్ వద్ద సంబరాలు చేయడమే కాకుండా, అనేక సేవా కార్యక్రమాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తూ ఉంటారు. ఇక కాలేజీలు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విద్యార్థులు బైక్ ర్యాలీలు, కేక్ కట్టింగ్స్ వంటివి చేస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే తరహా లో […]

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ని ప్రతీ ఏడాది అభిమానులు ఎంత గ్రాండ్ గా నిర్వహిస్తూ ఉంటారో మన అందరికీ తెలిసిందే. ఆయన పాత సినిమాలను రీ రిలీజ్ చేసి, థియేటర్స్ వద్ద సంబరాలు చేయడమే కాకుండా, అనేక సేవా కార్యక్రమాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తూ ఉంటారు. ఇక కాలేజీలు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విద్యార్థులు బైక్ ర్యాలీలు, కేక్ కట్టింగ్స్ వంటివి చేస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే తరహా లో ప్లాన్ చేశారు. ఆయన కెరీర్ లో క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న ‘పంజా’ చిత్రాన్ని సెప్టెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించగా, వరల్డ్ వైడ్ గా అప్పుడే 1 కోటి 50 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి.

కచ్చితంగా ఈ చిత్రానికి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 5 కోట్ల గ్రాస్ వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అది కాసేపు పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ‘ఓజీ 2’ అప్డేట్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ చిత్ర సంగీత దర్శకుడు తమన్ కూడా, రీసెంట్ గా జరిగిన కొన్ని ఈవెంట్స్ లో సెప్టెంబర్ 2 న కచ్చితంగా అప్డేట్ ఉంటుందని చెప్పుకొస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే, ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రావడం లేదట. ఒక ప్రత్యేకమైన యానిమేషన్ వీడియో ని రెడీ చేశారట కానీ, షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు కనిపించకపోవడం తో, అప్పుడే ఎందుకు ఆ వీడియో ని విడుదల చేయడం అనే మూడ్ లో ఉన్నాడట డైరెక్టర్ సుజిత్. ఒకవేళ అప్డేట్ ఉంటే రేపు సాయంత్రం లోపు దానికి సంబంధించిన వివరాలు వస్తాయని, లేదంటే ఈసారికి ఎలాంటి అప్డేట్ లేనట్టే అని అంటున్నారు.

పైగా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కూడా ప్రస్తుతానికి స్థిరంగా లేదు. ప్రస్తుతం ఆయన కేరళలో భుజానికి సంబంధించిన ఆయుర్వేద వడియం చేయించుకుంటున్నాడు. ఇలాంటి సమయం లో ‘ఓజీ 2’ అప్డేట్ ని ఇవ్వడం సరి కాదని, మేకర్స్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. దీంతో ‘ఓజీ 2’ అప్డేట్ గురించి ఎంతో ఆశగా ఎదురు చూసిన ఫ్యాన్స్ కి నిరాశే ఎదురైంది. ఈ ఏడాదికి పంజా రీ రిలీజ్ తో సరిపెట్టుకోవడమే. ఇకపోతే సెప్టెంబర్ 25 న ఓజీ చిత్రం విడుదలై సరిగ్గా ఏడాది పూర్తి అవుతుంది. కనీసం అప్పుడైనా ‘ఓజీ 2’ అప్డేట్ వస్తుందో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper