Best Phones Under 50000 : స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే, ప్రాసెసర్‌తో పాటు ఇప్పుడు వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా కీలక ఫీచర్‌గా మారింది. గతంలో ప్రీమియం ఫోన్లకే పరిమితమైన ఈ సదుపాయం ప్రస్తుతం రూ.50 వేల లోపు ధరలోనూ అందుబాటులోకి వచ్చింది. వైర్‌లెస్ ఛార్జింగ్ వల్ల కేబుల్స్ అవసరం లేకుండా ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ బడ్జెట్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్ ప్రాధాన్యంగా చూస్తున్న వారికి కొన్ని ఆసక్తికరమైన ఆప్షన్స్ ఉన్నాయి.
Motorola Edge 70 Pro+
రూ.50 వేల లోపు లేటెస్ట్ ఆప్షన్లలో Motorola Edge 70 Pro+ ఒకటి. ఇందులో 6.8 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. MediaTek Dimensity 8500 Extreme ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 12GB RAM, 256GB స్టోరేజ్ లభిస్తాయి. 6,500mAh బ్యాటరీకి 90W వైర్డ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. వెనుక 50MP + 50MP అల్ట్రావైడ్ + 50MP టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. దీని ధర రూ.47,999.
Google Pixel 10a
కెమెరా, సాఫ్ట్‌వేర్ అనుభవానికి ప్రాధాన్యం ఇచ్చేవారికి Google Pixel 10a మరో ఆప్షన్. ఇందులో 6.3 అంగుళాల pOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. Google Tensor G4 చిప్‌సెట్, 8GB RAM, 256GB స్టోరేజ్ ఉన్నాయి. 5,100mAh బ్యాటరీకి 30W వైర్డ్, 10W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. 48MP + 13MP డ్యూయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.49,999.
Samsung Galaxy S24 FE
Samsung ప్రీమియం అనుభవాన్ని కోరుకునేవారికి Galaxy S24 FE పరిశీలించదగిన ఫోన్. ఇందులో 6.7 అంగుళాల Dynamic AMOLED 2X డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. Exynos 2400 ప్రాసెసర్, 8GB RAM, 512GB వరకు స్టోరేజ్ లభిస్తాయి. 4,700mAh బ్యాటరీతో వైర్డ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ప్రస్తుతం 8GB + 256GB వేరియంట్ ధర రూ.45,999గా ఉంది.
Oppo Reno 14 Pro 5G
వైర్‌లెస్ ఛార్జింగ్ వేగం ముఖ్యమైతే Oppo Reno 14 Pro 5G ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇందులో 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. Dimensity 8450 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 6,200mAh బ్యాటరీ, 80W వైర్డ్, ఏకంగా 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 12GB + 256GB వేరియంట్ ధర రూ.49,999.
Nothing Phone 2
తక్కువ ధరలో వైర్‌లెస్ ఛార్జింగ్ కోరుకునేవారికి Nothing Phone 2 కూడా ఒక ఆప్షన్. ఇందులో 6.7 అంగుళాల LTPO OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్, 4,700mAh బ్యాటరీ, 45W వైర్డ్, 15W Qi వైర్‌లెస్ ఛార్జింగ్ ఉన్నాయి. రెండు 50MP రియర్ కెమెరాలు, 32MP ఫ్రంట్ కెమెరా లభిస్తాయి. ప్రస్తుతం ఈ ఫోన్ తగ్గింపు ధరల్లో అందుబాటులో ఉంది.
మొత్తంగా చూస్తే.. రూ.50 వేల బడ్జెట్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు పెద్ద బ్యాటరీ, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, మంచి కెమెరాలు, శక్తివంతమైన ప్రాసెసర్లతో పలు ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుల అవసరాలను బట్టి వీటిలో సరైన మోడల్‌ను ఎంచుకోవచ్చు.